భారత్ క్రికెట్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేసిన లాక్ డౌన్ లో తనదైన సేవ తో కొనసాగుతున్నాడు.
అయితే కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ విధించడం తో ప్రతి ఒక్కరికి కష్టాలు తప్పడం లేదు.
ఈ లాక్ డౌన్ నేపథ్యం లో వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇటువంటి వారందరికీ సేవ చేయడానికి చాలా మంది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇలా హర్భజన్ సింగ్ కూడా తన వంతు సహాయం అందించాడు.
పేదలకు నిత్యావసర వస్తువులు అందజేయడం తో పాటు వలస కూలీలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేశాడు.
తాజాగా ఇండియా టుడే క్రికెట్ 20 20 కార్యక్రమం లో పాల్గొన్న బజ్జి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.
వాళ్ళ కష్టాలు చూసిన హర్భజన్ ఇలా అంటున్నాడు... కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలు, వలస కూలీలు బాధలు కష్టాలు చూసి చలించిపోయాను. అయితే ఈ కరోనా లో చాలా విషయాలు నేర్చుకున్నాను అని చెప్పాడు.
కరోనా లో నాలో ఉన్న మానవత్వం తట్టిలేపింది అని చెప్పాడు. దేవుడు దయతో నేను మంచి స్థితి లో ఉన్నాను నాకు చేతనైంది ఇప్పుడు వరకు నేను సహాయం చేశాను.
అంతే కాకుండా సొంత ఊర్లో ఉన్న కొంత పొలం పేదల కోసం పండించాలని అనుకుంటున్నాను ఆ పండించిన పంటలు ఉచితంగా పంచి పెడతారు అని చెప్తున్నాడు బజ్జి.
అయితే కేవలం మనం డబ్బు సంపాదించడానికి బతకడం లేదు కష్టకాలం లో ఇతరులకు సహాయం కూడా చేయాలి అది మన బాధ్యత అని ఎంత సీరియస్ గా మాట్లాడాడు అర్థం.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments