అయితే అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు బంగారం కొంటే శుభమని ఆ రోజు ఎంతో కొంత బంగారాన్ని కొంటారు. అయితే అక్షయ తృతీయ రోజున వ్యాపారస్తులకి నిరాశే ఎదురైంది అని మనం చెప్పవచ్చు.
ఆదివారం నాడు బంగారు ఆభరణాల విక్రయాలు ఏకంగా 95 శాతం పడిపోయాయి. కొనుగోలు దారులను ఆకర్షించేందుకు కొన్ని కార్పొరేట్ నగల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లతో ఆన్లైన్ సేల్స్ ప్రారంభించారు కానీ ఫలితం లేకపోయింది.
పండుగ సెంటిమెంట్లకు పోయి ఉన్న డబ్బును ఖర్చు చేస్తే ఇంకేం తింటారు అనుకున్నారేమో ప్రజలు. బంగారం పై కొంత కూడా ఆసక్తి చూపించలేదు. మరో వైపు చూస్తే 10 గ్రాముల పసిడి రూపాయలు 48 వేలకు చేరడం కూడా ఇందుకు కారణమే. గత ఏడాది అక్షయ తృతీయతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు నమ్మకాలు 95 శాతం పడిపోయి అంటున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మహా అయితే పది శాతం అమ్మకాలు ఉంటాయి అని అంటున్నారు. ఇలా పసిడిని కొనుగోలు చేసే నాథుడే కనబడట్లేదుట. ఆన్లైన్ అమ్మకాలు ద్వారా బంగారాన్ని కొనేస్తారు అని అనుకున్న వ్యాపారస్తులకు బొమ్మ పడింది. ఇలా ఆన్లైన్ అమ్మకాలు సాగించిన బంగారు షాపల వ్యాపారస్తుల ఆశలు నిరాశ అయిపోయాయి.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments