గ్రేటర్ హైదరాబాద్ లో సూర్యుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండల తో జనం సతమతమవుతున్నారు. విపరీతంగా కాస్తున్న ఎండలకి నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలా ఎండలు మండి పోవడం తో వేడి గాలులు కూడా హడలెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభమంటుంటే మరో పక్క వేడి గాలులు తో కూడా జనానికి ఇబ్బందులు వస్తున్నాయి.
అయితే వేడి సెగలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గురువారం నారాయణగూడ లో 42.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా నగర వ్యాప్తంగా కూడా 42 డిగ్రీలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ వేసవి లో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే బాగా అధికం.
గురువారం ఉదయం 10:00 నుంచి ఎండలు బాగా కాస్తున్నాయి. మధ్యాహ్నం వేడి గాలులు కూడా విపరీతం అని చెప్పొచ్చు. అంతే కాకుండా పనుల కోసం బయటికి వెళ్లిన వాళ్లు కూడా వడ దెబ్బకి గురయ్యారు. అయితే రానున్న 48 గంటల్లో నగరంలో అంతా కూడా ఎండలు అధికంగా ఉండడంతో పాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాబట్టి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎక్కువగా మంచి నీళ్లు తీసుకోవడం. టీ కాఫీ శీతల పానీయాలకు దూరంగా ఉండటం. బయటకు వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ లాంటివి ధరించడం చెయ్యాలి. అలానే కూలి పనులు వివిధ పనులకు వెళ్లే వాళ్ళు తల మీద గుడ్డ కట్టుకోవడం తో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఒకవేళ కనుక పని లేకపోతే చల్ల బడిన తర్వాత మాత్రమే బయటికి వెళ్లడం మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు తగిలే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments