పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒకసారి పేటీఎమ్ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం..
పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎమ్ పాప్యులర్ అయినంతంగా మరే నగదు రహిత వ్యవస్థ ప్రసిద్ది చెందలేదు. రోజుకి 20 లక్షల ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే పేటీఎమ్ సంస్థ ప్రస్తుతానికి 50 లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహించడం చూస్తే పేటీఎమ్ భారత జనాల్లో ఎంతగా చొచ్చుకుపోయిందో తెలిసిపోతుంది. ఇదంతా ఒక్క రోజులో ఏమీ జరగలేదు. ఎన్నో ఏళ్ల కృషి, దీర్ఘకాల ప్రణాళికతోనే ఇదంతా జరిగింది. ఇంజినీరింగ్ విద్య నుంచి డిజిటల్ చెల్లింపులంటే పేటీఎమ్ అనేలా ఆ సంస్థను విజయ శేఖర్ శర్మ మలిచిన తీరు ఈనాటి యువతకు ఆదర్శం. అదెలాగో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
విజయ్ శేఖర్ శర్మ మొదటి నుండి హిందీ మీడియం లోనే చదివాడు. ఎంతో ప్రతిభావంతుడైన విద్యార్ధి కావడం వల్ల అతడి 15 వ సంవత్సరంలో ఢిల్లీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ దొరికింది. దాంతో విజయ్ ఇంజనీరింగ్ చదవడానికి ఢిల్లీ వచ్చాడు. ఐతే స్కూల్ లో చదివే రోజుల్లో విజయ్ కి మొదటి బెంచి లో కూర్చునే అలవాటు ఉండేది అలానే ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మొదటి బెంచి లో కూర్చోడం జరిగింది..
కాలేజీ లో జరిగిన ఒక సంఘటన:
ఆలా ముందు బెంచీలో కూర్చున్న విజయ్ ని ఒక టీచర్ తన వద్దకు వచ్చి ఇంగ్లీష్ లో ఒక ప్రశ్న అడిగింది. అది ఇంగ్లీష్ లో ఉండటం వలన సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో ఆ టీచర్ తన తోటి విద్యార్థులు ముందు హేళన చేస్తూ ఇకనుండి వెనకాల బెంచీలో కూర్చోవాలని ఆదేశించింది.
ఆ సంఘటన తరువాత విజయ్ క్లాసులకు వెళ్లడం మానేసి గ్రంధాలయం లో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. ఆలా చాలా మంది సక్సెస్ స్టోరీస్ చదవడం వల్ల అవి విజయ్ జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి.. అలాగే అది తన ఇంగ్లీష్ ను కూడా మెరుగు పరిచింది. అంతేకా ఈ కారణం చేతే తనలో ఆలోచనలు మారుతూ తాను కూడా బాస్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం:
ఆలా తన ఆలోచనలకి అనుగుణంగా కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం మొదలు పెట్టి కోడింగ్ కూడా నేర్చుకున్నాడు. తన 19 వ ఏట తన తరగతి స్నేహితుడు హైందర్ తో కలిసి "ఇండియా సైట్ .కాం" ను డిజైన్ చేసాడు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి రెండు మూడు చిన్న కంపెనీలకు పని కూడా చేశారు.
ఆలా రెండు సంవత్సరాల తరువాత అమెరికా కు చెందిన సంస్థ తమ సైట్ ని ఒక మిలియన్ డాలర్లకు కొనుక్కోవడం జరిగింది. 2001 లో విజయ్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి దక్షిణ ఢిల్లీ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అలా వారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి "వన్ 97 కమ్యూనికేషన్స్" అనే కంపెనీ ని ప్రారంభించారు.
ఇది మొదట్లో మొబైల్ యూజర్లకు వార్తలు, రింగుటోన్స్, మెసేజీలు, జోక్స్ పంపేందుకు ఉపయోగపడింది. 9 /11 త్విన్ టవర్స్ పై దాడి తరువాత వన్ 97 నెమ్మదించడం జరిగింది.. తమ వద్ద పెట్టుబడులు కూడా అయిపోవడంతో ఇద్దరు స్నేహితులు నిరాశకు గురయ్యారు.
ఆలా రెండు సంవత్సరాలుగా పరిస్థితి కొనసాగటం చూసి 2003 ,2004 లో విజయ్ వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేసి తన సొంత కంపెనీ ని కాపాడుకోటం కోసం ప్రయత్నించడం జరిగింది. తన కంపెనీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కోసం తన స్నేహితుడితో కలిసి తన బంధువుల దగ్గర 24 శాతానికి అప్పు తీసుకున్నాడు.
2004 లో తన కంపెనీ పడిపోయే దశలో ఫ్యుజ్ అగర్వాల్ సహాయం దొరికింది.. తాను విజయ్ కంపెనీ లో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి 40 శాతం షేర్లను కొనడం జరిగింది. ఇలా కొనసాగుతున్న సమయం లో విజయ్ ఒకటి గమనించాడు.. అదేంటంటే స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడం, దానికి సంబందించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ రచించాడు.
విజయ్ ఫాYటం .ఛోం అనే ఆన్‌లైన్ సైట్ ని ప్రారంభించాడు. ఆలా ఫాYటం లో మొదట మొబైల్ రీఛార్జి మొదలుపెట్టడం జరిగింది. మార్కెట్ లో అనేక ఆన్లైన్ సైట్స్ ఉన్నా పేటియం చాల సులభతరంగా ఉండేది. అందుకే అత్యంత తక్కువ సమయంలో అందరికి చేరువైనది.
విజేతలు ఎప్పుడూ రెడ్ కార్పెట్‌ఫై నడవరు. ఇదే విషయం శర్మ విషయంలోనూ నిజమైంది. వ్యాపారంలో ఆయనను కూడా భాగస్వాములు మోసం చేశారు. అయితే అందరిలాగా ఆయన డీలా పడలేదు. 2005లో అధిక వడ్డీకి అప్పు తీసుకున్నారు. తన వెంచర్‌లో రూ.8 లక్షల పెట్టుబడి పెట్టారు. నమ్మినవారే మోసం చేయడంతో 40% కోల్పోయాడు. అయితే అంత తొందరగా నిరాశ చెందలేదు. భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగాడు. వన్97 కమ్యూనికేషన్స్‌లో భాగంగా 2011 లో పేమెంట్ల వ్యవస్థ ప్రారంభం అయ్యే వరకూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చివరకు విజయం సాధించాడు. పేటీయం లో చైనా కూడా పెట్టుబడులు పెట్టింది.. ఇదీ పేటీయం స్టోరీ.
అయితే గూగుల్ తాజగా పేటీఎంకు భారీ షాకిచ్చింది. యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి పేటీఎం యాప్ గూగుల్ ప్లేస్టోర్ రూల్స్‌ను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎంకు భారీ షాకిచ్చింది. ఒక్కదెబ్బతో పేటీఎంను ప్లే స్టోర్ లో కనిపించకుండా చేసింది. అంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. దీనికి కూడా ఒక ప్రధాన కారణంగా ఉంది. గ్యాంబ్లింగ్ యాప్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ప్రోత్సహించమని గూగుల్ స్పష్టం చేసింది. అందుకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్లు తెలిపింది.
గూగుల్ తన బ్లాగ్‌లో ఇండియాలో గ్యాంబ్లింగ్ పాలసీపై ఒక పోస్ట్ చేసింది. ఇందులో గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన విషయాలను హైలైట్ చేసింది. ‘తమ కస్టమర్లకు సురక్షితమైన సేవలు అందిస్తాం. అలాగే డెవలపర్లకు స్థిరమైన వ్యాపారాలకు ప్లాట్‌ఫామ్‌ను అందిస్తున్నాం. వాటాదారులందరికీ ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకుంటాం’ అని గూగుల్ తెలిపింది.
యాప్‌లో అందుబాటులో ఉన్న క్యాసినో గురించి మాట్లాడుతూ.. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ) సుజనే ఫ్రేయ్ తాము ఆన్‌లైన్ క్యాసినోను అనుమతించం. అలాగే ఇతర గ్యాంబ్లింగ్ యాప్స్‌ను ప్రోత్సహించం. స్పోర్ట్స్ బెట్టింగ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అంటే ఒక యాప్ కస్టమర్లను వేరొక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తే అక్కడ టోర్నమెంట్‌లో పాల్గొని క్యాష్ ప్రైజ్, మనీ గెలుచుకోవడం చేస్తుంటారు. ఇది కూడా తమ పాలసీలకు వ్యతిరేకం అని వివరించారు.
కస్టమర్లకు హానీ నుంచి కాపాడేందుకు తన వద్ద పాలసీలు ఉన్నాయి. ఒక యాప్ మా పాలసీలకు వ్యతిరేకంగా ఉండటం లేదా నిబంధనలను అతిక్రమిస్తే.. వెంటనే ఆ విషయాన్ని డెవలపర్లకు తెలియజేస్తాం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌ను తొలగిస్తాం. మళ్లీ డెవలపర్లు తమ పాలసీలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తే మళ్లీ యాప్‌ను అందుబాటులో ఉంచుతాం. అంతేకాకుండా ఇలా పదేపదే తప్పులు చేస్తూ వస్తే.. గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్లను తొలగిస్తాం’ అని వివరించారు. ఇకపోతే ఇంకా ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపిస్తోంది.
గూగుల్ ప్లేస్టోర్ కేవలం పేటీఎం యాప్‌ను మాత్రమే కాకుండా పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్‌ను కూడా తొలగించింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్‌ను కలిగిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్‌ను ఉపయోగించొచ్చు. అయితే ఇప్పుడు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని భావిస్తే మాత్రం సారీ అని చూపిస్తోంది. అయితే పేటీఎం కంపెనీ యాజమాన్యం మాత్రం అతిత్వరలోనే యాప్ మళ్లీ అందుబాటులోకి వస్తుందని ట్వీట్ చేసింది. యూజర్లు డబ్బులు ఎక్కడికీ పోవని భరోసా ఇచ్చింది.
సో, పేటీయం స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
వ్యాపారం అంటూ తమవద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడం తో పాటు గ్యారెంటీగా పెట్టి ఆస్తులని ఉద్దేశపూర్వకంగా విక్రయించారని కరూర్ వైశ్య బ్యాంక్ అధికారులు నగర నేర పరిశోధన విభాగం లో ఫిర్యాదు చేశారు. అ...
0 Comments