క్రికెట్ అంటేనే వైబ్రేషన్స్ వస్తాయి. అందులోనూ మన ఇండియా లో క్రికెట్ కి, ఆ ఆట అభిమానులకి ఏమాత్రం లెక్కే లేదు. క్రికెట్ ఆటకి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పడం అవసరమే లేదు. గల్లీల్లో కూడా క్రికెట్ ని అనేక మంది ఆడుతూనే ఉంటారు.
క్రికెటర్ కనుక ఒక సిక్స్ కొడితే అభిమానులు టీవీ లో చూస్తూ మురిసి పోతారు. అంతే కాదు విజయం మనదే అన్నట్టు తెగ ఆనందం పడి సంతోషిస్తారు. ఇలా క్రికెట్ అంటే ఎన్నో.. అయితే ఈ పిల్ల మాత్రం నిజంగా అందరి మనసుని దోచుకుంది అనే చెప్పాలి.
ఈమె వయసు కేవలం ఏడు సంవత్సరాలే. భారత్ కి చెందిన ఈ అమ్మాయి పేరు పారీ శర్మ. ఈ అమ్మాయి ఆడిన ఆట వీడియో నెట్టింటి లో వైరల్ అవుతోంది. ప్రశంసల తో నిండి పోయింది. ఈ అమ్మాయి ఆడిన ఆట వీడియో కి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తో పాటు పలు క్రికెటర్లు కూడా కామెంట్స్ పెట్టారు.
వెస్ట్ ఇండీస్ ఆటగాడు షాయ్ హాప్ కూడా ముగ్దుడు అయిపోయాడు. ఈ చిన్నారి స్కిల్స్ మాత్రం నిజంగా అమోఘం. పారీ శర్మ పాదాలని పాదరసంలా కదుపుతోంది అంటూ ట్వీట్స్ వచ్చాయి. అలానే నేను పారీ లానే ఆడుతూ పెరిగాను అని ట్వీట్ చేసాడు షాయ్ హాప్ ట్వీట్ చేసాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments