భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. అయితే ప్రస్తుతం పరిస్థితిని ఉద్దేశించి వీరు మరో ప్యాకేజి పై చర్చిస్తున్నట్టు సమాచారం అందింది. అయితే ఇప్పటికే ఆర్ధిక ఉద్దీపన పథకం పెట్టి ప్రజలకి తోడుగా వ్యవహరించి ఆర్ధికంగా ఆదుకున్న సంగతి తెలిసినదే.
అయితే 1.75 లక్షల కోట్ల తో దీనిని ప్రవేశ పెట్టారు. కాగా ఈ ప్యాకేజీలో సంతృప్తి లేదు అని అనడం తో మరో దానిని తీసుకొస్తారేమో అని వార్తలు వినబడుతున్నాయి. మాములుగా మొదట ప్రవేశ పెట్టిన ప్యాకేజి ఉద్దేశం బడుగు, బలహీన వర్గాలని ఆదుకోవడమే వారి లక్ష్యంగా ఈ మొత్తాన్ని ప్రవేశ పెట్టారు.
అయితే బడ్జెట్ ప్రకటించిన మొత్తం కూడా ఇందులో ఉందని ఎస్ బి ఐ ఆర్ధిక వేత్తలు కూడా అన్నారు. అయితే వీటిని అన్నింటిని పరిశీలించాక కేంద్ర మరో రూ లక్ష కోట్లకి పైగా ఆర్ధిక ఉద్దేపన పధకం పెడుతున్నట్టు వార్తలు వినబడుతున్నాయి.
స్థిరాస్తి, సూక్ష్మ మధ్య తరహా వ్యాపారాలకు, వడ్డీ రాయితీలకు మినహా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పునర్ మూల ధన సమీకరణకు ప్యాకేజి లో ప్రాధాన్యం ఉంటుందిట. వీటన్నింటి గురించి చర్చించడానికి నిర్మల సీతారామన్ మోదీ తో భేటీ అయ్యారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments