అనాధ ఆడపిల్లలకు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక వందల శరణాలయాలు ఎంతో పెద్ద మనసు చేసుకుని భావి భారత వీరమహిళలుగా తీర్చిదిద్దుతున్నాయని మనందరం అనుకుంటూ ఉంటాం.. ఆ శరణాలయాలకు దేశ విదేశీ దాతలు విరాళాలు పంపిస్తూ ఆడపిల్లలను ఆదరిస్తున్నామన్న సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.. అయితే నిజానికి ఆయా వసతి గ్రుహాల్లో జరిగే అసలు తంతు వారికి తెలిస్తే మాత్రం గుండెలు బద్దలవడం ఖాయం.. ఇందుకోసమా మేము విరాళాలిచ్చి అనాధ బాలికలను ఆదుకుంటున్నది అని నోరెళ్ళబెట్టడం ఖాయం. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అక్కడ జరుగుతున్న తతంగాలేమిటి? అదంతా చూస్తూ కూడా అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు? బాలికల జీవితాలు అధోగతి పాలవడానికి ముఖ్య కారణాలేమిటి? అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..
కొన్నేళ్ళ క్రితం బీహార్ లోని ముజఫరాబాద్ లో జరిగిన ఒక సంఘటణ దేశాన్ని కుదిపేసింది.. అక్కడ ఉన్న ఒక బాలికల వసతి గ్రుహం లో సుమారు 34 మంది బాలికలపై అనేక నెలలుగా లైంగికంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని బయటకి పొక్కింది.. మరో 15 ఇతర గ్రుహాల్లో నీచాతినీచంగా అవి వసతి గ్రుహాలు అని కూడా గుర్తించలేనంతగా వ్యభిచార గ్రుహాలేమో అనుకునేంతగా నిలిచాయి.. ఇదే రీతిలో ఉత్తరప్రదేశ్ లోని మరిన్ని వసై గ్రుహాల్లో ఇలాంటి ఘటనలే వెలుగు చూడడం కన్నీరు పెట్టిస్తోంది..
ఈ భాగోతం కోర్టులవరకూ చేరి సంభంధిత అధికారులను నిలదీయడం తో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
బాలల హక్కుల సంఘం ఈ తతంగం దేశ వ్యాప్తంగా జరుగుతుందేమో అనే అనుమానం తో సర్వే చేపట్టగా అన్ని రాష్ట్రాల్లో ఇదే తీరు కనబడుతోందని నివేదిక తయారు చేసింది..
ఎక్కడా కూడా ఆడపిల్లలకు సరైన భద్రత, సమ్రక్షణ ఉండడం లేదని తేలింది.. త్రిపుర, కర్ణాటక, కేరళ, ఒడిషా, అసోం లలో ఈ అరాచకాలు శ్రుతి మించాయి..
ఆంధ్ర ప్రదేశ్ లో 142 కేంద్రాల్లో 6 వేల మందికి పైగా ఉంటున్న శరణాలయాలకు 400 కోట్ల రూపాయల విరాళాలు సమకూరుతుండగా ఒక్కో బాలికకు ఏడాదికి 6 లక్షల రూపాయలు ఖర్చు చేయవచ్చు.. అన్ని రాష్ట్రాల్లో కొంచం అటు ఇటుగా ఇదే తీరు.. ఈ విరాళాలతో మరిన్ని గ్రుహాలు నిర్మించి మరింత మందికి ఆశ్రయం కల్పించవచ్చు. కానీ అవినీతి తారాస్థాయికి చేరి నిధులు, విరాళాలు దారిమళ్ళుతున్నాయనడానికి ఇదో పెద్ద నిదర్శనం..
భారత రాజ్యాంగం లో భరతమాత ఒడిలో కన్ను తెరిచిన ఏ బాలబాలికలైనా సంతోషంగా, పూర్తి రక్షణతో బ్రతికేలా ఆయా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.. అయితే ఆ చట్టాలను తుంగలో తొక్కడం మన నాయకులకు పరిపాటి అయింది..
విదేశాల్లో ఇలాంటి హేయమైన చర్యలకు కఠిన శిక్షలు అమలవుతున్నాయి.. కానీ మనదేశం లో అలాంటివి శూన్యం.. ప్రతి వ్యవస్థలోనూ అసాంఘిక రాజకీయ శక్తులు దూరి అమాయక బాలికలతో బొమ్మలాట ఆడుకుంటున్నాయి..
దేశం లో ప్రతి 16 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్నా, అది పెద్ద విషయం కాదు అన్నట్టు వ్యవహరిస్తున్న మన ప్రభుత్వాలను నమ్ముకుని బ్రతకాల్సిన దిస్థితి మన సమాజం పై పడింది.. దీనంతటికీ మూలం ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఏమంటారు?
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments