ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్ అదిరిపోయింది. ఎక్కడకి వెళ్లిన ఎంత ఎత్తుకి వెళ్లిన మన రూట్స్ మనం మరచిపోకూడదన్నట్టు ఆమె తనకి సాయం చేసిన ఆదివాసులకు సహాయం అందించాలని మళ్ళీ అడవి బాట పట్టింది. గన్ పట్టిన...గన్ మెన్ తో ఉన్నా అది పేదల కోసమే అంటోంది ఈ లేడి.
లాక్ డౌన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీలకు, అణగారిన వర్గాల వారి కష్టాలని తీరుస్తూ ఆమె అడవి దారి లో సాగుతోంది. గతం లో ఆమె నక్సలైట్ గా పని చేసిన రోజులని ఆమె తలుచుకుని ఆ ఫోటోలని కూడా పోస్ట్ చేసింది ఎమ్మెల్యే ధనసూరి అనసూయ అలియాస్ సీత.
ఆదివాసీల కష్టాలని తుడవడానికి ఆమె అడవి బాట పట్టి వాళ్ళందరికీ వెలుగుగా మారి చీకటి బ్రతుకుని తుడిచేయాలని ఆమె సాగుతున్నారు. అయితే నిత్యావసరాలు కూడా లేవని ఆమె ముందడుగు వేశారు. వాళ్ళకి అవసరం అయ్యే నిత్యావసరాలని ఆమె అందించారు. ఒక నాడు వీళ్ళు నా ఆకలి తీర్చారు.
ఇప్పుడు నాకు వీళ్ళ ఋణం తీర్చుకునే సమయం వచ్చింది అని ఆమె అంటూ పోస్ట్ చేసారు. పోస్ట్ చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆది, అణగారిన వర్గాల కోసం కూడు, గూడు, గుడ్డ కలిపించడం కోసమే నేను గన్ పట్టినా, గన్ మెన్ తో ఉన్నా అని ఆమె అంది.
కేవలం రేషన్ బియ్యం తో వాళ్ళకి ఇమ్యూనిటీ ఎలా వస్తుంది అని ఆమె వాళ్ళ కోసం సాయం చేసింది. అడవి లో ఆమె సంచరిస్తూ వాళ్ళకి గుడ్లు, కూరలు పంపిణీ చేసారు. అలానే ఆమెకి సహాయం చేసిన వాళ్ళని ఆమె అభినందించాలి ట్వీట్ చేసారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments