మోడీ ప్రభుత్వం దేశం లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పాత పద్దతులను సమూలంగా మార్చేసే పనిలో రోజు రోజుకూ దూసుకుపోతోంది.. కనీసం నెలకొక కొత్త చట్టం, లేదా మనుగడలో ఉన్న చట్టాలను మార్చివేయడం మనం గమనిస్తున్నాం..
తాజాగా పన్ను చెల్లింపుల్లో సమూల మార్పుల దిశగా దేశం మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు ట్యాక్స్ పేయర్లు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అవినీతికి, వేధింపులకు తావులేని పన్ను విధానమే తమ లక్ష్యమని ప్రకటించిన ప్రధాని మోడీ పారదర్శకమైన, విశ్వసనీయమైన, స్వేచ్చాయుత వాతావరణంలో పన్ను చెల్లింపుదారుల హక్కులకు రక్షణ కల్పిస్తామని "ట్యాక్స్ పేయర్ చార్టర్" ప్రారంభం సందర్భంగా ప్రకటించారు.
పన్ను చెల్లింపుదారులు కూడా నిజాయితీగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. "పారదర్శక పన్నువిధానం - నిజాయితీపరులకు గౌరవం" అన్న ట్యాక్స్ పోర్టల్ ను మోడీ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. 20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థ మోడీ ఆవిష్కరించిన పారదర్శక పన్నువిధానంలోని 3 ప్రధాన అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం...
- అధికారుల్ని కలిసే అవసరం లేకుండా ఆదాయపన్ను మదింపు.. (ఫేస్ లెస్ అసెస్ మెంట్)..
- సమస్యలను ఆన్ లైన్ లోనే నివ్రుత్తి చేసుకునే వీలు కల్పించడం (ఫేస్ లెస్ అప్పీల్), పన్నుచెల్లింపుదారుల చార్టర్.
- పన్ను చెల్లింపుదారులు ఎవరిముందూ హాజరు కాకుండానే ట్యాక్స్ చెల్లింపులు చేయవచ్చు.
ఇప్పటివరకూ మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత ఐటీ విభాగం మన ఐటీ రిటర్న్స్, అప్పీల్స్ స్క్రూటినీ, నోటీస్ జారీ, సర్వే, జఫ్తు వంటి అంశాలను చూసుకునేది. స్థానిక అధికారి కీలకంగా ఉండేవారు. తాజా సంస్కరణలతో ఈ విధానం పూర్తిగా మారిపోతుంది. కొత్త విధానంలో ఇకపై స్క్రూటినీ కేసులను దేశంలోని ఏ అధికారికో ర్యాండమ్ గా కేటాయిస్తారు. ఆ అధికారి ఎవరో ట్యాక్స్ పేయర్ కు తెలిసే అవకాశాలు ఉండవు. అలాగే ఆ అధికారి నుండి వచ్చే ఆదేశాలన్నీ మరో రాష్ట్రానికి చెందిన అధికారులు సమీక్షిస్తారు. టీంలో ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ర్యాండమ్ గా కంప్యూటరే నిర్ణయిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డేటా అనలటిక్స్ వంటి టెక్నాలజీ వినియోగంతో స్క్రూటినీని పూర్తి చేస్తారు. దీంతో పన్నుచెల్లింపుదారుకూ, ఐటీ విభాగానికీ ప్రయోజనమే. పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లాల్సిన అవసరం లేనే లేదు. ఐటీ అధికారులపై ప్రత్యేక ఒత్తిడి ఉండదు. పన్ను చెల్లింపులకు అయ్యే వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతుంది ట్యాక్స్ పేయర్స్ చార్టర్. దీంతో నిజాయితీగా పన్నులు చెల్లించి దేశ ప్రగతికి తోడ్పడే వారితో పాటు ఆదాయ పన్ను విభాగానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఈ చార్టర్ ప్రకారం కొన్ని ముఖ్యమైన లాభాలు..
- ట్యాక్స్ పేయర్స్ సమస్యల పరిష్కారంలో అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ఐటీ విభాగం నుండి పొందవచ్చు.
- ప్రత్యేక కారణాలు ఉన్న సంధర్భం లో తప్పితే ప్రతి పన్ను చెల్లింపుదారుడిని నిజాయితీపరుడిగా పరిగణిస్తుంది.
- అప్పీల్స్ విషయంలో నిష్పాక్షిక సమీక్ష వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది.
- ట్యాక్స్ పేయర్ కు అవసరమైన కచ్చితమైన సమాచారం అందిస్తుంది.
- ఐటీ ప్రొసీడింగ్ కు సంబంధించి చట్ట ప్రకారం నిర్దేశిత సమయంలో నిర్ణయం ఉంటుంది.
- చట్ట ప్రకారం పన్ను బకాయిలు మాత్రమే వసూలు చేస్తుంది.
- అధికారుల వేధింపులు ఉండవు.
- పన్ను చెల్లింపుదారుడు తనకు నచ్చిన ప్రతినిధిని ఎంచుకోవచ్చు.
- ఫిర్యాదుకు, సమస్యను సకాలంలో పరిష్కరించుకునేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
- పన్ను చెల్లింపుకు అయిన ఖర్చును చట్టం అమలు సందర్భంగా పరిగణలోకి తీసుకుంటుంది.
- ట్యాక్స్ పేయర్స్ చార్టర్ లో ప్రభుత్వం, ఐటీ శాఖ పాటించాల్సిన 14 సూత్రాలు, ట్యాక్స్ పేయర్ పాటించాల్సిన ఆరు సూత్రాలు పొందుపరచడం జరిగింది.."
ఈ చట్టాన్ని గత ఏడాది అక్టోబర్ లోనే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లేంట్ లో ప్రవేశపెట్టారు.. తాజాగా ప్రధాని మోఅడీ రెండు రోజుల క్రితం చార్టర్ వెబ్ సైట్ ను ప్రారంభించారు..
మద్రాస్ హైకోర్టు ఇటీవలి ఉత్తర్వులలో, "ఫేస్ లెస్ పన్ను- అంచనా విధానాన్ని" అధికారులు సరిగా అర్థం చేసుకోలేకపోతే తలనొప్పులు వస్తాయని అభిప్రాయపడింది..
డీమోనిటైజేషన్ కాలంలో కోయంబత్తూరుకు చెందిన చిట్ ఫండ్ సంస్థ చేసిన 67.37 లక్షల రూపాయల నగదు డిపాజిట్లపై, అసెస్సింగ్ ఆఫీసర్ చేసిన అభ్యంతరాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ సేకరించిన డబ్బు, జమ చేసిన డబ్బు కి పొంతన లేదు అని తేల్చే ముందు అసెస్సింగ్ ఆఫీసర్ కనీసం వ్రాతపూర్వకంగా పిటిషనర్ వివరణ కోరాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు..
ఈ కేసు ప్రకారం, "సేలం శ్రీ రామవిలాస్ చిట్ కంపెనీ" తమ వద్ద ఉన్న క్యాష్ కి సరైన వివరణ ఇవ్వలేకపోయింది అనే అభియోగం ఎదుర్కుంటున్నారు. పిటిషనర్ ఇది చందాదారుల డబ్బు అనీ, ఇది డీమోనిటైజేషన్ ప్రకటనకు ముందు బ్యాంకుల్లో జమ చేయకపోవడం వల్ల మా వద్ద ఉండి పోయింది అని పేర్కొన్నారు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2017 ఫిబ్రవరి 17 న ఆ డబ్బు వివరాలు బ్యాంక్ కు అందించి జమచేయడం జరిగింది అని కూడా తెలిపింది.. ఈ కేసు చివరకు పన్ను అధికారి చేసిన పొరపాటు గా తేలింది..
ఈ కొత్త ట్యాక్స్ విధానం ద్వారా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 58,322 కేసులలో, 48,000 కేసులను డిజిటలైజ్ పద్దతిలో మార్పు చేసి వారికి నోటీసులు అందించడం జరిగింది..
కొసమెరుపు ఏంటంటే 130 కోట్ల మంది భారతీయ జనాభాలో కోటిన్నర మంది మాత్రమే ప్రభుత్వానికి నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నారు. అంటే ఇది 2 శాతానికి మించడం లేదు.. మరి ఈ లెక్కన రాజకీయనాయకులను మనం నిందించడం కాసేపు పక్కన పెట్టి సమాజాన్ని కూడా ఒకసారి ఉతికి ఆరేస్తే నయమేమో అనిపిస్తుంది.. మీరేమంటారు?
కొన్ని దేశాల్లో అయితే అవినీతి పరులను, ట్యాక్స్ ఎగ్గొట్టేవాల్లని పసిగట్టి సంభందిత అధికారులకు తెలియజేస్తే వారికి తగిన బహుమానం ఉంటుంది.. ఈ విధానం అక్కడ విజయవంతం అయ్యింది కూడా.. అలాగే మన దేశం లో కూడా కోటి రూపాయల అవినీతిని తమ ద్రుష్టి కి తీసుకొస్తే పది లక్షలు బహుమానంగా ఇస్తాం అని గనక ప్రభుత్వం ప్రకటిస్తే కొందరు అదే ఒక పనిగా పెట్టుకుని బహుమతులు కొట్టేస్తారనడం లో అతిశయోక్తి లేదేమో.. దీంతో దేశం అభివ్రుద్ది చెందుతుంది.. అధికారులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.. కాదంటారా? మీ ఆలోచనలను కూడా కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments