ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేంస్? ఎందుకు ఆకర్షితులవుతున్నారు? తమన్న, కోహ్లీ లాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటివాటిని ఎండోర్స్ చేస్తున్నారు? దీనిపై కోర్ట్ లు, ప్రభుత్వాలు ఏమంటున్నాయి? తళ్ళిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇలాంటి ఆశక్తికర అంశాలు ఒక్కసారి చూద్దాం..
ఇంతకుముందు రోజుల్లో పేకాట ఆడుతూ పల్లెల్లో, నగరాల్లో బోర్ కొట్టునప్పుడు సరదాగా ఇంటిల్లిపాదీ లేదా అరుగులమీద ఆడుతూ ఉండేవారు.. కొందరు డబ్బుపెట్టి మరీ మజా కోసం ఆడతారు.. కొందరైతే శ్రుతిమించి వేలు, లక్షల్లో కూడా బెట్టింగ్ పెట్టి ఆడుతూ ఉంటారు.. డబ్బులు పెట్టి ఆడడం చట్టరీత్యా నేరం.. అయితే ఇలాంటి ఆటలు ఇప్పుడు ఆన్ లైన్లో ప్రాచుర్యం పొందాయి.. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉండడం వల్ల ఆన్ లైన్ రమ్మీ లాంటి సంస్థలు యాప్స్ రూపం లో ఇవి అందుబాటులోకి తెచ్చాయి..
మొదట కొంత బోనస్ అమౌంట్ ఇచ్చి ఆట మొదలుపెట్టేలా పురిగొల్పుతారు.. ఆ తర్వాత ఆ ఆటలో మజా రావడం తో ఎలాగైనా మరింత డబ్బు గెలవాలనే ఉద్దేశ్యంతో తమ వద్ద ఉన్నవి, ఇంట్లో తీసుకున్నవి అన్నీ అందులో పెట్టి చివరకు మొత్తం డబ్బు పోగొట్టుకుంటున్నారు.. అప్పుడు భయంతో ఏం చెయ్యాలో తెలియక కొందరు బలవన్మరణం చేసుకుంటుండగా కొందరు డిప్రెషన్ లోకి వెల్లిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. చెన్నై లో ఒక యువకుడు, దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్ ఆటలో డబ్బు పోగొట్టుకుని తనువు చాలించడం తో ఈ విషయం హైకోర్ట్ ద్రుష్టికి వెళ్ళింది.. ఇదే విషయమై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేసింది.. అయితే ఇంతవరకూ సరైన నిర్ణయం తీసుకున్నట్టు, ఈ ఆటలు పూర్తిగా బ్యాన్ అయినట్టు సమాచారం లేదు..
అయితే తమన్నా, గంగూలీ, కోహ్లీ వంటి టాప్ సినిమా స్టార్లు ఈ ఆటలను ఆడాలని ప్రమోట్ చేస్తుండడం ఆశ్చర్యపరుస్తుందని కోర్టు అభిప్రాయపడింది.. ఇది క్రిమినల్ నేరం గా పరిగణించవచ్చని కూడా అంటోంది.. దీంతో అప్రమత్తమైన పలువురు స్టార్లు ఈ కాంట్రాక్ట్ లనుండి తప్పుకున్నారు.. ఎక్కువ మొత్తం లో డబ్బు ఆఫర్ చేస్తుండడం తో కొందరు స్టార్స్ ఇలాంటి పనులు చేస్తుంటారు..
ఇదంతా ఒక ఎత్తయితే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కొన్ని విషయాలు గమనించాలి.. తమ పిల్లలు ఏంచేస్తున్నారు? ఎలాంటి ఆటలు ఆడుతున్నారు? ఫోన్లో ఎంతసమయం గడుపుతున్నారు? అనే విషయాలు గమనించి జాగ్రత్త పడాలి.... జాగ్రత్త పడడమంటే తిట్టడం, కొట్టడం కాదు.. వారితో ప్రేమగా మెలుగుతూ సమయాన్ని గడపాలి.. బయటకి తీసుకెల్లాలి.. తప్పు చేస్తే సర్ది చెప్పాలి.. ప్రేమను మించిన గొప్ప ఆయుధం లేదని గ్రహించాలి.. కొడితే, తిడితే ఇంకా మొండిగా, మూర్ఖంగా తయారవుతారు..
సో, ఇలాంటి ఆటలు ఆడవద్దు, ఆడనీయవద్దు.. చెస్, పజిల్స్, క్యారెంస్ వంటివి ఇంటిల్లిపాదీ కలిసి ఆడుతూ మీ విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని న్యూస్ 6జి ఆశిస్తోంది..
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
మన మానసిక జాడ్యాలకు జిడ్డు కృష్ణమూర్తి పరిష్కారాలు.. మహనీయుడు జిడ్డు కృష్ణమూర్తి 1895లో మదనపల్లిలో జన్మించారు. అనీబిసెంట్ సంరక్షణలో పెరిగారు. తాను గ్రహ...
0 Comments