ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అందరిని సురక్షితంగా ఉంచేందుకు లాక్ డౌన్ ను విధిస్తే అదే లాక్ డౌన్ ఈ చిన్నారి పాలిట శాపం అయ్యింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ లో గురువారం తెల్లవారు జామున జరిగింది.
వివరాలలోకి వెళితే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బీమ్లాతండా కి చెందిన భూక్యా పాండు నాయక్ కుమారుడు మల్లేష్ కోదాడలో ఎన్సిఎల్ కర్మాగారంలో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు నిఖిల్ కి 18 నెలలు.
ఈ 18 నెలలు కుమారుడు అయినా నిఖిల్ కి రాత్రి కడుపునొప్పి వచ్చింది. దీనితో తల్లిదంద్రుడులు నిఖిల్ ని తీసుకోని సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లారు . కానీ అక్కడ వైద్యులు లేకపోయేసరికి ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు.
కానీ అది కూడా మూసి వుంది. 24 గంటలు పని చేయవలసిన ఆసుపత్రి కూడా మూసి ఉండటంతో సకాలంలో వైద్యం అందక పోవడంతో బాలుడు మృతి చెందాడు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా కారణంగా వైద్యులు అందుబాటులో లేకపోవడమే చిన్నారి మృతికి కారణం అని బాలుడు తాత పాండు నాయక్ ఆరోపించాడు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments