కరోనా అందర్నీ ముంచేస్తోంది. స్కూల్స్, కాలేజీలు, వ్యాపారాలు, క్రీడలు, సినిమాలు ఇలా ఎందులోను చూసిన పెద్ద దుఃఖమే ఈ ప్రపంచానికి వచ్చింది. ఈ మహమ్మారిని తరిమి కొట్టడం ఎంతో కష్టం అయిపోయింది. ఏం చేసిన భూతాన్ని తరిమికొట్టే పరిష్కారాలు కనపడడం లేవు అనే చెప్పాలి. విశ్వ ప్రయత్నం చేస్తున్న విశ్వం అంతా కూడా ఈ కరోనా తో సతమతం అవ్వక తప్పడం లేదు.
ఈ కరోనా నుండి ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెలగడం ఉత్తమం. అయితే ఈ మహమ్మారి నుండి జాగ్రత్తలు తీసుకుని సక్రమంగా ఉండడం కంటే ఔషధం లేదు. కాబట్టి కరోనాని తేలిగ్గా తీసి పారేసి అతి నమ్మకంతో ఉండడం మంచిది కాదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అయితే కరోనా సమస్యని ప్రజలంతా కలిసి తరిమేయాలి అని అనేక మార్గాలని కూడా సూచిస్తోంది మన ప్రభుత్వం.
అయితే సానియా మీర్జా ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో ఆమె కాళీ స్టేడియం లో కూడా ఆమె టెన్నిస్ ఆడడానికి సై అంటోంది. ఈ ప్లేయర్ దేనికైనా సిద్ధం అని అంది. మామూలుగా ఆడియన్స్ ఉండి ఆడే స్టేడియంలు లెక్క వేరు అని ఆమె అంది. అంతే కాక ఆ జోష్ దేనికి కూడా సాటి రాదు అని సానియా చెప్పింది. ఫ్యాన్స్ ఉత్సాహ పరిస్తే ఆస్వాదిస్తాం కానీ వాళ్ళు లేకపోయినా సరే ఆడడం ముఖ్యం అని ఆమె చెప్పింది.
అభిమానులు లేకుండా ఆడను అని కూర్చుంటే అసలు ఆట ఆడడం అవ్వదు అని ఆమె పేర్కొంది. తన కొడుకుకి జన్మనిచ్చి తిరిగి ఆట లోకి రావడానికి ఆమెకి రెండు ఏళ్ళు వ్యవధి పట్టింది అని సానియా చెప్పింది. టోర్నీ కోసం ప్రయాణం చెయ్యడం పెద్ద కష్టం అని కూడా ఆమె అంది. ఎక్కడకి వెళ్లిన 18 రోజుల ముందే వెళ్లడం మంచిది అని అంది.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments