లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల గత మూడు నెలలుగా ఎటువంటి ఈవెంట్స్ కూడా జరగడం లేదు. అలాగే క్రికెట్ మ్యాచ్ లు కూడా ఆగిపోయాయి.
ఇదిలా ఉంటే క్రీడాకారులు ఆదాయం లో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించుట లేదట. లాక్ డౌన్ సమయం లో కూడా వీళ్ళు భారీగానే ఆర్జించారు.
అయితే మార్చి 12 తారీకు నుంచి మే 14 మధ్యకాలం లో సామాజిక మాధ్యమం ఇంస్టాగ్రామ్ ద్వారా ఈసారి క్రీడాకారులు ఎంత మొత్తం సంపాదించారని లెక్కలను ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది.
అయితే దీని లో ఇండియన్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో నిలిచి ఉన్నాడు. టాప్ టెన్ లో స్థానం పొందిన ఏకైక క్రికెటర్ గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అయితే ఈ జాబితా లో కోహ్లీ మొత్తం 3 ,79 ,294 పౌండ్లు అంటే మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు ఆర్జించాడు.
అయితే ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో టాప్ ర్యాంకు లో నిలిచాడు మొత్తం 18 లక్షల పౌండ్లు అంటే 17 కోట్ల 27 లక్షలు సంపాదించాడు. అయితే ఇందులో కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే క్రికెట్ వైపు నుంచి ఉండడం గమనార్హం.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments