గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాల‌పై గాంధీ అభిప్రాయం ఏమిటి?

img

గాంధీజీ సినిమాలు చూసేవారా?

సినిమాల‌పై గాంధీ అభిప్రాయం ఏమిటి?

జాతిపిత‌పై ఎన్ని సినిమాలొచ్చాయి?

మ‌హాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మ‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కుడు. ఆయ‌న జీవితంలోని అనేక సంఘ‌ట‌న‌లు మ‌న‌కు స్ఫూర్తినిస్తాయి. అటువంటి మ‌హ‌నీయుని అభిరుచుల గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లం ప్ర‌తీఒక్క‌రికీ ఉంటుంది. వాటిలో ఒక‌ అంశం ఏంటంటే? "గాంధీజీ సినిమాలు చూసేవారా?"... అవును, గాంధీజీకి సినిమాల‌పై ప్ర‌త్యేక అభిప్రాయం ఉంది... అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  

ఇండియన్ సినిమాటోగ్రఫీ కమిటీ దేశంలో ప్రజలు సినిమా చూసే అలవాటుపై 1927-28లో ఒక సర్వే నిర్వ‌హించింది. ఈ కమిటీ మ‌హాత్మా గాంధీకి కూడా ఒక ప్రశ్నావళి పంపింది. ఆయన దానికి జవాబిస్తూ....నేనింతవరకు సినిమా చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా జవాబివ్వలేను. సినిమా చేసే మంచేమిటో రుజువు చేసుకోవలసిన అవ‌స‌రం ఉంది. సినిమా చేసే చెడు ఏమిటో కనబడుతోంది అంటూ జవాబిచ్చారట. గాంధీజీకి సినిమాలపై సదభిప్రాయం లేదన్నది దీనితో స్ప‌ష్ట‌మ‌వుతుంది. అందుకే సినిమావాళ్ళు కూడా ఆయనకు కాస్త దూరంగానే ఉన్నార‌నే వాద‌న వినిపిస్తుంటుంది. ప్రముఖ దర్శకుడు కే.ఏ.అబ్బాస్ గాంధీజీకి ఒక లేఖ రాసి, సినిమాల గురించి ఆయన అభిప్రాయం మార్చడానికి ప్రయత్నించారు. లూయిస్ పాశ్చర్, బాయ్స్ టౌన్, సంత్ తుకారాం సినిమాలను చూడాలని కోరారు.

గాంధీజీ సినిమాలకు దూరంగా ఉన్నట్లే సినిమా పరిశ్రమ కూడా గాంధీజీకి దూరంగానే ఉంది. ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపించింది న్యూస్ రీళ్ళలో మాత్రమే. గాంధీజీపై 1922లో బ్రిటీష్ పాథే తీసిన సైలెంట్ రీల్ మొదటి సినిమాగా చెప్పవచ్చు. ఏప్రిల్ 1931లో అమెరికాకు చెందిన ఫాక్స్ మూవీటోన్ సంస్థ ఆయన‌‌ను ఇంటర్వ్యూ చేసింది. మహాత్మా గాంధీ టాక్స్ పేరుతో దానిని విడుదల చేసింది. మరో సంవత్సరం తర్వాత ఎంజిఎం సంస్థ అన్నాక్రీస్టీ సినిమా తీసుకువచ్చింది. దానికి గార్బో టాక్స్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. గాంధీజీపై పూర్తి నిడివి డాక్యుమెంటరీ 1940లో ఏ.కే.చెట్టియార్ తీశారు. దీనికి అమెరికా పాథె న్యూస్ కెమెరామ్యాన్ గా పనిచేశారు. అనేక ప్రాంతాలకు తిరిగి ఫుటేజి సేకరించారు. 50వేల అడుగుల రీళ్ళను ఎడిట్ చేశారు. ఇది గంటా ఇరవై నిముసాల డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ పేరు మహాత్మాగాంధీ ట్వంటియత్ సెంచరీ ప్రాఫెట్‌గా చెప్పుకోవ‌చ్చు.

గాంధీజీ పాత్రలో మరొకరు నటించిన మొదటి సినిమా 1963లో వచ్చిన నైన్ అవర్స్ టు రామా.... ఇది సినిమా స్కోప్‌లో తీసిన చిత్రం. ఇందులో నటించిన వారంతా హాలీవుడ్ నటులే. స్టాన్లీ వాలపర్ట్ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. నిజానికి ఈ సినిమా నాథూరాం గాడ్సేకు సంబంధించిన‌ది. గాంధీజీ అంతమొందించేందుకు ముందు నాథూరాం గాడ్సే ఏం చేశారో వివ‌రించే కథనం ఇది. ఇది నవలగానూ వచ్చింది.

1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. 1993లో వచ్చిన సర్దార్ పటేల్ గురించిన సినిమా సర్దార్ లో అన్నూ కపూర్ గాంధీజీ పాత్ర పోషించారు. హేరామ్ సినిమాలో నసీరుద్దీన్ షా గాంధీ పాత్రలో మెప్పించారు. ఈ సినిమా 2000వ సంవ‌త్స‌రంలో వచ్చింది. గాంధీ మై ఫాదర్ మూవీ 2007లో వచ్చింది. ఇందులో దర్శన్ జరీవాలా గాంధీగా నటించారు. లెజండ్ ఆఫ్ భగత్ సింగ్; నేతాజీ సుభాష్ చంద్రబోస్ సినిమాల్లోను, తర్వాత ది లాస్ట్ డేస్ ఆఫ్ రాజ్ టీవీ కార్యక్రమంలోను సురేంద్ర రాజన్, గాంధీ పాత్రలో నటించారు. వైస్రాయ్ హౌస్ సినిమా 2017లో వచ్చింది. ఇందులో గాంధీ పాత్రలో నీరజ్ కబీ నటించారు. సంవిధాన్ టీవీ కార్యక్రమంలో కూడా నీరజ్ కబీ, గాంధీగా నటించారు.

రాజ్ కుమార్ హీరానీ 2006లో తీసిన లగే రహో మున్నాభాయ్ కల్పిత పాత్ర ద్వారా గాంధీజీని పరిచయం చేసిన సినిమా. ఈ సినిమా తర్వాత గాంధీగిరి అనే పదం వాడుకలోకి వచ్చింది. మరాఠా నటుడు దిలీప్ ప్రభావల్కర్ గాంధీపాత్రలో నటించారు. ఈ సినిమాలో గాంధీజీ రాజకీయ పోరాటాలు చేసిన గాంధీ కాదు, నైతిక మార్గదర్శనం చేసే గాంధీ. ఈ సినిమాల్లో చెప్పుకోదగింది శ్యామ్ బెనెగళ్ తీసిన బయోపిక్ ది మేకింగ్ ఆఫ్ మహాత్మా. రజిత్ కపూర్ గాంధీ పాత్రలో నటించిన ఈ సినిమా 1996లో వచ్చింది. ఫాతిమా మీర్ రాసిన ది అప్రంటిస్ షిప్ ఆఫ్ మహాత్మా పుస్తకం ఆధారంగా తీసిన సినిమా ఇది. చెప్పుకోవలసిన మరో సినిమా ది పార్టిషన్. 2007లో వచ్చిన ఈ సినిమా దేశవిభజన కాలాన్ని తెరకెక్కించింది. ఈ సినిమాలో గాంధీ పాత్రను నీరజ్ కబీ నటించారు. మహాత్మ సినిమాలోను గాంధీజీ పాత్రతో సంభాషణ దృశ్యంఉంది. ఇందులో గాంధీ పాత్రను రాంజగన్ పోషించారు. ’మై రిలీజియన్ – ఎంకె గాంధీ’ పుస్తకం ఆధారంగా డాక్టర్ గౌతమ్ కశ్యప్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ 12 నిమిషాల నిడివి గల ’ఎన్‌కౌంటర్ విత్ మహాత్మ’ అనే డాక్యు ఫిక్షన్‌ను రూపొందించారు.

గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్‌లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్‌లే కి అకాడెమీ  అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. ఇక ఆ సినిమాతో మరొక సారి గాంధీజీ స్ఫూర్తి అనేకదేశాల్లోని ఎంతోమందిని ఇన్స్పయిర్ చేసింది.

గాంధీ అనేది గొప్ప సినిమా అయినా కూడా అందులో గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో ట్రైయిన్‌లో నుండి తోసివేసిన దగ్గరినుండి మొదలుపెట్టి ఆయన మరణం వరకు మొత్తం చూపించారు. కానీ అసలు గాంధీజీ స్వభావం అలా రూపుదిద్దుకోవడానికి మూలం ఏంటి?, ఆయన ప్రస్థానం ఎలా మొదలయ్యింది లాంటి విశేషాలతో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ 'ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ' అనే సినిమా రూపొందించారు. ఈ సినిమాలో గాంధీజీ మహాత్ముడిగా మారడానికి ముందు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆ సినిమా కూడా ఇంగ్లీష్‌లో రూపొంది చాలా ఆదరణ పొందింది. 1996లో తెరకెక్కిన ఆ సినిమాని జాతీయ అవార్డు వరించింది. ఆ సినిమాలో గాంధీజీగా నటించిన రంజిత్ కపూర్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

గాంధీజీ త‌న‌ చేతితో ఆయుధం పట్టలేదు. స్టయిలిస్ దుస్తులు తొడగలేదు. అసలు గట్టిగా గొంతెత్తి కూడా మాట్లాడలేదు. అయినా రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం ఆయన పేరు చెబితే ఉలిక్కిపడేది. గడగడలాడేది. నిజానికి గాంధీజీకి సినిమాలపై సదభిప్రాయం లేదు. అయితే జాతిపిత‌ రెండు సినిమాలు చూశారు. 1944లో మలేరియాతో బాధపడుతున్న గాంధీజీ రెండు సినిమాలు చూశారు. మొదటి సినిమా మైకెల్ కర్టిజ్ తీసిన మిషన్ టు మాస్కో. ఇది రష్యన్ సినిమా. ఆ తర్వాత గాంధీజీ చూసిన రెండవ సినిమా రామరాజ్య. విజయ్ భట్ దర్శకత్వంలో ఈ సినిమా 1943లో వచ్చింది. ముంబయిలో ఈ సినిమాలను ప్రత్యేక ప్రదర్శన ద్వారా ఆయన చూశారు.  

ఇదండీ గాంధీజీకి, సినిమాలకు మధ్య ఉన్న అనుభంధం.. గాంధీజీ పై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో పంచుకోండి.. 

మరిన్ని

Comments

0 Comments

జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()