డెడికేషన్ కి మరోపేరు.. పుల్లెల గోపీచంద్ రియల్ లైఫ్ స్టోరీ..

img

పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్యం గా శిక్షణ ఇస్తున్నాడు.. అతడి జీవిత చరిత్ర మనమూ తెలుసుకుందాం రండి..

క్రికెట్ రాజ్యమేలుతున్న దేశంలో బ్యాడ్మింటన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆటగాడు అతడు.. పి.వి. సింధు, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ షట్లర్లను తయారుచేసిన కోచ్.. ఆయనే పుల్లెల గోపీచంద్. క్రీడల నుంచి రాజకీయాలను తరిమేయాలి అని అంటాడు గోపీచంద్.. రాబోయే ఒలింపిక్ గేమ్స్‌లో భారత ప్రదర్శనను మెరుగుపరచడానికి ప్రభుత్వం నియమించిన 8 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్‌లో గోపీచంద్ సభ్యుడు. దేశంలో, బ్యాడ్మింటన్ ఎదుగుదలకు ఎంతగానో కృషిచేస్తోన్న గోపీచంద్, కఠిన మైన శిక్షణకు మారుపేరు....

గోపీచంద్ 1973 నవంబరు 16 న జన్మించాడు.. తన స్వగ్రామం నాగండ్ల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎత్తు 6 అడుగుల 2 అంగుళాలు.. బరువు 74 కిలోలు. గోపీచంద్ కుడి చేయి వాటం ఆటగాడు.. అంతర్జాతీయ పోటీల్లో పురుషుల సింగిల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.. తన కెరీర్ లో ప్రపంచ ఐదో ర్యాంక్ సాధించి భారత బ్యాడ్మింటన్ ను అత్యున్నత స్థానం లో నిలబెట్టాడు.. ఈ ఫీట్ 15 మార్చి 2001 న సాధించాడు. సుభాష్ చంద్ర, సుబ్బరావమ్మ దంపతులకు గోపీ చంద్ జన్మించాడు.. మొదట్లో క్రికెట్ పట్ల ఆశక్తి కనబరిచిన గోపీచంద్ తన అన్న సలహా మేరకు బ్యాడ్మింటన్ వైపు ద్రుష్టి సారించాడు.. తన కుటుంబం నిజామాబాద్ లో సెటిల్ అయ్యింది.. హైదరాబాద్ సెయింట్ పౌల్స్ స్కూల్ లో ప్రాధమిక విధ్య అభ్యసించాడు.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యువేషన్ ఏ వీ కాలేజీ లో పూర్తి చేశాడు.. ఎస్ ఎం ఆరిఫ్ తన మొదటి బ్యాడ్మింటన్ కోచ్. ఆ తర్వాత ప్రకాష్ పడుకొనె అకాడెమీ లో సెటిలయ్యాడు. సాయి గంగూలీ కూడా బెంగులూరు లో కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చాడు.. 1996 లో నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ ని గెలుచుకున్నాడు.. 2000 సంవత్సరం వరకూ వరుసగా ఆ టైటిల్ ను అందుకున్నాడు గోపీచంద్.. 2008 లో గోపీచంద్ అకాడెమీ స్థాపించి పోటీలకు దూరమయ్యాడు..

ఆట కు రిటైర్ మెంట్ ఇచ్చాక అకాడెమీ పెట్టాలనుకున్నాడు.. అకాడమీ కోసం ఇంటిని తాకట్టు పెట్టాడు పుల్లెల గోపీ చంద్.. కోచ్ సమర్థవంతుడయితే అరకొర సదుపాయాలతో కూడా మంచి ఫలితాలు సాధించగలడు. ఒకవేళ అతను అసమర్థుడు అయితే మీరెన్ని సదుపాయాలు కల్పించినా ఏమీ సాధించలేడు అని అంటాడు గోపీచంద్..

బ్యాడ్మింటన్ అకాడమినీ స్థాపించినపుడు అతడికి నిధుల కొరత వచ్చింది. డబ్బుల కోసం ఇళ్లమ్మడానికి సిద్ధపడ్డాడు. చివరికి ఇంటిని తాకట్టుపెట్టి రూ. 3 కోట్లు రుణం తీసుకున్నాడు. ఆ డబ్బుతోనే అకాడమీని నడిపించాడు. కష్టకాలంలో వెన్నుతట్టి నడిపించిన నా కుటుంబానికి రుణపడి ఉంటాను అంటాడు.

భారత్ లో క్రీడల ప్రాధాన్యత పెరగాలి అనేది గోపీ చంద్ ఉద్దేశ్యం.. గోపీ చంద్ మాటల్లో.. క్రీడలంటే పతకాలే కాదు.. ఇంకా చాలా ఉంది. మన దేశంలో క్రీడలకు అంత ప్రాధాన్యత లేదు. కానీ ఓ క్రీడాకారుడు పతకం గెలిస్తే ఇక్కడి ప్రజలు అతన్ని గుండెల్లో పెట్టుకుంటారు. కానీ విదేశాల్లో అలా ఉండదు. విదేశాల్లో క్రీడాకారులు చాలా సౌకర్యవంతమైన జీవనాన్ని అనుభవిస్తారు. కానీ భారత్‌లో పరిస్థితులు కొంచెం కఠినం. దీనికి కారణం జనాభా. ఐఐటీ పరీక్షల్లో కూడా ఇదే కనిపిస్తుంది. ఏ విషయంలోనైనా మనదేశంలో విపరీతమైన పోటీ ఉంది అని అంటాడు..

కోచ్ అప్‌డేటెడ్‌గా ఉండాలి అని గోపీ ఎప్పుడూ అంటూ ఉంటాడు.

కోచ్ బాధ్యత చాలా క్లిష్టమైనది. కోచ్ అనేవాడు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి. కొన్ని సార్లు విద్యార్థులపై ప్రేమ కురిపిస్తాడు, మరికొన్ని సార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీరు 15 ఏళ్ల ప్లేయర్‌కు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కొంచెం మృదువుగా వ్యవహరించాలి. కానీ ఓ అంతర్జాతీయ స్థాయి ప్లేయర్‌కు కోచింగ్ ఇచ్చేటప్పుడు కఠినంగా ఉండాలి.

బయోపిక్‌లు యువతపై ప్రభావం చూపుతున్నాయి.. ప్రస్తుతం అమ్మాయిల ఫోకస్ ఇతర క్రీడల మీదికి మళ్లింది. సాక్షి ని చూసిన తరవాత చాలా మంది అమ్మాయిలు రెజ్లింగ్ నేర్చుకుంటున్నారు. బాక్సింగ్‌లో మేరీ కోమ్ అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది. క్రీడాకారులపై నిర్మిస్తున్న బయోపిక్‌లు యూత్‌ను క్రికెట్ నుంచి ఇతర క్రీడల వైపు మళ్లేలా చేస్తున్నాయి..

నిధుల కోసం రాజకీయ నాయకులు అవసరమే. క్రీడలకు నిధులు పెంచడం, కనీస సౌకర్యాలు కల్పించడానికి రాజకీయ నాయకులు అవసరమే. కానీ క్రీడల నుంచి రాజకీయాలను దూరం చేయడం కూడా అంతే అవసరం.

2001 లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచి, ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా నిల్చాడు. ఇంతకు పూర్వం 1980 లో ఈ ఘనతను ప్రకాష్ పడుకోనె సాధించాడు. గోపీచంద్ సాధించిన అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించాయి. కాని ఆ తర్వాత దురదృష్టవశాత్తు తను గాయపడడంతో 2003 లో అతని స్థానం 126 కు పడిపోయింది. 2005 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

 

జులై 29, 2009న భారత ప్రభుత్వం గోపీచంద్ కు "ద్రోణాచార్య పురస్కారము" ప్రకటించింది. 2014లో ఈయనకు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది.

ప్రస్తుతం గోపీచంద్ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. శిష్యురాలు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ రంగములో తన ప్రతిభను చాటుతూ ఉంది. పీ వీ సింధు కి ఏళ్ళ తరబడి కోచింగ్ ఇవ్వడం ద్వారా ఆమెను ఒలింపిక్స్ లో మెరిసేలా చెయ్యగలిగాడు.  

గోపీ చంద్ చీఫ్ నేషనల్ కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు..  నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యాపారవేత్త 5 కోట్ల ఆర్ధిక సహాయం తో అకాడెమీ కి రూపుదాల్చాడు.. ఇండియాకి బగారు పతకం తీసుకురావాలనే నిభంధనతో డబ్బు ఇచ్చారు ప్రసాద్. ఈ అకాడెమీ లోనే పీవీ సింధు, సైనా నెహ్వాల్, స్రీకాంత్, అరుంధతి, కష్యప్, గురుసాయి, అరున్ మొదలైన ఆటగాల్లు తమ ప్రతిభని చాటారు..

5 జూన్ 2002 లో తన సహచర ప్లేయర్ అయిన లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె గాయత్రి, ఒక కుమారుడు విష్ణు.. వీరిద్దరూ కూడా బ్యాడ్మింటన్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు..

లక్ష్మి ఎనిమిది సార్లు భార్త బ్యాడ్మింటన్ చాంపియన్ గా వెలుగొందింది. గోపీచంద్ అకాడెమీ ఆవిర్భావం లో ఆమె తనవంతు పాత్ర పోషించింది.. అయితే 2008 నుండి 2010 వరకు రెండేళ్ళపాటూ అకాడెమీ ఏదోలా నడిపిన గోపీచంద్ కి ఆ తర్వాత దాన్ని నడపడం అసాధ్యమైంది.. ఏడాదికి 25 లక్షల ఖర్చవుతూ ఉండడం, రాబడి 10 లక్షలు మాత్రమే ఉండడం తో ఇబ్బందులు పడ్డాడు.. సైనా నెహ్వాల్ అంతర్జాతీయ పోటీలో విజయం సాధించినప్పటికీ అనుకున్నంత పాపులారిటీ, డబ్బు సంపాదించలేకపోయాడు..

అయితే గోపీచంద్ అకాడెమీ లో పీవీ సింధు ఎంటరయ్యాక కొన్ని సంఘటనలు జరిగాయి.. 2010 తర్వాత రెండేళ్ళపాటూ గోపీ చంద్ తన కాన్సంట్రేషన్ అంతా పీవీ సింధుపైనే పెట్టాడనే ఉద్దేశ్యం తో సైనా నెహ్వాల్ కలత చెంది అకాడెమీ కి బాయ్ చెప్పేసింది.. అక్కడనుండి బెంగుళూరు లోని ప్రకాష్ పడుకొనె అకాడెమీలో తన శిక్షణ కొనసాగించింది.. అయితే ఇదే విషయం పై గోపీచంద్ ని అడిగినప్పుడు "అలాంటిదేమీ లేదు, సింధు చాలా త్వరగా ఆటలో మెళకువలు నేర్చుకుంటూ ఉండడం తో ఆమెకు మరింత శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది తప్పితే సైనా నెహ్వాల్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశ్యం నాకేమీ లేదు. అని చెప్పాడు.. అయితే సైనా ఇలా అకాడెమీ వదిలి వెళ్ళిపోతుందనే విషయం తెలుసుకున్న గోపీచంద్ ఆమెను అకాడెమీ వదిలి వెల్లొద్దని ప్రాధేయపడినా తన నిర్ణయం ముందుగానే తీసేసుకోవడం తో గోపీచంద్ చెప్పిన మాటలు ఆమె వినిపించుకోలేదు.. ప్రకాష్ పడుకొనె కూడా ఆమెను వారించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అలా చేయకపోగా హైదరాబాద్ వెంటనే వదిలి రావాలని సైనా కు సూచించాడు.. ఇది గోపీ కి ఆశ్చర్యాన్ని కలిగించింది.. ప్రకాష్ ని తన రోల్ మోడల్ గా ఎప్పుడూ చెప్పుకునే గోపీ గురించి ప్రకాష్ ఎన్నడూ పాజిటివ్ గా మాట్లాడిన సంధర్భాలు కూడా లేకపోవడం గోపీ కి మనస్తాపం కలిగించిన అంశం..  అయితే ఆ తర్వాత సైనా పాల్గొన్న ఒలింపిక్స్ గేం లో ఆదిలోనే ఇంటిబాట పట్టడం ఆమెకు, గోపీ కి కూడా బాధకలిగించింది.. కష్యప్ తో వివాహమయ్యాక ఆమెను గోపీ చంద్ అకాడెమీ కి తిరిగి వెళ్ళాలని సూచించినా సైనా వినిపించుకోలేదు.. ఆమెకు కొంచం పొగరు అని నవ్వుతూ చెబుతాడు కష్యప్..  గోపీ కి సారీ చెప్పి మల్లీ మునుపటి ఫాం ని కొనసాగించాలని కష్యప్ సూచిస్తున్నాడు. గోపీ కూడా ఆమె తిరిగి వస్తే ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడు. చూడాలి మరి ఏమవుతుందో..  

ఇదీ గోపీ చంద్ లైఫ్ స్టోరీ.. గోపీ చంద్ పై, భారత క్రీడారంగం పై రాజకీయ వొత్తిడుల పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి.. 

మరిన్ని

Comments

0 Comments

క్రీడలు

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()