కోవిడ్ వ్యాప్తి వలన ఎప్పటినుండో వస్తున్న "వ్యభిచారం" వృత్తి తో పాటూ మనిషి జీవితంలోని అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహమ్మారి సమయంలో అత్యంత ఘోరమైన పరిస్థితులను భివాండి ఏరియాలోని హనుమాన్ టెక్డి కి చెందిన రెడ్ లైట్ ఏరియా (ఆర్‌ఎల్‌ఎ) అనుభవిస్తోంది. ఈ ఏరియాలోని 87% మంది వ్యభిచార వ్రుత్తిలో ఉన్న మహిళలు ఇప్పుడు జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని శ్రీ సాయి సేవా సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది, ప్రధానంగా వ్యభిచార వ్రుత్తి సాగించే వారి సంక్షేమంపై దృష్టి సారించే ఎన్జీఓ ఇది.
నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి మరియు వారి కడుపు నింపడానికి ఈ ఎన్జీఓ వీరికి టైలరింగ్ మరియు దియా-మేకింగ్ వంటి వివిధ కార్యక్రమాలలో శిక్షణ ఇవ్వడానికి నడుం బిగించింది. వైరస్ వ్యాపిస్తుందనే భయం తో ఈ వ్రుత్తిలో కొనసాగే స్త్రీలు గత 8 నెలలుగా ఆ పనిని పక్కనపెట్టి అప్పటివరకూ సంపాదించిన కొద్దో గొప్పో డబ్బుని ఖర్చుచేసుకుంటూ వస్తున్నారు... ఏదేమైనా, సంక్షోభంలో 8 నెలలుగా తాము మరిన్ని అప్పులు మరియు పేదరికం లోకి కూరుకుపోతామని భయపడుతున్నారని ఒక నివేదిక పేర్కొంది.
"భివాండి" ఆసియాలో అతిపెద్ద వ్యభిచార కేంద్రాలలో ఒకటి. చాలా పెద్ద బహుళజాతి కంపెనీలు మరియు ఇ-కామర్స్ దిగ్గజాలు తమ సంస్థలను భివాండిలో ఏర్పాటు చేశాయి. పట్టణం పెరుగుతున్న కొద్దీ, హనుమాన్ టెక్డి యొక్క రెడ్ లైట్ ప్రాంతం పుట్టగొడుగులా పెరిగిపోయింది.
ఇతర నగరాలు మరియు దేశాల మహిళలు ఇక్కడ ఉద్యోగాల కోసం వస్తారు.. ఆ తర్వార వ్యభిచారంలోకి నెట్టబడతారు, అక్కడ వారి కస్టమర్లలో ఎక్కువ మంది ట్రక్ డ్రైవర్లు మరియు అన్ని ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు ఉంటున్నట్టు వెల్లడవుతోంది.
హనుమాన్ టెక్డి లో 500 కు పైగా వ్యభిచార వ్రుత్తి కొనసాగిస్తున్న వారిలో, 56% విదేశీ స్త్రీలు ఉన్నారని శ్రీ సాయి సేన సంస్థ వ్యవస్థాపకుడు స్వాతి సింగ్ చేసిన అధ్యయనంలో తేలింది. మెజారిటీ మహిళలు, అంటే 46% మంది బంగ్లాదేశ్ నుండి వచ్చారు, మిగిలిన 10% నేపాల్ నుండి వచ్చారు. ఈ మహిళలు సరిహద్దుల్లో అక్రమ రవాణాకు గురయ్యారు .. మరికొంతమంది పని కోసం వలస వచ్చి చివరికి శరీరాన్ని అమ్ముకునే ఈ వ్యాపారంలో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వారిలో ఎక్కువ మంది ఇష్టపూర్వకంగా ఈ పని చేయడం లేదు. వారిలో 78% మంది బంధువులు, స్నేహితులు లేదా వారి భర్తల వలన ఈ వ్యభిచార వ్రుత్తిలోకి నెట్టివేయబడ్డారు.. మరికొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ వలలో చిక్కుకున్నారు.
ఇక మిగిలిన వారిలో 60% మంది వ్యభిచారులు పొరుగున ఉన్న స్నేహితులు, దుకాణదారులు, స్థానిక వడ్డీ వ్యాపారులు మరియు స్వంత వేశ్యాగృహం నిర్వాహకుల వంటి అనధికారిక వనరుల నుండి రుణాలు తీసుకున్నారని తెలిసింది.. “నా కుటుంబం మనుగడ కోసం పోరాడుతున్నందున నేను చాలా చిన్న వయస్సులోనే ఈ వ్రుత్తి లోకి ప్రవేశించాను, నేను చదువుకునే అవకాశాన్ని కోల్పోయాను, ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడిన శ్రీ సాయి సేవా సంస్థకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఒక బాలిక పేర్కొంది.. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి నేను ఎదురుచూస్తున్నాను అని కూడా ఆమె చెప్పారు..
సాయి ఎన్జీఓ కూడా తాము చేసిన అధ్యయనం ద్వారా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. విధాన రూపకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో, స్థానిక వ్యభిచార వర్కర్లకు కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపశమనం కలిగించడానికి మరియు లైంగిక వ్రుత్తి నుండి వైదొలగడానికి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి, ఉద్యోగ అవకాశాల కోసం ప్రాథమిక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందించాలి. తమ వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు రుణం, ఇతర సౌకర్యాలు కల్పించాలి అని వారు చెప్తున్నారు..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments