కరోనా వల్ల ఇప్పటికే క్రీడలు కూడా ఆగిపోయాయి. ఈ మహమ్మారి దాటికి ప్రతిదీ కూడా నిలిచి పోయాయి. అనుకున్న సమయం లో ఏది జరగక ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు ఇలా కేవలం పనులు మాత్రమే కాక క్రీడలు వంటి వాటికి కూడా అంతరాయం కలిగి నిలిచిపోయాయి.
అయితే క్రికెట్ మ్యాచ్ లు సైతం ప్రతిదీ కూడా ఆగిపోయిన దుస్థితిని మనం చూస్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్ లు కూడా లేక క్రికెటర్లు కూడా ఇలాగే పరిమితమై పోయారు. అయితే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హత వివరాలను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది.
జూన్ 7 2021 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ మహిళల టెన్నిస్ సంఘం ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంట్రీ ఖరారు చేస్తామని తెలిపారు. అయితే వీటి లో మాత్రం ర్యాంకింగ్ ఆధారంగా ప్రకటించడం జరుగుతుంది.
మహిళల సింగిల్స్ డ్రా లో టాప్ 56 ర్యాంకింగ్స్ క్రీడాకారులు నేరుగా అర్హత సాధిస్తారు అని చెప్పారు. వీటిలో 64 మంది తో కూడిన పురుషుల, మహిళల సింగిల్స్ ‘డ్రా’లో టాప్–56 ర్యాంకింగ్స్ క్రీడాకారులు నేరుగా అర్హత సాధిస్తారు. మిగతా ఎనిమిది బెర్త్‌లలో ఆరు కాంటినెంటల్ క్వాలిఫయింగ్స్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.
మిగిలిన రెండూ కూడా రిజర్వ్ లో ఉంటాయి అని చెప్పారు. డబుల్స్లో 32 మందికి అవకాశం వస్తుందట. నేరుగా టాప్ టెన్ జోడి లోకి ఎంట్రీ ఉంటుంది. అలానే మిక్సిడ్ డబుల్స్ లో 16 జోడీలు వస్తాయన్నారు.
సింగిల్స్ డబుల్స్ లో అర్హత పొందిన వాళ్ళని మిక్స్డ్ డబుల్స్లో నిర్వహిస్తారని చెప్పారు ఇలా ప్రతి దేశం నుండి గరిష్టంగా నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుందట.
అయితే ఈ టోక్యో ఒలింపిక్స్ క్రీడలు వచ్చే సంవత్సరం జూలై 23 నుంచి ప్రారంభమవుతాయి ఆగస్టు ఎనిమిది తో ఇవి ముగిసిపోతాయి.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments