భారత్ హాకీ లో దిగ్గజంగా నిలిచిన బల్వీర్ సింగ్ సీనియర్ హాకీ ఆటగాడు. అయితే ఈ సీనియర్ ఆటగాడు కన్నుమూసాడు. అయితే కొద్ది రోజుల నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన మొహాలీ లోని ఫారెస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు.
సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషయాన్ని ఆసుపత్రి డైరెక్టర్ రవి సింగ్ చెప్పారు. 1948 , 1952 , 1956 ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు సాధించడంలో బల్వీర్ కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉండగా 1975లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టు కోచ్ గా, మేనేజర్ గా వ్యవహరించి సుస్థిర స్థానం సంపాదించాడు.
అయితే ఇప్పటి వరకు ఎవరూ అధిగమించు లేదు అది విశేషం. అలానే తన కెరీర్లో 61 అంతర్జాతీయ క్యాప్స్ తో పాటుగా 246 గోల్స్ సాధించాడు. ఈయనకు భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.
ఎనలేని సేవలు చేస్తున్న ఇతనికి హాకీ ఇండియా 2015 లో మే మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా ప్రదానం చేసింది.
అయితే ఈయన మే 8న హాస్పిటల్లో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయితే గతంలో కూడా ఆయన ఆరోగ్యం బాగోక పోవడం తో మూడు నెలలకు పైగా హాస్పిటల్లోనే అతను ఉన్నారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments