నేను హైదరాబాద్‌లో ఉంటాను. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ఎవరి భయాలు వారికున్నట్టే నాకూ ఉన్నాయి. ఇంట్లో ఉంటూ నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. కానీ అవసరాల కోసం బయటికొచ్చినప్పుడు, మనకోసం లాక్‌డౌన్ సమయంలో పనిచేస్తున్న పోలీసులను చూస్తే వారి మీద గౌరవం రెట్టింపు అవుతోంది.
టీవీల్లో వాళ్లు చేస్తున్న కృషి గురించి, వాళ్లు తీసుకుంటున్న రిస్క్ గురించి, ప్రజల కోసం వాళ్లు పడుతున్న తపన చూస్తే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది. అందుకే వారి కోసం ఈ పాట’’ అని రఘు పేర్కొన్నారు.
ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.కరోనా భీభత్సం సృష్టిస్తోంది.
ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. అయితే ప్రజలకి సేవ చేస్తున్న డాక్టర్లని, నర్సులని, పోలీసులని ఇలా అనేక మందిని దృష్టి లో పెట్టుకుని రఘు కుంచె ఈ పాట అందించారు. ఈ పాటని తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టాడు. దీనికి అతనే కర్త కర్మ క్రియ అయ్యి ఈ పాటని అందించాడు. శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments