మొన్న మొన్నటి వరకు నటులు మాత్రమే చాలెంజ్ విసురుకున్నారు. కానీ ఇప్పుడు క్రీడాకారులు కూడా చాలీజ్ల తో ముందుకు వస్తున్నారు. అయితే ఇది నిజంగా అందరినీ ఆశ్చర్య పరిచింది.
మాస్టర్ సచిన్ బ్యాట్ పట్టి స్టేడియం లో ఆడాడంటే ఇంకా దానికి తిరుగులేదు. అయితే ఎన్నో రికార్డులు అవార్డులు ఘనతలు సృష్టించిన సచిన్ టెండూల్కర్ యువి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించాడు.
కీప్ ఇట్ అప్ ఛాలెంజ్ ని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నుండి స్వీకరించాడు . ఈ చాలెంజ్ లో ఏం చేయాలంటే అడ్డంగా బ్యాట్ తిప్పి బంతిని కొడుతూ ఓ కొత్త సవాల్ కు శ్రీకారం చుట్టాడు. ఇలా బంతి కింద పడకుండా పలుమార్లు కొట్టిన యువి ఈ ఛాలెంజ్ సచిన్ హర్భజన్ లకు విసిరాడు.
అయితే సచిన్ టెండూల్కర్ ఆ చాలెంజ్ స్వీకరించి సరి కొత్తగా ఈ ఛాలెంజ్ ని పూర్తి చేశాడు బ్యాట్ అడ్డంగా తిప్పి కొట్టడమే కాకుండా వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని సవాళ్లు పూర్తిచేశాడు.
దీనిని పూర్తి చేసి సచిన్ ప్రతి సవాల్ చేశాడు. యువి నువ్వు నాకు చాలా సులభమైన ఛాలెంజ్ చేశావు కానీ ఇప్పుడు నేను నీకు కష్టమైన ఛాలెంజ్ విసురుతున్నారు అంటూ సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేశాడు.
అయితే నిజంగా ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా లో ఇది షికార్లు కొడుతోంది. ఇలా సచిన్ టెండూల్కర్ ఫాన్స్ కామెంట్లు చేశారు. నువ్వు నిజంగా దేవుడు సామి అంటూ నెటిజన్లు సచిన్ టెండూల్కర్ కి కామెంట్లు పెట్టారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments