అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
'ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ'.. ఓ అందమైన ప్రేమకథ మీకోసం
అనసూయ.. కేవలం టీవీ షోలలో మాత్రమే కాకుండా.. సినిమాలలో కూడా అప్పుడప్పుడు తళుక్కుమని మెరుస్తూ.. ఆడియన్స్‌ని తన మాయలో పడేస్తోంది ఈ సెలబ్రిటీ యాంకర్. అయితే అనసూయది ప్రేమ వివాహం అని.. ఆమె భర్త భరద్వాజ్ అని.. ఆమె సోషల్ మీడియా పేజీలను అనుసరించే వారందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అనసూయ తన సోషల్ మీడియా పేజీలలో తన ఇల్లు, తన కుటుంబసభ్యులకు సంబంధించిన పోస్టులే ఎక్కువగా పెడుతుంది.
అయితే అనసూయ ది ప్రేమ వివాహం అని చాలామందికి తెలిసినా.. ఆమె అందమైన ప్రేమకథ గురించి మాత్రం చాలా తక్కువమందికే తెలుసు. అనసూయ ప్రేమ కధ యువతరానికి ఒక ప్రేరణగా ఉంటుందని కూడా కచ్చితంగా చెప్పవచ్చు..
అనసూయ 12 వ తరగతి అంటే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న సమయంలో ఓసారి ఎన్ సీ సీ క్యాంప్‌కి వెళ్ళింది. పైగా ఆ క్యాంప్‌కి తానే గ్రూప్ కమాండర్ కావడంతో, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారికి శిక్షలు కూడా వేసేది. ఈ క్రమంలో అదే క్యాంప్‌కి వచ్చిన మరో స్టూడెంట్ "భరద్వాజ్".. అతడు అనసూయనుచూడగానే తన మనసు పారేసుకున్నాడు.
అంతే.. అనుకున్నదే తడవుగా.. ఇక ఆలస్యం ఏమీ చేయకుండా వెంటనే వచ్చి.. తన మనసులోని మాటని చెప్పేశాడు. అలాగే తననే పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు. ఆ వయసులో అసలు ప్రేమంటేనే తెలియదంటే.. నేరుగా పెళ్లి అన్నాడేంటని ఆలోచించి ఆశ్చర్యపోయిండి అనసూయ. అందుకే ఏమీ స్పందించకుండా ఉండిపోయింది. ఆ తర్వాత ఆ క్యాంప్ ముగియడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కానీ సరిగ్గా ఏడాదిన్నర తరువాత.. మరలా వారిద్దరూ క్యాంప్‌లో కలిసి మాట్లాడుకొనే సమయానికి.. అనసూయకు భరద్వాజ్ పై మంచి అభిప్రాయం కలగడం ఆ తరువాత నెమ్మదిగా ఆమెకు అతనిపై ఇష్టం, ప్రేమ కలగడం జరిగిపోయాయి. ఇక ఈ విషయం కేవలం అనసూయ తల్లికి మాత్రమే తెలుసు. కానీ అనసూయకి ఇద్దరు చెల్లెల్లు ఉండడంతో, అనసూయకి మంచి సంబంధం చూసి చేస్తే... మిగతావారికి కూడా మంచి సంబంధాలు వస్తాయని అనుకునేవారు అనసూయ తండ్రి.
అయితే భరద్వాజ్‌తో అనసూయ ప్రేమ మొదలైన మూడేళ్ళ తరువాత.. ఆమెకు ఇంట్లో వాళ్లు ఓ రోజు ఒక సంబంధం తీసుకువచ్చారు. అప్పుడు ఆమె తన ప్రేమ విషయం చెప్పేసరికి.. తన ఇంటిలో చాలా గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసి... కొన్నాళ్లు హాస్టల్‌లో ఉంది.. ఆ తర్వాత మరలా ఆమెను ఇంటిలోకి రానిచ్చినా.. భరద్వాజ్‌తో పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది.
అయితే ఈ క్రమంలో అనసూయ తన నిర్ణయాన్ని కరాకండీగా చెప్పేయడం గమనార్హం. " మీరు నాకు నచ్చిన భరద్వాజ్‌తో పెళ్లి చేసే వరకు నేను ఎక్కడికీ వెళ్ళను" అంటూ అనసూయ మొండి పట్టుదలతో చెప్పేయడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏమీ అనలేకపోయారట. అయితే తండ్రి, కూతుళ్ళ మధ్య సఖ్యత రావడానికి.. వీరి పెళ్ళికి ఆయన పచ్చ జెండా ఊపడానికి చాలాకాలం పట్టింది. చిత్రమేంటంటే.. భరద్వాజ్ అనసూయకి ప్రపోజ్ చేసిన.. 9 ఏళ్ళ తరువాత వీరి పెళ్లి జరిగింది. ఈ 9 ఏళ్ల కాలంలో అప్పుడప్పుడు ఓపిక నశించి అనసూయ తన నిర్ణయాన్ని భరద్వాజ్ తో బల్లగుద్ది మరీ చెప్పేది. "మనం బయటకి వెళ్లి పెళ్లి చేసుకుందాం" అని.. ఆమె ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే.. పెద్దల అంగీకారంతోనే పెళ్లి జరగాలని సర్ది చెప్పేవాడు భరద్వాజ్.
2010 ఫిబ్రవరి 10 తేదిన అనసూయ - భరద్వాజ్‌ల ప్రేమ "పెళ్లి పీటలు" ఎక్కింది. ఆ తర్వాత వీరిరువురికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వారే శౌర్య భరద్వాజ్, అయాన్ష్ భరద్వాజ్. ఇంకొన్ని రోజుల్లో.. వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తవబోతోంది.
ఒకరకంగా చెప్పాలంటే.. ప్రేమించుకున్నాక.. పెద్దలను సైతం ఒప్పించాలనే వీరిరువురి నిర్ణయం చాలా గొప్పది. ఇప్పటితరం యువతకి ఇదొక మంచి ప్రేరణ అనే చెప్పాలి.
ఆమె తన ట్విటర్ ఎకౌంట్ లో తన మనసులో భావాలు చెబుతూ "నా వర్క్ ప్లేస్ లో, స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు చాలామంది నువ్వెందుకు అంత తొందరగా పెళ్ళి చేసుకున్నావు, నీవు నిజానికి హీరోయిన్ కావాల్సిన దానివి.. అని అడుగుతారు.. ఇంకా కొంతమంది ”ఎందుకు ఎప్పుడూ నీ సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్స్ పెడతావు, మార్కెట్ లో నీకు డిమాండ్ తగ్గిపోతుంది" అని అంటున్నారు.. వీటన్నిటికీ నాదొక్కటే సమాధానం..
నేను ఏది చేసినా నా ఫ్యామిలీ సహకారం తోనే, నా కుటుంబం నాకొక పెద్ద అస్సెట్, సో నాకు వారి గురించి ఎక్కువ కన్సర్న్ ఉంటుంది.. నాకు అందులో నామూషీ ఫీల్ కావాల్సిన విషయం ఏమీ కనబడడం లేదు.. అవి చూసి ఆఫర్స్ ఇవ్వకుండా మానేస్తామంటే, అలాంటి ఆఫర్స్ నాకు కూడా వద్దు.. నన్ను వర్క్ వెతుక్కుంటూ రావాలి గానీ, నేను వర్క్ ను వెతుక్కుని వెళ్ళను.. అలాంటి వర్క్ నాకు వద్దు.. మగవాళ్ళు, హేరో లకు కూడా పెళ్ళి, పిల్లలు ఉన్నారు, వారు హ్యాపీగా సూపర్ స్టార్స్ లా ఇండస్ట్రీలో ఉంటున్నారు కదా? అలాంటప్పుడు నాకు మాత్రం రెస్ట్రిక్షన్స్ ఎందుకు? స్త్రీ మాత్రం ఒంటరిగా ఉండాలి పురుషులు మాత్రం ఎలా ఉన్నా, ఎన్ని పెళ్ళిల్లు చేసుకున్నా వారిని మాత్రం ఆరాధిస్తారా? ఇదెక్కడి న్యాయం? అద్రుష్టవశాత్తూ నా మైండ్ సెట్ ఉన్న కొంతమంది నాకు ఇండస్ట్రీలో ఉండబట్టి నాకు వర్క్ దొరుకుతుంది.. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు.. " అంటూ చెప్పుకొచ్చింది..
తాజాగా ఆమె అభిమానులతో చిట్‌చాట్ కూడా చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది అనసూయ. ఓ అభిమాని "మీ లాంటి అమ్మాయి నాకు లవర్‌గా రావాలని దీవించండి" అంటూ అడిగాడు. దానికి అనసూయ సమాధానం చెబుతూ.. అది కొంచెం కష్టమే. ఎందుకంటే నేను "సింగిల్ యూనిక్ పీస్". నా లాంటి కొంచెం మంచి అమ్మాయి రావాలని కోరకుంటున్నానంది నవ్వుతూ. అంతేకాదు మేకప్ లేకుండా అందంగా ఉంటారని మీరు నిరూపించారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు "థాంక్స్" అంటూ సమాధానమిచ్చింది.
అంతేకాదు లాక్‌డౌన్ కారణంగా 3 కిలోల వరకు బరువు పెరిగానంటూ చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత మొట్ట మొదట తిరుమల దర్శనం చేసుకుంటానని చెప్పింది. అంతేకాదు ఈ యేడాదితో ఆమె పెళ్లి చేసుకొని 10 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా ఇటలీలో వెళ్లాలనకున్నాను, కానీ లాక్‌డౌన్ కారణంగా వెళ్ళలేక పోయాం. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. నాకు మొదటి పది మంది సిహ్టమైన వాళ్ళు ఎవరంటే నా భర్తే అంటూ భరద్వాజ్ పై తన ప్రేమని గుర్తుచేసుకుంది..
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారామంచి గుర్తింపు దక్కిన్చుకుంది అనసూయ. ఆ సినిమాలో రంగమ్మత్తగా అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఓ నెటిజన్ మాట్లాడుతూ "తరుణ్ భాస్కర్" తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట కదా?" అని ప్రశ్నించగా... ఆ నెటిజన్ పై మండి పడింది. అనసూయ, తరుణ్ భాస్కర్ కలిసి విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక మరో నెటిజన్ తన చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి? అని అడగగా.. అనుసూయ సమాధానం చెబుతూ, 'బ్యూటీ సోల్ డీప్' అని తెలిపింది. ఇంకా పలు ప్రశ్నలకు సమాదానం చెబుతూ.. "అనసూయ" అనే పేరు తన నానమ్మ పేరనీ, అందుకే పేరెంట్స్ తనకు ఆ పేరు పెట్టారని తెలిపింది. అనసూయ స్వస్థలం నల్గొండ, తన ఇంటిపేరు కస్బా..
ఇవీ అనసూయ గురించి కొన్ని ఆశక్తికర విషయాలు. అనసూయ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments