ఇప్పటికే కరోనా వైరస్ అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంచిర్యాల జిల్లా లో కరోనా కలకలం రేపుతోంది. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామం లో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే వీరు ముంబైకి వలస కూలీలుగా వెళ్ళినవారు అని గుర్తించారు.
అయితే వీళ్ళు ముంబైకి వలస కూలీల వెళ్లి స్వస్థలానికి మే 5వ తేదీన తిరిగి వచ్చారు. వీరు ముంబై నుంచి రావడం తో హాజీపూర్ పోలీసులు ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ లో ఉంచారు.
కరోనా లక్షణాలు ఉండడంతో వారిని బెల్లంపల్లి తరలించారు. తర్వాత రెండు రోజుల క్రితం వాళ్లకి కరోనా పరీక్షలు చేయగా పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలడం తో వారిని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.
అంతే కాకుండా జిల్లాలోని చెన్నూరు మండలం మొత్తం రావుపల్లి కి చెందిన ఒక మహిళా చనిపోయిన అనంతరం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎవరికి అయితే కాంటాక్ట్ లో ఉందొ వాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించారు.
వాళ్లకి నెగిటివ్ తేలింది. అప్పటి నుంచి జిల్లాలో మారే పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం స్వస్థలానికి తిరిగి వచ్చిన వలస కూలి దారులకి రావడం తో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments