మహేంద్ర సింగ్ ధోని రియల్ లైఫ్ స్టోరీ తెలుసా?

img

మహేంద్రసింగ్ ధోని జీవిత విశేషాలు:

రీసెంట్ గా ధోనీ తన రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ధోనీ నిజ జీవితం లో ఎత్తుపల్లాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను ఒకసారి తెలుసుకుందాం..

ధోనీ 1981 జూలై 7 న జన్మించాడు. ధోనీ భారతీయ క్రికెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆటగాడు అని చెప్పవచ్చు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గా ఆయన వ్యవహరించాడు. కుడి చేతివాటం బ్యాటింగ్ తో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ - కీపర్, గొప్ప ఫినిషర్ గా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు. ధోనీ తన తొలి వన్ డే ఇంటర్నేషనల్  బంగ్లాదేశ్ తో డిసెంబరు 2004 లో ఆడాడు. శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత  2005 లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

ధోనీ టెస్టులు, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఒక భారతీయ కెప్టెన్ గా అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, అత్యథిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాలను సొంతం చేసుకున్న ఏకైక భారతీయ కెప్టెన్. అతను 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కెప్టెన్ గా మొట్టమొదటి వన్డే సిరీస్ లోనే  శ్రీలంక, న్యూజిలాండ్ తో పోరాడి విజయం తీసుకు వచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు.. అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జూన్ 2013 లో, ఇంగ్లండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ను ఓడించడంతో ధోనీ మూడు ఐసిసి పరిమిత ఓవర్ల ట్రోఫీలు (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వెంటీ ట్వెంటీ) గెలుచుకున్న మొదటి కెప్టెన్ అయ్యాడు. 2008 లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత, అతడు న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013 లో విజయం సాధించి పెట్టాడు. 2009 లో ధోనీ మొదటి సారి భారత్ ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి తీసుకు వెళ్ళాడు. 2013 లో, అతని సారథ్యంలో, భారతదేశం 40 సంవత్సరాల తరువాత ఒక టెస్ట్ సీరీస్ లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2010, 2011 సీజన్లలో, ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో సారథిగా కప్పు సాధించి పెట్టాడు. అతను 2014 డిసెంబరు 30 న టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీ అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు.. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం..

ఐ సీ సీ ఓ డీ ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: 2008, 2009,

ఐ సీ సీ  వరల్డ్ - ఓ డీ ఐ 11,

ఐసిసి వరల్డ్ టెస్ట్ 11,

ఎల్ జి పీపుల్స్ ఛాయిస్ అవార్డు మొదలైనవాటితో పాటూ,

2009 లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ శ్రీ ఆయన సొంతం అయింది.. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ భూషణ్ కూడా ఆయన అందుకున్నారు..

2000 వ దశకం ప్రారంభంలో భారత వన్డే జట్టు "వికెట్ - కీపర్"  కి బ్యాటింగ్ ప్రతిభ లేదని నిర్ధారించుకున్న సెలెక్షన్ కమిటీ "రాహుల్ ద్రావిడ్" ను ఆ స్తానానికి ఎంపిక చేసింది. టెస్ట్ జుట్టులో ఉన్న పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్ళు జూనియర్ టీం లో ఉన్నారు. భారత ఆ జట్టులో ధోనీ చోటు సంపాదించడంతో, అతను 2004/05 లో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. తన వన్డే కెరీర్లో ధోనికి గొప్ప ఆరంభం లభించలేదు, తొలి మ్యాచ్ లో అవసరం లేని పరుగుకి ప్రయత్నించి డక్ అవుట్ అయ్యాడు. మొదటి సిరీస్ లో విజయవంతం కానప్పటికీ, ధోనీ పాకిస్తాన్ తో ఓ డీ ఐ సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు.

 

ఈ సిరీస్ లో రెండవ మ్యాచ్ లో ధోనీ తన ఐదవ వన్డే ఇంటర్నేషనల్ లో విశాఖపట్నంలో 148 పరుగులు చేశాడు. ఒక భారతీయ వికెట్-కీపర్, అత్యధిక స్కోరు రికార్డును ధోనీ అధిగమించాడు. శ్రీలంక తో  2005 లో జరిగిన సిరీస్ లో మొదటి రెండు ఆటలలో ధోనీకి బ్యాటింగ్ లోయర్ ఆర్డర్ లో వచ్చింది. జైపూర్ లో జరిగిన మూడవ వన్డేలో నంబర్ 3 లో ఆడాడు. శ్రీలంక ఇన్నింగ్స్ లో కుమార్ సంగక్కర సెంచరీ సాధించిన తర్వాత 299 పరుగుల లక్ష్యంతో భారత్ చేజింగ్ ఆరంభించింది. స్కోరును వేగవంతం చేయడానికి ధోనీ ని స్పీడ్ గా ఆడాలని కెప్టెన్ ఆదేశించాడు.. 145 బంతుల్లో 183 పరుగులతో విధ్వంసం స్రుహ్టించి అజేయంగా నిలిచాడు.. ఈ స్కోర్ వండే లో అనేక రికార్డులను నమోదు చేసింది..

ధోనీ పాకిస్తాన్ తో 2006 లో జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్ లో 68 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో జరిగిన మూడో మ్యాచ్ లో, ధోనీ ఒక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాడు.. అయితే అనూహ్యంగా కేవలం 46 బంతుల్లో 13 బౌండరీలతో ఏకంగా 72 పరుగులు చేశాడు.. ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ లో కూడా తన ప్రతిభ కనబరిచి ధోనీ 56 బంతుల్లో 77 పరుగులు చేశాడు.. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడా తో గెలుచుకుంది.

ప్రపంచ కప్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంకకు నష్టపోయిన తరువాత భారత జట్టు ఊహించని విధంగా  పరాజయం పాలైంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ధోనీ కేవలం 29 పరుగులు చేశాడు. దీంతో ధోనీ తన సొంత పట్టణం రాంచీలో నిర్మిస్తున్న ఇంటిపై జె ఎం ఎం రాజకీయ కార్యకర్తలు దాడి చేశారు.

సెప్టెంబరు 2007 లో వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా కూడా ఎన్నికయ్యాడు.

2009 లో అనేక నెలలు ఐసీసీ వన్డే బ్యాట్స్మన్ ర్యాంకింంగ్స్ లో ధోనీ అగ్రస్థానంలో నిలిచాడు.

ఇలా తన క్రికెట్ జీవితాన్ని గడిపిన ధోనీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా, సహనంగా ఉంటూ భారత్ గర్వించదగ్గ స్థాయిలో సేవలందించాడు..

ఇప్పుడు ధోనీ గురించి మరి కొన్ని ఆశక్తికర విషయాలు తెలుసుకుందాం:

ఎంఎస్ ధోని ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించడానికి ముందు భారత రైల్వేలో పనిచేసేవాడు..

అతను 2003 లో ఒక చిన్న టాలెంట్ స్పాటింగ్ ఈవెంట్‌లో వెలుగులోకి వచ్చాడు.. బిసిసిఐ జరిపిన టాలెంట్ అక్విజిషన్ - 2003 లో భాగంగా జంషెడ్‌పూర్ ‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఈ ఆటగాడికి పెద్ద బ్రేక్ లభించింది.

ధోనీ క్రికెట్ ని ఎప్పుడూ మొదటి ఆప్షన్ గా అనుకోలేదు.. ధోని ఫుట్‌బాల్ మరియు బ్యాడ్మింటన్ ‌తో కూడా ప్రయోగాలు చేశాడు..

ఐసిసి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు ధోనీ..

ధోనీ కి కోట్ల రూపాయల విలువైన బైకులు సేకరించే అలవాటు ఉంది.

 

వాస్తవానికి, అతను తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునతో కలిసి మోటారు సైకిల్ రేసింగ్ జట్టును కలిగి ఉన్నాడు..

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా లో ఎంఎస్ ధోని భార్య అయిన సాక్షి ధోనిని కలిశాడు.. తాజ్ బెంగాల్ ‌లో జరిగిన ఒక సమావేశంలో ఎంఎస్ ధోని మేనేజర్ ఈ జంటను పరిచయం చేసినట్లు ది హిందూస్తాన్ టైమ్స్ తెలిపింది. సాక్షి వెంటనే అతని దృష్టిని ఆకర్షించింది..

ధోని కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం మీకు తెలుసా?

ఇప్పుడు "జివా ధోని" తనంతట తానుగా సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఆమె పేరుకు రెండు అర్థాలు ఉన్నాయి: ప్రకాశం లేదా దేవుని కాంతి..

‘లెఫ్టినెంట్ కల్నల్’ అనే బిరుదును కూడా ధోనీ సంపాదించాడు..

నవంబర్ 1, 2011 న, కపిల్ దేవ్ గౌరవ టైటిల్ సంపాదించిన రెండవ క్రికెట్ ఆటగాడు ఎంఎస్ ధోని..

ఎంఎస్ ధోని ‘హెలికాప్టర్ షాట్’ అతని మాజీ క్రికెట్ సహచరుడు,  సన్నిహితుడు చిన్నతనం లో నేర్పించాడు.. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆ షాట్ వాస్తవానికి ధోనీ కనుక్కోలేదు. ఇది అతని చిన్ననాటి స్నేహితుడు సంతోష్ లాల్ ధోనీ కి పరిచయం చేశాడు.. ఈ విషయం "ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ" మూవీ లో వెల్లడించారు..

చూశారుగా మనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ దేవుడి జీవిత చరిత్ర. మీకు దోనీ గురించి ఇంకా ఏవైనా విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి..  

మరిన్ని

Comments

0 Comments

క్రీడలు

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()