భారత్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి చెప్పడం కొత్తేమీ కాదు. అయితే ఆయన ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమిస్తాడు. వ్యాయామం ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే లాక్ డౌన్లో తను ఏం తింటున్నాడో తెలుసా? దీనిని తెలుసుకోవాలనుకుంటున్నారా? చదివేయండి...
వ్యాయామం ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే కోహ్లీ బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా మధ్యాహ్నం కొంచెం తగ్గించి అలానే రాత్రికి బాగా లైట్గా తినడం అలవాటు అని చెబుతున్నాడు. అయితే గతం లో తాను ఒక గుడ్డు పూర్తిగా మరో మూడు గుడ్లు తెల్ల సొన మాత్రమే వేసి చేసిన ఆమ్లెట్ అలానే నిప్పుల మీద కాల్చిన బేకన్, సాల్మన్ చేప వంటివి తీసుకునేవాడు అని చెప్పాడు విరాట్ కోహ్లీ.
అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆహారం లో మార్పులు చేసుకున్నాడు. తను పూర్తిగా శాఖాహారిగా మారిన తర్వాత వీటన్నిటికీ మార్చేసుకున్నాడట. అయితే ఇప్పుడు తన బ్రేక్ ఫాస్ట్ కింద ఇడ్లీ దోస లాంటివి తీసుకుంటున్నాడు.
అయితే వాటి లో పాలకూర మాత్రం తప్పనిసరి అని చెప్తున్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనంతరం ఫ్రూట్స్ని తీసుకుంటున్నాడు. అంతే కాకుండా నిమ్మకాయ పిండిన గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ పెద్ద కప్పు తాగుతున్నాడు అని చెప్పాడు విరాట్ కోహ్లీ.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments