కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని పీడిస్తోంది. ఈ మహమ్మారి ప్రాణాల తో చెలగాటం ఆడుతూ అందరినీ కూడా హింసిస్తోంది. కరోనా మంచి పాఠాన్ని అందిస్తూ మనుష్యులకు మంచి బుద్ధి చెబుతోంది. ఈ మహమ్మారి పెట్టే ఇబ్బందులకు అంతు లేకుండా పోతోంది. ఈ రక్కసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎంత కట్టడి చేసిన వైరస్ వేగంగానే వ్యాపిస్తోంది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త సొల్యూషన్ తీసుకొచ్చింది తమిళ్ నాడు ప్రభత్వం.
ప్రజలని ఎంత కట్టడి చేసినా కూడా నిత్యం అవసరమైన కూరలకి వివిధ వాటిని కొనుగోలు చేయడానికి వస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయం పై ఎంతో లోతుగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే వైరస్ కి అడ్డుకట్టగా నిలిపారు ఈ టన్నెల్ ని. తమిళ్ నాడు లోని తిరుపూర్ జిల్లా మార్కెట్ ముందు కరోనా డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేసారు. ఆ టన్నెల్ 16 అడుగుల పొడవు, 5 వెడల్పు తో ఉంది. ఆ టన్నెల్ కి రెండు పక్కల కూడా రెండు సెట్ల స్ప్రేయర్లని అమర్చారు. ఒక్కో దానిలో కూడా మూడు నాజిల్స్ ఉన్నాయి.
ఎవరైనా అక్కడికి వెళ్తే అందులో నుండి స్ప్రే అవుతుంది హైపోక్లోరైడ్. ఎవరైతే మార్కెట్ లోకి వస్తారో వారు అంతా కూడా ముందు వాష్ బేసిన్ దగ్గర కి వెళ్లి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత రెండు చేతులు ఎత్తి టన్నెల్ లోకి వెళ్ళాలి. అప్పుడు అందులో పెట్టిన స్ప్రేయర్ల నుండి పిచికారీ చేస్తుంది. దీని వల్ల వైరస్ లాంటివి ఏమైనా ఉంటే అవి తొలగి పోతాయి.
శరీరం పై పడగానే ఏమైనా వైరస్ ఉంటే అది చచ్చిపోతుందిట. ఇలా చెయ్యడం వల్ల ఎటువంటి అపాయం కూడా లేదు అని డాక్టర్లు చెప్పారట. ఈ ఒక్క టన్నెల్ చెయ్యడానికి సుమారు రూ.90 వేలు ఖర్చు అయ్యిందట. 16 గంటలు పాటు దీనిని స్ప్రే చెయ్యచ్చట. ఇది విజయవంతం అవ్వడం వల్ల ఇతర జిల్లాలో కూడా ఏర్పాటు చెయ్యాలని అనుకొంటోందట ప్రభుత్వం.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments