బండికి సైడ్ మిర్రర్ లేకపోతే ఈ చలాన్. లాక్ డౌన్ ప్రారంభం నుంచి అమలు చేస్తున్న పోలీసులు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని అవసరాలతో పాటు వివిధ పనుల కోసం రోడ్డెక్కిన వాహన దారులకు ఈ చలానా చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.
ప్రస్తుతం ఎటువంటి ఆటో స్పేర్ పార్ట్స్ దుకాణాలు తెరవకపోవడమే ఈ ఇబ్బందికి కారణం. అయితే సైడ్ మిర్రర్ లేకపోతే పోలీసులు ఈ చలాన్ వేస్తున్నారు.ద్విచక్ర వాహనదారులకు ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధి లో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించడం తో వాహనదారులకు కలవరం మొదలైంది.
అయితే ఇప్పటి నుంచి సైడ్ మిర్రర్ లేకుంటే వాహనాలకు వాహన చట్టం 177 కింద 100 రూపాయలు మరియు 35 రూపాయలు యూజర్ చార్జీలు కలిపి మొత్తం 135 రూపాయలు చెల్లించాలి. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం లో భాగంగానే ఈ సైడ్ మిర్రర్ చలానా విధిస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు చెప్పారు.
బైకులకు సైడ్ మిర్రర్ ఉండడంవల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు బాగా కనిపిస్తాయి. దీని వల్ల చక్కగా సేఫ్ గా డ్రైవ్ చేయొచ్చు. అయితే ముందుగానే వాహనదారులకు అవగాహన కల్పించిన తరువాత ఈ చలానా వేస్తే బాగుంటుందని మణికొండ కు చెందిన ఒక వ్యాపారి చెప్పారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments