కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సంగతి తెలిసినదే. ఒక పక్క ఆరోగ్యాలు దెబ్బ తింటంటే మరో పక్క చాలా మందికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న దుస్థితి. ఇలా అనేక రకాల దారుణాలని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగు లోకి వచ్చింది. అయితే ఇది నిజంగా దారుణం అనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితి చాలా ఘోరం అనే చెప్పాలి. కరోనా వచ్చింది అని పుకార్లు మొదలై చివరకి వేధింపులు ఎదురయ్యాయి ఆ స్త్రీ కి. ఈ ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది.
ఒక మహిళకి కరోనా సోకింది అని వచ్చిన పుకార్లే దీని అంతటికీ కారణం. కరోనా సోకిందన్న పుకారు తో కాలినీ వాసుల నుండి వేధింపులు ఎదురయ్యాయి. ఆ వేధింపులు మరీ ఎక్కువ కావడం తో పోలీసులకి ఫిర్యాదు చేసింది ఈమె. ఎస్సై రోహిణి అక్కడికి వెళ్లి అనవసరంగా పుకార్లని పట్టుకుని వేధిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పింది.
అయితే ఈ మహిళా కేంద్రం లోని కంటైన్మెంట్ ఏరియా అయిన అంబేద్కర్ నగర్ నుండి గుడిహత్నూర్ తన తల్లిదండ్రుల వద్దకి 12 న వచ్చింది. ఆ మహిళకి కౌన్సిలింగ్ ఇచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments