ఇప్పుడు కరోనా రోగులకు తప్ప ఏ ఇతర రోగులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారి పోయింది. అయితే గర్భిణీలకు మధుమేహం అలాగే ఇతర రోగులకు చికిత్స చేయడం చాలా కష్టం అవుతోంది.
దీని వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మరింత కష్టం ఎదురయ్యింది. గాంధీ ఆస్పత్రిని కోవిద్ కేంద్రంగా మార్చడం వల్ల ఇతర రోగులని ఉస్మానియాకి మార్చడం జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఇక్కడికి వచ్చేవారు రెగ్యులర్ చెకప్ లకు వచ్చే వారితో పాటు ఆ తర్వాత సర్జరీ కి వచ్చే వారి పరిస్థితి కూడా చాలా ఘోరంగా మారి పోయింది. ఇంతే కాకుండా ఓపీ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపి వేయడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గాంధీ లో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీలు సుల్తాన్ బజార్ లో ప్రసూతి ఆస్పత్రికి తరలించడం తో అక్కడ రోగుల సంఖ్య కూడా అధికంగా పెరిగింది. సకాలంలో ఈ ఫాలో ఆప్ వైద్యం అందక రోగులు అనేక అవస్థలకు గురి అవుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రులు నేటికీ తెరుచుకోక పోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గర్భిణీలకు నెలవారి చెక్ అప్ లు కూడా జరగకపోవడం తో భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇలా మధుమేహం, హృద్రోగ, కిడ్నీ, కాలేయం, హైపర్టెన్షన్ ఇలా అనేక రోగులు ఇబ్బందులు తప్పడం లేదు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments