మాన‌సిక జాడ్యాల‌కు జిడ్డు కృష్ణ‌మూర్తి ప‌రిష్కారాలు....

img

మ‌న మాన‌సిక జాడ్యాల‌కు జిడ్డు కృష్ణ‌మూర్తి ప‌రిష్కారాలు..

మ‌హ‌నీయుడు జిడ్డు కృష్ణమూర్తి 1895లో మదనపల్లిలో జన్మించారు. అనీబిసెంట్ సంరక్షణలో పెరిగారు. తాను గ్ర‌హించిన జ్ఞానాన్ని ఏ సంస్థల ఆధ్వర్యం లేకుండానే ప్రపంచమంతా పర్యటించి అంద‌రికీ అందించారు. మానవుడిని దుఃఖాల నుండి, సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే ప్రధానాంశంగా ప్రసంగాలు కొన‌సాగించారు. సత్యం అనేది బాటలు లేని సీమ అనీ, దానిని చేరుకోవడానికి మతాలుగానీ, సంస్థలుగానీ, గురువుగానీ అవసరంలేదనీ స్ప‌ష్టం చేశారు. అటువంటి జ్ఞాన గుళిక‌ల్లో కొన్ని మీకోసం...

స‌మ‌స్య అవ‌గాహ‌న‌ను అడ్డుకుంటుంది:

ఏ సమస్య అయినా ఎప్పుడూ పాతది కాదు. కాని దాన్ని మనం పాత సూత్రాలతో సమీపిస్తాం. అదే సమస్య మనకి అవగాహన కాకుండా ప్రతిబంధకమవుతుంది. ఈ ప్రతిక్రియలను అనాసక్తంగా అవలోకించండి. ఊరికే అనాసక్తంగా వాటిని తెలుసుకుని ఉండండి. అవి సమస్యని పరిష్కరించలేవని గ్రహించండి. సమస్య నిజమైనది. అది వాస్తవమైనది. కాని, దాన్ని సమీపించే పద్ధతి తగినట్లు ఉండదు. ఉన్నదానికి తగిన ప్రతిక్రియ లేకపోతే సంఘర్షణ బయలుదేరుతుంది. సంఘర్షణే సమస్య. ఈ మొత్తం ప్రక్రియ అవగాహన అయితే, మీ పొగ తాగటం గురించి మీరు తగిన చర్య తీసుకుంటారని మీరే తెలుసుకుంటారు.

తప్పించుకోవటం వల్లనే గందరగోళం: 

ఏది ముఖ్యమో ఎందుకు స్పష్టం కావటం లేదు? స్పష్టం కావటానికి సహాయం కావాలా, లేక గ్రహించటానికి ఇష్టపడటం కావాలా? గ్రహించకుండా ఉండాలనే కోరిక క్రమంగా కొంతకాలానికి మాయమై పోతుందా? మీకు స్పష్టం కాకపోవటానికి కారణం మీరు యథార్ధాన్ని గ్రహించటానికి ఇష్టపడటం లేదన్నది ప్రాథమిక సత్యం కాదా? స్పష్టం కావటం మీకు ఎందుకు ఇష్టం లేదంటే, అది మీ దైనందిన జీవనవిధానాన్నే తలక్రిందులు చేస్తుందని. మీరు ఇచ్ఛా పూర్వకంగానే ముందుకి నెట్టుతున్నారని తెలుసుకుంటే మీకు వెంటనే స్పష్టం అవదూ? ఇలా తప్పించుకోవటం వల్లనే గందరగోళం ఏర్పడుతుంది.

రోజురోజుకీ నిన్నటి భారం మోస్తున్నాం:

కొత్తదన్నా తెలియనిదన్నా ఎంత భయపడతాం మనం! మనకి నిత్యం ఉండే అలవాట్లలో దైనందిన చర్యల్లో, దెబ్బలాటల్లో, ఆదుర్దాలో మూసుకుపోయి ఉంటాం. అదే పాత పద్ధతిలో ఆలోచించాలనుకుంటాం. అదే దారిలో వెళ్లాలనుకుంటాం. అవే ముఖాలు చూస్తాం. అవే ఆందోళనలు పెట్టుకుంటాం. క్రొత్తవారిని కలుసుకోవటానికి ఇష్టపడం. ఒకవేళ కలుసుకున్నా ముభావంగా వ్యాకులపాటుతో ఉంటాం. తెలియని జంతువేదైనా ఎదురైతే ఎంత భయపడతాం! ధైర్యం చేసి బయటికి వచ్చినా అది ఆ గోడలు ఇంకా విస్తృతం చేసుకుని వాటి మధ్యనే. మనకి అంతం అంటూ ఉండదు. ఎప్పుడూ కొనసాగే దాన్నే పోషిస్తూ ఉంటాం. రోజురోజుకీ నిన్నటి భారం మోసుకుపోతూ ఉంటాం. 

దుఃఖాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే అది అంతం కాదు:

దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి గాని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దుఃఖం కొనసాగేటట్లు చేయటమే. దుఃఖాన్ని నిర్లక్ష్యం చేయటమంటే దాన్నుంచి పారిపోవటమే. దుఃఖాన్ని అర్థం చేసుకోవటానికి ఆచరణాత్మకమైన, ప్రయోగాత్మకమైన పద్ధతి అవసరం. ప్రయోగం చేయటమంటే ఒక నిశ్చిత ఫలితం కోసం ప్రయత్నించటం కాదు. నిశ్చిత ఫలితం కోసం ప్రయత్నిస్తే ప్రయోగం చేయటం సాధ్యంకాదు. మీకు కావలసినదేదో మీకు తెలిసినప్పుడు దాన్ని అనుసరించటం ప్రయోగం చేయటం కాదు. దుఃఖాన్ని తప్పించుకుందామని మీరనుకుంటే, అంటే దాన్ని నిందిస్తే, అప్పుడు దాని సంపూర్ణ క్రియని మీరు అర్థం చేసుకోరు. దుఃఖాన్ని దాటవెయ్యటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆలోచించేదల్లా దాన్ని ఎలా తప్పించుకోవాలా అనే. దుఃఖాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని సమర్థించటానికిగాని తప్పించుకోవటానికి గాని ఏవిధమైన చర్యా కావాలని తీసుకోకూడదు. మనస్సు పూర్తిగా అనాసక్తంగా, నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటే ఏవిధమైన సందేహం లేకుండా దుఃఖం తేటతెల్లం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు.

ధ‌నంతుల‌కు స్వేచ్ఛ దుర్ల‌భం:

ఆస్తిపాస్తులున్న మనిషికి స్వేచ్ఛగా ఉండాలంటే ఎంత కష్టం! ధనవంతుడు తనకున్న ధన్నాన్ని అవతలికి త్రోసి వెయ్యటం మహాకష్టం. వేరే ఇంకేవైనానో, మరింత గొప్ప లాలసత్వం కలిగించేవో ఉన్నప్పుడే ధనవంతుడు తన సంపదలిచ్చే సౌఖ్యాన్ని వదులుకోడు. తన ఆకాంక్ష ఫలించే మరొక స్థాయి దొరికితే గాని ఉన్నదాన్ని వదులుకోడు. ధనవంతుడికి ధనమే అధికారం. దాన్ని అతడు చలాయిస్తాడు. పెద్ద పెద్ద మొత్తాలు ఇచ్చివెయ్యవచ్చు. కాని ఇచ్చేవాడు అతడే!

మనస్సు కాలరహితమైన దాన్ని రూపొందించలేదు:

జీవితం ఆలోచనే అయితే, ఏమీ లేదు. దానిద్వారా మనం శాంతీ, ఆనందం పొందాలనీ, అన్ని కష్టాలనూ అడ్డుకునే రక్షకసాధనంగా ఉండాలనీ, మనుష్యులలో ఐకమత్యాన్ని నెలకొల్పే సాధనంగా ఉండాలనీ కోరుకుంటాం. దాన్ని ఏవిధమైన ప్రయోజనానికీ ఉపయోగించుకోవటం కుదరదు. ప్రయోజనం అనగానే లక్ష్యసాధన అని అర్థం వస్తుంది. అప్పుడు మళ్లీ వెనక్కి వస్తాం - ఆలోచనా ప్రక్రియతో సహా, మనస్సు కాలరహితమైన దాన్ని రూపొందించలేదు, తన లక్ష్యం కోసం దాన్ని మలుచుకోలేదు. దాన్ని ఉపయోగించుకోలేదు. కాలరహితమైనది ఉన్నప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. లేకపోతే, జీవితం అంటే దుఃఖం, సంఘర్షణా, బాధా. ఆలోచన ఏ మానవసమస్యనీ పరిష్కరించలేదు. ఎందుకంటే ఆలోచనే సమస్య కనుక. జ్ఞానం అంతం కావటమే వివేకానికి ఆరంభం. వివేకం కాలానికి చెందినది కాదు. అనుభవం, జ్ఞానం కొనసాగటం కాదు వివేకం. కాలమయ జీవితం అంటే గందరగోళం, దుఃఖం. కాని, ఉన్నస్థితి కాలరహితంగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది.

అన్వేషణ అంతా అంతమైతేనే అవ‌గాహ‌న:‌

ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటంతో అనంతమైన ప్రేమా, మార్దవం, నమ్రతా కలుగుతాయి. బహుశా మీరు అన్వేషించేది అదే కావచ్చు. కాని దాన్ని వెతకటం, కనుక్కోవటం సాధ్యం కాదు. కావాలని మీరేం చేసినా సరే మీరు కనుక్కోలేరు ఎన్నటికీ. అన్వేషణ అంతా అంతమైనప్పుడు అది ఉంటుంది. మీకు తెలిసిన దాన్ని గురించే, అంటే మరింత తృప్తికోసమే ఎప్పుడూ మీరు వెతకగలరు. అన్వేషించటం, జాగ్రత్తగా గమనించటం వేరువేరు ప్రక్రియలు. ఒకటి బంధిస్తుంది. రెండవదానివల్ల అవగాహన కలుగుతుంది. అన్వేషణకి ఎప్పుడూ ఒక గమ్యం దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ బంధంలోనే ఉంటుంది. అనాసక్తంగా జాగ్రత్తగా గమనించటం వల్ల క్షణక్షణమూ ఉన్నస్థితి అవగాహన అవుతుంది. ఉన్నస్థితి క్షణక్షణానికీ అంతమవుతుంది. అన్వేషణలో కొనసాగటం జరుగుతుంది. అన్వేషణ వల్ల కొత్తది ఎప్పుడూ దొరకదు. అంతమైనప్పుడే కొత్తది ఉంటుంది. కొత్తది అనంతమైనది. ప్రేమ ఒక్కటే నిత్యనూతనమ్యేది.

సంతృప్తిని కోరటం వల్లనే అసంతృప్తి:

ఇంతకీ మీరు సంతృప్తికోసం వెతికి దాన్ని కనుక్కోలేకపోయారా? సంతృప్తిని కోరటం వల్లనే అసంతృప్తి కలుగుతుందా? వెతకటం అనగానే తెలిసిన దానికోసం అని అర్థం వస్తుంది. మీరు అసంతృప్తిని పొందానంటున్నారు, అయినా ఇంకా అన్వేషిస్తున్నారు. మీకింకా అది దొరకలేదు మీకు సంతృప్తి కావాలి. అంటే మీకు అసంతృప్తి లేదు. మీకు నిజంగా అసంతృప్తి ఉంటే దాన్నుంచి పారిపోయే మార్గం కోసం ప్రయత్నించరు. సంతృప్తి పడాలని ప్రయత్నిస్తే ఏదో విధమైన బాంధవ్యంలో - సొంతమైన వాటితోగాని, ఒక మనిషితోగాని, ఒక సిద్ధాంతంతోగాని ఏర్పడిన బాంధవ్యంలో అసంతృప్తి దొరకుతుంది మీకు.

అతిగా తెలిస్తేనే అన‌ర్థం:

జీవితం అసలు ఎంత సరళంగా ఉంటుందో, దాన్ని మనం అంత క్లిష్టం చేస్తాం! జీవితం క్లిష్టమైంది. కాని దానితో సరళంగా ఎలా ఉండాలో మనకి తెలియదు. క్లిష్టంగా ఉన్నదాన్ని సరళంగా సమీపించాలి, లేకపోతే దాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోలేము. మనకి అతిగా తెలుసు, అందుకే జీవితం మనకి అందకుండా పోతోంది. అతిగా ఉంటే అసలు లేనట్లే. ఉన్న కొంచెంతో అపారమైన దాన్ని ఎదుర్కొంటాం. అపరిమితమైన దాన్ని ఎలా కొలవగలం? మన దర్పం మనల్ని మందకొడిగా చేస్తుంది. మన అనుభవం, జ్ఞానం మనల్ని బంధించి ఉంచుతాయి. జీవన ప్రవాహం మన పక్కనుంచే కొట్టుకుపోతుంది.

నాయ‌కుడి ల‌క్ష్యం స్వ‌యం క‌ల్పితం:

ప్రతి నాయకుడూ అధికారాన్ని ఒక లక్ష్యానికి సాధనంగా వినియోగిస్తాడు. మామూలు మనిషి కూడా అదే పని చేస్తాడు. కాని, నాయకుడు అందరి క్షేమం కోసం వినియోగిస్తున్నానని చెబుతాడు. మామూలు మనిషి తన కోసమే తాను చూసుకుంటాడు. నియంతా, అధికారీ, నాయకుడూ... వీరంద‌రి లక్ష్యమూ, వారిని అనుసరించేవారి లక్ష్యమూ ఒకటే, ఒకలాంటివే. ఒకటి విస్తృతమైతే మరొకటి అవుతుంది. రెండూ స్వయంకల్పితాలే. మనం ఒకదాన్ని నిరసించి రెండవదాన్ని మెచ్చుకుంటాం. కానీ లక్ష్యాలన్నీ తమకున్న దురభిప్రాయాలూ, ఉద్దేశాలూ, భయాలూ, ఆశలూ వీటి ఫలితంగా వచ్చినవే కాదా? మీరు ఇచ్ఛా, కృషీ, శక్తి వినియోగిస్తారు మహోత్కృష్టమైన దాని కోసం. మహోత్కృష్టమైనది కోరిక - అంటే ఇచ్ఛ రూపొందించినదే. ఇచ్ఛ తన లక్ష్యాన్ని తాను సృష్టించుకుని దానికోసం ప్రతిదాన్నీ త్యాగం చెయ్యటమో, అణచిపెట్టటమో చేస్తుంది. లక్ష్యం తానే. కాని, దాన్ని మహోత్కృష్టమైనది అనీ, ప్రభుత్వం అనీ, సిద్ధాంతం అనీ పేర్లు పెడుతుంది.

ఇలాంటి అనేక జీవిత సమస్యలకు జిడ్డు క్రిష్ణమూర్తి తనదైన శైళిలో పరిష్కారాలు చూపించారు.. 

మరిన్ని

Comments

0 Comments

వైరల్

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()