క్రికెట్ టోర్నీలో పాల్గొనాలి అంటే కనీసం నెల రోజుల పాటు ప్రాక్టీస్ ఉండాలి అని అంటున్నాడు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే. అయితే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చాక ఆటలు అనేవి పున ప్రారంభం కావాలని అతను అన్నాడు. ఇలా రహానే తన మాటల్ని సోషల్ మీడియా తో పంచుకున్నాడు.
బుధవారం ఎల్సా కార్ప్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడైన రహానే మాట్లాడుతూ ఇది వరకు లాగ ఆటగాళ్లు మైదానాల్లో సంబరాలు చేసుకునే అవకాశం కూడా ఉండదు అని అతను అన్నాడు. ఇప్పుడు కనుక ఏ క్రికెట్ ఆట ఆడాలన్న సరే కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు ప్రాక్టీస్ ఖచ్చితం అని ఆయన సూచించాడు.
అంతే కాకుండా తన వరకు వాటిని చాలా మిస్ అవుతున్నాను అని ఆయన చెప్పాడు. కానీ ఏది ఏమైనా సరే వ్యాక్సిన్ వచ్చాకనే ఏ టోర్నీ అయినా ప్రారంభించడం మంచిది అని అతను చెప్పాడు. అన్ని సక్రమంగా మారినా సరే ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించటం మంచిది కాదని ఆయన చెప్పాడు. అభిమానులని ప్రేక్షకుల్ని దృష్టి లో పెట్టుకుని భద్రత పాటించడం ఎంతో ముఖ్యం అన్నాడు.
మొత్తం అంతా కూడా సరైన క్రమంలో ఉన్నా సరే ఇంతకు ముందు లాగా ప్రవర్తించే తీరు కుదరదు అని చెప్పాడు. ఈసారి వికెట్ తీస్తే ఒకరి నొకరు హత్తుకోవడం వంటివి చెయ్యకుండా నమస్కారం చప్పట్లతో మాత్రమే వ్యవహరించాలని అజింక్యా రహానే తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అలానే బంతిని మెరిపించడానికి తడి చేస్తారు అయితే ఇప్పుడు దాన్ని కూడా చేయాలా వద్దా అనేది త్వరలోనే స్పష్టత వస్తుందని రహానే చెప్పుకొచ్చాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments