లైసెన్స్ గన్నులపై కాస్త నిర్ణయాలను తీసుకుంది ప్రభుత్వం. ఎప్పుడూ కూడా లైసెన్స్ గన్స్ ని సాధారణంగా మూడు కేటగిరిలో జారీ చేస్తారు. వ్యక్తిగత భద్రత సెక్యూరిటీ గార్డులు ఫైరింగ్ క్రీడల సంబంధించిన వాళ్ళకి వీటిని ఇస్తుంటారు. అయితే ప్రభుత్వం వీటిపై కొంచెం నిర్ణయాన్ని మార్చుకుంది.
అయితే ఇప్పటి వరకు మూడు తుపాకులుకు అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటి నుంచి గరిష్టంగా రెండు తుపాకీలు మాత్రమే కలిగి ఉండేలా మార్పు తీసుకొచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు పరిగణలోకి తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటి ప్రకారం మూడు గన్స్ ఉన్నవాళ్ళు తక్షణమే ఒకటి డిపాజిట్ చేయాలని స్పష్టం చేశారు
అయితే మూడు గన్స్ ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే వీటిని పాటించ కుండా ఉంటే చట్ట విరుద్ధం అని తెలియజేశారు. గతంలో అమలులో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత గురించి వ్యక్తిగతంగా మూడు ఆయుధాల్ని కలిగి ఉండడానికి అనుమతి ఉంది కానీ ఇప్పుడు మార్పుల్ని చేశారు.
అయితే లాక్ డౌన్ ముగిసిన తరువాత ఆడిటింగ్ చేయాలని పోలీసు విభాగం నిర్ణయించింది. అయితే వాటిలో ఎవరైనా మూడవది డిపాజిట్ చేయకుండా ఉన్నట్టు తెలిస్తే నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments