రిలేషన్షిప్ లో ఉన్నవారు చెప్పుకునే 32 అబద్దాలు ఇవే?

img

మీరు మీ జీవితభాగస్వామితో సమయాన్ని గడిపేటప్పుడు వారితో ఎలాంటి అబద్ధాలు ఆడుతుంటారో కొన్ని ఇప్పుడు మనం గుర్తుచేసుకుందాం.. అవి చాలా సరదాగా, నవ్వు పుట్టిస్తూ ఉంటాయి..

స్నేహితులు, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులకు మనం రోజూ చెప్పే చిన్న చిన్న అబద్ధాలు మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయం లో అనుభవం ఉంటుంది.. అంతవరకు బాగానే ఉందిగానీ ముఖ్యంగా భాగస్వామితో ఈ అబద్ధాలు చెప్పేటప్పుడు సాధ్యమైనంత నిజాయితీగా ఉండడం బెటర్.. ఒకవేళ అబద్దం చెప్పినా సరే అందులో కొంత నిజాన్ని కలిపి చెప్పడం అవసరం..

మీరు ఐదు వారాలు లేదా యాభై సంవత్సరాలు కలిసి ఉన్నా, 100% నిజాయితీ కలిగి ఉండడం ద్వారా సంతోషకరమైన సంబంధానికి "గ్యారెంటీ" ఉంటుందనుకుంటే పొరపాటే అని ప్రతి "స్మార్ట్ భాగస్వామి" కీ తెలిసే ఉంటుంది. వాస్తవానికి, "ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ" లో ప్రచురితమైన వ్యాసం ప్రకారం, ఆ చిన్న చిన్న అబద్ధాలు వాస్తవానికి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి, ఆ చిన్న అబద్దాలు పెద్ద గొడవలను నివారించేందుకు సహాయపడతాయి. కాబట్టి, మీ జీవిత భాగస్వామి చేసిన వంటలను తరచుగా ప్రశంసిస్తూ ఉండండి.. కుటుంబాన్ని టెన్షన్ నుండి బయటపడేసి అదుపులో ఉంచడానికి ఇలాంటి అబద్ధాలు తప్పేమీ కావు అని గుర్తించండి.. అలాంటి వాటిలో కొన్ని ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.. వీడియో చివరి వరకూ చూడండి..

- మీరు ఇంట్లో ఏసీ 25 డిగ్రీస్ ఉండడానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి 20 డిగ్రీస్ ఉండడానికి ఇష్టపడుతుంది. అలాన్టప్పుడు వారు మిమ్మల్ని చూడకుండా ఉన్న టైం లో ఏసీ రిమోట్ ని తీసుకుని కొన్ని డిగ్రీలు పెంచుతారు.. తరువాత మీరు "ఎలా జరిగిందో నాకు తెలియదు" అని ఆమె ముందు నటిస్తారు.

- కొందరు తమ భాగస్వామి గురక పెట్టడం తో రాత్రుల్లు విసుగు చెందుతారు.. అయితే ఆ తరువాత "మీ గురకవల్ల నాకేమీ ప్రాబ్లం లేదు" అని చెప్తారు.. నిజానికి అదొక్క విషయం పక్కనబెడితే అతడిలో పొగడడానికి అనేక మంచి విషయాలు ఉంటాయి.. వీలైతే వాటిని పొగడవచ్చు..

- కొన్నిసార్లు స్నాక్స్ తినేసి మిగిలినవి ఎక్కడో పెడతారు.. తరువాత, నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు..

- మీరు ఒక టీవీ సిరీస్ లో తరువాత వచ్చే ఎపిసోడ్స్ ని కూడా మీ భర్త లేని సమయం లో చూసి ఉండవచ్చు.. కానీ అతడితో కలిసి చూసే సమయం లో "మీరు లేకుండా నేను ఆ సిరీస్ చూడను, తెలుసు కదా?" అని చెప్పి మళ్ళీ అతడితో కలిసి చూస్తారు..

- కొందరు తమ భార్యలతో "మీ అమ్మ చేసే వంట అద్భుతంగా ఉంటుంది" అని చెప్తారు.. నిజానికి బాగా లేకపోయినా భార్యను త్రుప్తిపరచడం కోసం అలా చెప్తారు..

- మీ కాబోయే భార్యకు ఒక "ఎంగేజ్ మెంట్ రింగ్" తీసుకుని ఆమెకు చూపించినప్పుడు, ఆమె "నేను కూడా ఇదే రింగ్ ఐతే బాగుంటుందని అనుకున్నాను, సరిగ్గా అదే తీసుకువచ్చారు" అని ఆనందం తో చెప్తుంది.. కానీ నిజానికి ఇంకా పెద్ద రింగ్ ఐతే బాగుండు అని ఆమె మనసులో ఉంటుంది..

- ఇంట్లో చెత్తబుట్ట నిండిపోయి ఉంటుంది.. అది భర్త చూసినప్పటికీ చూడనట్టుగా వెళ్ళిపోతుంటాడు.. అతడి భార్య ఆ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం "ఓహ్ నేను గమనించలేదు, ఇప్పుడే తీస్తాను" అని చెబుతుంటాడు..

-  మీ భార్యకి బాగా ఇష్టమైన ఒక వస్తువు ఆన్ లైన్ లో ఉంది, కానీ దాని ధర చాలా ఎక్కువ.. కానీ మీరు మాత్రం "బాధ పడకు, అది పెద్ద ధర ఏమీ కాదు, నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాను.. " అని  భర్త అంటాడు..

- టీవీ సీరియల్స్, లేదా సినిమాల్లో కనిపించే యాక్టర్స్ తో భాగస్వామిని పోల్చుతూ "మీరు ఆ యాక్టర్స్ కంటే ఎంతో బాగున్నారు" అని పొగుడుతారు.. నిజానికి బాగాలేకపోయినప్పటికీ అలా చెప్తారు..

- "ఆ డ్రెస్స్ మీకు చాలా బాగున్ది" అంటారు కొందరు. నిజానికి అది వారి కలర్ కి, శరీర తత్వానికి సరిపోకపోయినప్పటికీ అలా చెప్పి భాగస్వామిని సంతోషపెడతారు..

- "నిజం చెప్పాలంటే నాకు, నా ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ కి మధ్య అంత సీరియస్ రిలేషన్ షిప్ ఏమీ లేదు" అని అప్పుడప్పుడు తన భాగస్వామి తో అంటూ ఉంటారు.. కానీ నిజానికి ఆ మాట వినడానికి ఏ భర్తా ఇష్టపడడు.. మీ మనసులో ఆ భావన ఉన్నా అతడి గురించి గుర్తు చేయకపోవడమే బెటర్..

- చికెన్ కర్రీ ఇంకా టేస్టీ గా వండి ఉండవచ్చు, కానీ మీ భాగస్వామి తో "ఇది చాలా రుచికరంగా ఉంది" అని పొగుడుతుంటారు..

- "నాకు చలి వెయ్యట్లేదు, ఈ దుప్పటి మీరు తీసుకోండి" అని అంటుంటారు కొందరు.. నిజానికి మీకు చలేస్తున్నా సరే, అలా అబద్ధం చెప్తారు..

- "నాకు ఆకలిగా లేదు" అని అంటుంది భార్య.. ఒక్కోసారి తినడానికి తక్కువ ఫుడ్ మాత్రమే ఉన్నప్పుడు భర్త కడుపునిండా తినాలనే  ఉద్దేశ్యం తో "నాకు ఆకలిగా లేదు" అని అంటుంది..  

- ఏదైనా ఎలెక్ట్రానిక్ ఐటెం గానీ, ఫర్నిచర్ సెట్ గానీ కొని ఇంటికి తీసుకొచ్చినప్పుడు "ఇది నేను ఈజీ గా సెట్ చెయ్యగలను" అంటూ భార్య ముందు ఫోజ్ కొడతారు కొందరు.. కానీ వారికి కూడా అదే మొదటిసారి అని తెలిసినప్పటికీ "నాకు అంతా తెలుసు" అన్నట్టు బిహేవ్ చేస్తారు..

- భార్య యొక్క "చెల్లి లేదా అక్క" ఎవరితోనో డేటింగ్ చేస్తూ ఇంట్లో చెప్పకుండా తిరుగుతుంటుంది.. అది తెలిసిన ఆమె భర్త "నీ సిస్టర్ విషయం ఎంతవరకు వచ్చింది?" అని ఆశక్తిగా అడుగుతాడు..  "అదేం లేదు, వారు జస్ట్ ఫ్రెండ్స్" అని చెప్పి భార్యలు తప్పించుకుంటుంటారు..

- "నా ఫ్రెండ్స్ తో మీ గురించి అస్సలు చర్చించను, పైగా మీరు చాలా మంచి వారు అని చెప్తాను" అని అంటారు కొందరు.. నిజానికి ఎవరికి వారు గప్ చుప్ గా తమ బాధలు క్లోజ్ ఫ్రెండ్ తో చెప్పుకుంటూనే ఉంటారు, పైకి మాత్రం ఏమీ చెప్పనట్టే ఉంటారు..

- "ఆ షర్ట్ నేను ఎంతో ఇష్టపడి మీకోసమే కొన్నాను, మరెందుకు మీరు దాన్ని వేసుకోరు? " అని భార్య అడిగినప్పుడు "అది చాలా స్పెషల్ కదా, అందుకే సంధర్భం ఉన్నప్పుడే వేసుకోవాలని అలా జాగ్రత్తగా దాచాను" అని బదులిస్తాడు.. నిజానికి అతడికి అది అంతగా నచ్చకపోవడం వల్ల తరచుగా వేసుకోడు..

- "ఏం ఆలోచిస్తున్నారు?" అని భార్య అడిగినప్పుడు "నీ గురిన్చే ఆలోచిస్తున్నా" అని అబద్దం చెప్తారు.. నిజానికి ఏ వెబ్ సిరీస్ గురించో లేదా ఇష్టమైన సంఘటన గురించో ఆలోచిస్తూ ఇలా ఠక్కున అబద్దమాడేస్తుంటారు..

- రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ బడ్జెట్ 5 వేలు అయితే మీ భార్య కోరిక కాదనలేక "నీకేం కావాలో అది ఆర్డర్ చేద్దాం" అని గొప్పకు పోయి చివరకు బడ్జెట్ దాటిపోయాక నాలిక్కరుచుకుంటూ ఉంటారు కొందరు..

- "నా మాజీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడేం చేస్తున్నాడో నాకు తెలియదు" అని చెబుతారు కొందరు, కానీ అది తెలుసుకోవాలంటే ఒక్కసారి వారి సోషల్ ఎకౌంట్స్ చూస్తే సరిపోతుంది కదా? నిజానికి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం తో అప్పటికే వారు చూసి ఉంటారు, కానీ ఆ విషయం గురించి ఎవరు  అడిగినా సరే "నాకు తెలియదు, అతడి కాంటాక్ట్ దొరకలేదు" అని సమాధానం చెప్తుంటారు..

- సహజంగా స్నేహితులు ఒక్కోసారి "ఇలా గనక నీవు నీ డైట్ మార్చుకుంటే ఎంతో అందంగా తయారవుతావు" అని చెప్తారు.. వారు "నేను చెప్పిన డైట్ ఫాలో అవుతున్నావా?" అని ఎప్పుడైనా అడిగితే "అవును, అస్సలు మర్చిపోవడం లేదు" అని అబద్దం చెప్పేస్తాం..

- "మా అమ్మకు నువ్వంటే ఇష్టం" అని భర్తతో అంటుంది భార్య, కానీ ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఇంకా ఎక్కువగా ఇష్టపడేదని మాత్రం చెప్పదు..

- "నేను నీ మెసేజ్ చూసుకోలేదు" అని అంటుంటారు కొందరు.. కానీ క్వారెంటైన్ టైం లో ఈ అబద్దం చెప్పే వీలులేకుండా పోయింది..

- "మీరు తినే ఆహారం నాకు కూడా చాలా ఇష్టం" అంటుంది భార్య.. కానీ తరచుగా నాన్ వెజ్ తినడం ఆమెకు ఇష్టం ఉండదు, కానీ భర్త కోసం ఆమె అలా చెప్తుంది..

- "సెల్ఫీ లు తీసి సెండ్ చేసుకుంటూ ఉంటారు డేటింగ్ లో ఉన్నవారు, అయితే వారు ఫిల్టర్ ఉపయోగించి వారి ఫోటో ని మరింత అందంగా మార్చి సెండ్ చేస్తారు, కానీ అవతలి వారికి అది అర్ధమైనా "నీవు చాలా బాగున్నావ్" అంటూ పొగుడుతారు..

- "మా మ్యారేజ్ యానివెర్సరీ కి మేము బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అస్సలు ఇష్టం ఉండదు" అని అంటుంటారు కొందరు.. కానీ భర్త ఒక మంచి గిఫ్ట్ ఆమెకు ప్రెజెంట్ చేసినప్పుడు "చాలా బాగుంది" అని ఎంతో సంతోషపడుతుంది.. అది కొనడానికి ఎంత ఖర్చయిందో కూడా ఆలోచించకుండా గిఫ్ట్ తీసుకుని మురిసిపోతుంటారు కొందరు..

- "నా డైట్ నా వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది" అని భర్తతో చెబుతుంది భార్య, నిజానికి తన డయిట్ వల్ల 1 కిలో వెయిట్ తగ్గినందుకే ఆమె అలా ఫీల్ అయిపోతుంటుంది..

- భర్త ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డాగ్స్, తమ బెడ్ పై వాటి జుట్టును అంటిస్తూ ఉంటాయి.. కానీ భర్తను బాధపెట్టడం ఇష్టం లేక "అవి అలా బెడ్ పైన పడుకోవడం చాలా బాగుంది" అని చెబుతుంది..

- భర్త తన స్నేహితుల ఫోటో లను భార్య కు చూపిస్తున్న సమయం లో "నీ స్నేహితులలో ఎవరూ అంత ఆకర్షణీయంగా లేరు, ఆ ఎయిట్ ప్యాక్స్ ఉన్న వ్యక్తి అయితే చూడడానికి ఏం అంత బాగాలేడు" అని అంటుంది భార్య..

- "నేను కూడా నీలా ఉదయాన్నే గ్రీన్ టీ తాగాలనుకుంటున్నా" అంటుంటారు, కానీ ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ తినేస్తూ గ్రీన్ టీ పోస్ట్ పోన్ చేస్తుంటారు..

- మీ భర్త తన "హోం టౌన్" కి చెందిన క్రికెట్ టీం అంటే ఎంతో ఇష్టపడుతుంటాడు.. అది నిరూపించడానికి వారి కలర్ కోడ్ తో ఉన్న టీ షర్ట్ కూడా వేసుకుని మీముందు ఫోజ్ లు కొడతారు.. కానీ మీరు "అవును, చాలా గొప్ప టీం" అని నవ్వుతూ చెప్తుంటారు..  

ఇలా అనేక అబద్దాలు చెబుతూ కాలం సంతోషంగా వెళ్ళదీస్తుంటారు అనేకమంది భార్యా భర్తలు..  ఇలాంటి చిన్న చిన్న అబద్దాలు మీరు మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తో చెప్పినా, భార్యా భర్తలు ఒకరికొకరు చెప్పుకున్నా అవి కామెంట్ బాక్స్ లో అందరితో సరదాగా షేర్ చేసుకోండి..  

మరిన్ని

Comments

0 Comments

వైరల్

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()