ఎప్పుడూ కూల్ గా ఉండే ధనా ధన్ ధోనీ లాక్ డౌన్ కారణంగా ఎన్ ఫోర్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమం లో వీడియో కాల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ , అశ్విన్ కూడా మానసిక ఆరోగ్యం గురించి తమ అభిప్రాయాలని
తెలియజేశారు. ఇలా ధోని తన అభిప్రాయాలని అందరి తో పంచుకున్నాడు.
ఎవరైనా చెప్తే నమ్మవేమో కాని స్వయంగా ధోని తన నోట నుండి చెప్పాడు. అయితే మహి ఎప్పుడు ప్రశాంతంగా కనిపించినా ఆట ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతాం అని అన్నాడు. ఇది ఎవరు బయటకు చెప్పరు, కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అంటూ ఇలా అన్నాడు.
తను గ్రీస్లో కి వెళ్ళిన ప్రతి సారి మొదటి 5 బంతులు ఎదుర్కోవడం తో గుండె వేగంగా కొట్టుకుంటుంది అని చెప్పాడు. దాని తో పాటు భయం, ఒత్తిడి కూడా ఎక్కువ అవుతాయని మహి చెప్పాడు. అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే ఈ సమస్యలను ఏమీ దాచి పెట్టుకోకుండా తరచు మెంటల్ కండిషనింగ్ కోచ్ తో సమస్యలు చెప్తే పరిష్కారం వస్తుందని అన్నాడు.
ఇందుకే తప్పనిసరిగా అతను జట్టు లో ఉండాలి అని ధోనీ చెప్పాడు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మానసిక సమస్య కోసం చెప్పుకొచ్చాడు. మానసిక స్పష్టత అనేది క్రీడల్లో మాత్రమే కాదు, జీవితం లో కూడా ఎంతో ముఖ్యమని చెప్పాడు. అలానే మానసిక స్థైర్యం పెంచుకుంటే క్రీడల్లో క్లిష్టపరిస్థితుల్లో అధిగమించవచ్చని చెప్పాడు. ఇలా వారు వారి అభిప్రాయాలను తెలియజేశారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments