తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో కార్పోరేట్ సంభందిత నిర్ణయం వివాదాస్పదమయ్యింది.. బ్యాంకింగ్ రంగం లో కార్పోరేట్ దిగ్గజాలను అనుమతించడం సరైన పద్దతి కాదని మాజీ రిజర్వ్ బ్యాంక్ అధినేత రఘురాం రాజన్, విఠల్ ఆచార్య లు ఒక కధనం లో వెళ్ళడించారు..
దేశ వ్యాప్తంగా అనేక రంగాలలో అంబానీ, ఆదానీ ల వంటి కార్పోరేట్ దిగ్గజాలకు వెసులుబాట్లు కల్పిస్తూ వారి అభివ్రుద్దికి తోడ్పడుతున్న మన ప్రభుత్వం తాజాగా ఆయా సంస్థలు బ్యాంకులు కూడా ఏర్పాటుచేసుకోవచ్చని వెళ్ళడించింది.. దీంతో ఇప్పటికే బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని దర్జాగా ఎగ్గొడుతున్న మాల్యా, నీరవ్ వంటి బడా దొంగలు మరింతమంది పుట్టుకు వస్తారనే ఆందోళణ వెళిబుచ్చారు రాజన్..
ఈ విధానం తో దొంగల చేతిలో తాళ పెట్టినట్టు కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.. ఈ పద్దతిలో బ్యాంకులూ వారిచేతిలోనే, రుణాల మంజూరూ వారిచేతిలోనే ఉంటే అడ్డదిడ్డంగా రుణాలు మంజూరు చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు.. ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.. ప్రభుత్వ మానిటరింగ్ ఉన్నప్పటికీ అది పూర్తిస్థాయిలో పనిచెయ్యడం సాధ్యం కాదు..
చరిత్రను ద్రుష్టిలో పెట్టుకుని చూస్తే ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోకపోగా మరింత దిగజారి దొంగలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి..
ఈ మధ్యకాలంలోనే ఎల్ ఐ సీ సంస్థ వాటాలను, ఆస్థులను విక్రయించి సొమ్ము చేసుకుని బడ్జెట్ లోటును భర్తీ చేసుకుంటున్న మన ప్రభుత్వం బ్యాంకుల్లో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించడం శోచనీయం అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
రిజర్వ్ బ్యాంక్ కార్యాచరణ బ్రుందం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.. ఇది ఎంతమాత్రమూ సరికాదని పలు వార్తా సంస్థలు చర్చల్లో భాగంగా వివరించారు..
ఇలాగే ప్రభుత్వాల తీరు కొనసాగితే మాత్రం దేశం పూర్తిస్థాయిలో కోలుకోలేని విధంగా దివాళా తీయడం ఖాయం అని తెలుస్తోంది..
మరో పక్క దేశం లో వైద్యం, విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలు, స్త్రీ భద్రత కుదేలవుతుంటే వాటికి దీర్ఘకాలిక పరిష్కారాలు చూపకుండా పైపై మెరుగులు దిద్దుకుంటూ అసలు సమస్యను కార్పెట్ వేసి మూసేస్తున్నారు.. అది ఏనాడో అగ్నిపర్వతంలా బద్దలయితే తప్ప తత్వం బోధపడదు అనిపిస్తోంది.. ఏ రంగం లో చూసినా భారత్ చివరి స్థానాల్లో కొట్టుమిట్టాడుతోంది.. చదువు, వైద్యం అయితే "చీ" అనిపించే స్థాయిలో భారత దేశం ఉసూరుమంటోంది..
కాంగ్రెస్ హయాం లో అవినీతి, చైనాతో దోస్తీ చేసి ఆర్ధిక సామాజిక వెనుకబాటుకు కారణం కాగా నేడు బీజేపీ ప్రభుత్వం మరో పద్దతిలో దేశ ఆర్ధిక వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తోందనేది జగమెరిగిన సత్యం అని పలువురు వాపోతున్న అంశం.. మీరేమంటారు?
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments