క్వాడ్రఫుల్ సెంచరీ...! వామ్మో ఎంత గ్రేట్ రా బాబు అనిపిస్తుంది కదా...! ఎవరైనా అంత గట్టిగా బాదగలరా? నిజంగా అద్భుతమే. ఆ అద్భుతానికి 16 ఏళ్ళు నేటితో. క్రికెటర్ లారా అంటే ఎవరికైనా గుర్తు వచ్చేది ఆ క్వాడ్రఫుల్ సెంచరీ ఏ కదా.
ఇంగ్లాండు పై 400 పూర్తి చేసి సంచలనం సృష్టించాడు ఈ క్రికెటర్. 2004 సంవత్సరం లో ఇంగ్లాడు తో జరిగిన మ్యాచ్ లో ఓ ఘనత సాధించాడు ఈ కరేబియన్ వీరుడు. ఈ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ లో జరిగింది.
ఇంగ్లాండు తో తలపడి లారా బంతులని జోరుగా బాదాడు. కంగుతిన్నారు ఇంగ్లాండు ఆటగాళ్లు. అప్పటికి ఫార్మ్ లో లేని లారా వీర బాదుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే లారా అప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో కేవలం వంద పరుగులు మాత్రమే తీసాడు.
వ్యక్తి గతంగా అధిక పరుగులు తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దిగ్గజం వ్యక్తి గత స్కోర్ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇతను 582 బంతుల్లో 43 ఫోర్స్, 4 సిక్సులు కొట్టి 400 పరుగులు తన ఖాతా లో వేసుకుని అదిరిపోయే రికార్డు సంపాదించాడు క్రికెటర్ లారా. ఆదివారానికి ఈ క్వాడ్రఫుల్ సెంచరీ కి 16 ఏళ్ళు అట.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments