తాజాగా మరో వార్త బయటపడింది. కిరాణా షాపుల కేంద్రంగా కరోనా విజృంభణ అని అంటున్నారు. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా వ్యాపిస్తోంది? అయితే బస్తీ లో కాలనీలో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కరోనా వైరస్ కు కేంద్రంగా మారుతున్నాయి. బేగంబజార్, మలక్పేట్ గంజి, హోల్సేల్ మార్కెట్ వ్యాపారుల నుంచి చిన్న వ్యాపారులు కి వైరస్ విస్తరిస్తోంది.
ఇక్కడితో ఆగకుండా ఈ వైరస్ వాళ్ల కుటుంబ సభ్యులకి, కాలనీవాసులకి వైరస్ సోకుతుంది అన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న బస్తీల్లో కాలనీలో ఉన్న చిన్న వ్యాపారులకు కరోనా పై పూర్తి అవగాహన లేక పోవడమే ఇందుకు కారణం.
సామాజిక దూరం పాటిస్తున్నారో లేదో చూడకపోవడం అలానే హోల్సేల్ వ్యాపారస్తులు నుంచి తెచ్చిన సామాగ్రిని శానిటైజ్ స్ప్రే చెయ్యకుండా ఉండడం ఇలాంటివి కూడా కరోనా వ్యాపించడానికి కారణాలే.
అయితే ఇప్పుడు ఏమైంది అంటే జల్పల్లి పహాడీ షరీఫ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు వాళ్ల మలక్పెట్ గంజ్ లోని ముగ్గురు వ్యాపారులకు కరోనా వ్యాపించింది. మార్కెట్లో పల్లీ నూనె వ్యాపారం చేసే సరూర్ నగర్ కు చెందిన వ్యక్తి నుంచి కరోనా వచ్చిందట.
మొదట తండ్రికి, తల్లి, సోదరుడు , సోదరుని భార్య , ఇద్దరు కుమారులు, సోదరిని బావ ఆయన ఇద్దరు పిల్లలు ఇలా ఒకరి నుంచి ఒకరికి మొత్తం తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. పల్లీ నూనె వ్యాపారి అయన తన తండ్రికి 76 సంవత్సరాలు ఆయన మృతి చెందాడు.
అలాగే ఆయన సోదరుడు 48 వయసు గల అతను కూడా మృతి చెందాడు. ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా మారిన ట్లు తెలిసింది. ఇలా ఒకరి నుంచి ఒకరికి కుటుంబం అంతా వ్యాపించింది.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments