గాడ్ అఫ్ కేట్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 48వ పడిలోకి అడుగు పెట్టాడు. అయితే ఆయన ఈసారి వేడుకలకి నో చెప్పారు. తాను ఈ వేడుకలకు దూరంగా ఉంటూ ఈసారి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోలేదు. కరోనా వల్ల మొత్తం ప్రపంచమంతా అతలాకుతలమవుతోందని మనకు తెలిసినదే.
ఇలాంటి సమయాల్లో తన పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం తగదని సచిన్ టెండూల్కర్ నిర్ణయించుకున్నాడు. ఇలాంటివి ఏమీ చేసుకోకూడదని ఈసారి ఆయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోలేదు అని తన జన్మదినం అయిన ఈ రోజు తన తల్లి ఆశీర్వాదం తోనే మొదలవుతుందన అన్నాడు.
ఆమె ఇచ్చిన గణపతి బప్పా తనకి ఎంతో అమూల్యమైనదని అతను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఇలాంటి కరోనా వైరస్ పరిస్థితుల్లో ఈ వేడుకలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలు ఇలాంటివి జరుపుకోవడం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి భారత ఆటగాడు తన పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోలేదు.
అయితే సోషల్ మీడియాలో సచిన్ టెండూల్కర్ కి వివిధ ఆటగాళ్లు పుట్టినరోజు సందర్భంగా ఆయనను విషెస్ తో ముంచేశారు. బ్యాటింగ్ ప్రాణంగా క్రికెట్ లోకంగా ఎదిగిన సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయనని విష్ చేసారు.ఇలా ప్రతి ఒక్కరు సచిన్ టెండూల్కర్ కి విషెస్ చెప్పారు. రోహిత్ శర్మ మన గ్రేట్ మ్యాన్ ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా అని అన్నాడు. క్రికెట్ ఆటగాళ్లు మాత్రమే కాకుండా టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు అలాగే పలు క్రీడాకారులు కూడా సచిన్ టెండూల్కర్ ని విష్ చేశారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments