లాక్ డౌన్ వల్ల క్రికెట్ మ్యాచ్ కూడా లేదు. అందుకే క్రికెటర్స్ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇంకేం ఇంట్లో ఉంటూ ఏదో ఒక దానిలో నిమగ్నం అవ్వక తప్పడం లేదు. అయితే ఏ క్రికెటర్ ఏం చేస్తున్నాడు? ఇంకేం ఆలస్యం చూసేయండి...స్టైల్ గా ఉండే మన ఫిట్నెస్ ఫ్రీక్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకి ఏదో ఒక పోస్ట్ పేటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.
కొద్ది రోజుల క్రితం వంటతో అలానే అనుష్క శర్మ చేసిన హెయిర్ కట్ తో కోహ్లీ అభిమానులకి లాక్ డౌన్ లో కూడా చేరువయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం కోహ్లీ తన భార్య అనుష్క శర్మ తో కనిపించిన వీడియో మాత్రం నెట్టింటిలో హల్ చల్ అవుతోంది.
అయితే ఈ వీడియో ఏముంది అని ఆశ్చర్య పడకండి...ఇందులో కోహ్లీని అనుష్క ఏడిపిస్తూ సరదాగా ఒక వీడియో ని ఆమె పోస్ట్ చేసింది. దానిలో ఆమె ఏయ్ కోహ్లీ ఫోర్ కొట్టు అంటూ ఆమె అతన్ని ఆటపట్టించింది. దానికి కోహ్లీ ఎంతో నిరుత్సాహకారం అయినా ఎక్స్ప్రెషన్ పెట్టాడు.
ఈ వీడియో కి బౌలర్ చాహల్ ఒక కామెంట్ పెట్టాడు. వదిన నువ్వైనా నన్ను ఓపెనర్ గా పంపమని కోహ్లీకి చెప్పు అంటూ అతను చెప్పాడు. ఇలా వీడియోకి చాహల్ కామెంట్ పెట్టాడు. అలానే మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన లాక్ డౌన్ ని కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ తో కాలక్షేపం చేస్తున్నాడు.
ఈ సారి కొత్త లుక్స్ తో సచిన్ సోషల్ మీడియా లో కనపడ్డాడు. తాను స్క్వేర్ కట్స్ ఆడుతున్నప్పటి నుండి సొంతంగా హెయిర్ స్టైల్స్ చేసుకోవడం అలవాటే అన్నాడు. అలానే సచిన్ కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటో ని పోస్ట్ చేసాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments