మొదటి భాగం లో మదర్ థెరెసా బాల్యం, ఆమె సాధించిన ఘనత, కోల్కతా లో చేసిన సేవ మొదలైన అంశాలు తెలుసుకున్నాం.. ఈ వీడియోలో ఆమె మలిదశ జీవితం లో ఎదుర్కొన్న వివిధ సంఘటనలేంటో తెలుసుకుందాం..
1982 లో "బీరూట్" ఆక్రమణకు గురైన సందర్భంలో, మదర్ థెరీసా ఇజ్రాయిల్ సైన్యానికి, పాలస్తీనా గెరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు. ఈ పిల్లలను ద్వంసమైన వైద్యశాల నుండి బయటకు తీసుకు రావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించారు.
1980 లలో "తూర్పు యూరోప్" బాహ్య ప్రపంచంలోకి వచ్చినపుడు, అనేక కార్యక్రమాలను ప్రారంభింప చేసి ఆమె తన సేవా కార్యక్రమాలను కమ్యూనిస్ట్ దేశాలకు విస్తరించారు. గర్భస్రావం, విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె గుండె ధైర్యం తో ఎదుర్కొని, "ఎవరేమన్నా, చిరునవ్వుతో దానికి అంగీకరించి, నీ పనిని నువ్వు చేసుకొని పోవాలి" అని తెలిపారు.
మదర్ థెరీసా ఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్లో అణుధార్మికత పీడితులకు, అర్మేనియాలో భూకంపం వలన నష్ట పోయిన వారిని ఓదార్చి సహాయం చేయడానికి వెళ్లారు. 1991 లో, మదర్ థెరీసా మొదటిసారి తన మాతృదేశమైన అల్బేనియా లోని టిరానాలో "మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్" హోమ్ ని ప్రారంభించారు.
విరాళాల ద్వారా వచ్చిన ధనాన్ని ఖర్చు చేసే విషయం లో పలువురి విమర్శలకు గురయ్యింది. మదర్ థెరీసా, విరాళాల ధనాన్ని పేదరికం తొలగించడానికి, ధర్మశాలల లోని పరిస్థితులను మెరగుపరచడానికి కాక మతపరమైన కార్యక్రమాలను పెంచడానికి వెచ్చించారని కొందరు నిందించారు.
మదర్ థెరీసా "హైతి" లోని నిరంకుశులు, అవినీతి పరుల కుటుంబం నుండి విరాళాలను తీసుకుని వారిని బహిరంగంగా అభినందించారు. అవినీతి ఆరోపణలతో నిందితుడిగా ఉన్న చార్లెస్ కీటింగ్ నుండి 1.4 మిలియన్ డాలర్ల విరాళాన్ని తీసుకుని అతడి అరెస్టుకు ముందు, తరువాత కూడా వెన్నుదన్నుగా నిలిచారు.
మిషనరీస్ అఫ్ ఛారిటీ పూర్వ సభ్యురాలు అయిన లివేర్మోర్, తాను సంస్థను విడిచి పెట్టడానికి గల కారణాలను తన పుస్తకం లో వివరించారు. మదర్ థెరీసా మంచితనం, ధైర్యం కలిగియున్న వ్యక్తి ఐనప్పటికీ ఆమె "వేదాంతము" సరైనది కాదు అన్నారు. మదర్ థెరీసా, తన శిష్యులకు క్రీస్తు చరిత్రను వ్యాపింప చేయాలని ఆదేశించేవారు. కేటాయించిన సమయం లో కాకుండా ఇతర సమయాల్లో ఎవరైనా సన్యాసినుల సహాయం కోసం వచ్చిన వారికి సహాయం చేయవద్దని సన్యాసినులకు నిభందనలు విధించేవారు.. వివిధ రోగాలతో బాధపడే రోగులకు సంబంధించి చికిత్సలో శిక్షణ పొందేందుకు సన్యాసినుల అభ్యర్ధనను నిరాకరించేవారు.. అలా ప్రయత్నించే సన్యాసినులను తమ స్నేహితుల నుండి దూరంగా బదిలీ చేయడం లాంటి "అనుచితమైన" శిక్ష లను విధించే వారని ఉదాహరణలు ఇచ్చారు.
లౌకిక పరమైన పుస్తకాలను, దినపత్రికలను చదవడాన్ని నిషేధించడం, సమస్యల పరిష్కారానికి స్వంత ఆలోచన లేకుండా విధేయతకు ప్రాముఖ్యత నివ్వడం వంటి వాటితో మిషనరీస్ అఫ్ ఛారిటీ సమస్యలను ఎదుర్కొందని "లివేర్మోర్" పేర్కొనారు.
1983 లో పోప్ జాన్ పాల్ ను కలుసుకోవడం కోసం మదర్ థెరీసా, రోమ్ వెళ్ళినప్పుడు ఆమె గుండెపోటుకు గురయ్యారు. 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ "పేస్ మేకర్" ను అమర్చారు. 1991 లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని గుండె సమస్యలను ఎదుర్కున్నారు. అప్పుడే మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు. కానీ సంస్థ లోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమెను ఆ పదవిలో కొనసాగాలని కోరారు. సంస్థ అధిపతిగా కొనసాగడానికి మళ్ళీ మదర్ థెరీసా అంగీకరించారు.
ఏప్రిల్ 1996 లో మదర్ థెరీసా పట్టుతప్పి క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది. ఆగస్టులో ఆమె మలేరియాతో బాధ పడటంతో పాటు గుండె ఎడమభాగం పనిచేయడం మానేసింది. ఆమెకు "గుండె శస్త్రచికిత్స" జరిగింది, కానీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. తాను అనారోగ్యం పాలైనపుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా, కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది. మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి కడసారిగా వైదొలిగారు.. 1997 సెప్టెంబర్ 5 న ఆమె మరణించారు.
మదర్ థెరీసాకు మొదటి సారి హృదయ సంబంధ సమస్యలు ఎదురైనపుడు ఆమెపై దెయ్యం దాడి చేసిందని, దాన్ని వదలగొట్టడానికి ఆమె అనుమతితో ఒక ఆచార్యుడు ప్రయత్నించాడని ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది..
ఇక 1962 లో పద్మశ్రీ, జవహర్లాల్ నెహ్రూ అవార్డు, భారతరత్న అందుకున్నారు.
ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి ఐన "నవీన్ చావ్లా" రచించి, 1992 లో ప్రచురించారు.
విశ్వ హిందూ పరిషత్, ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
సెప్టెంబర్, 1997 లో ఆమె అంత్యక్రియలకు ముందు మదర్ థెరీసా భౌతిక కాయాన్ని ఒక వారం రోజులపాటు సెయింట్ థామస్, కోల్‌కతాలో ఉంచడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాల ప్రజలకు ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రభుత్వం ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించింది.
పేద ప్రజల కొరకు ఆమె చేపట్టిన కార్యక్రమాలు, క్రైస్తవ ధర్మం, శాంతి పట్ల ఆమె కృషిని మెచ్చుకొని, 1971 లో ఆమెకు పోప్ జాన్ శాంతి బహుమతిని అందచేసారు.
శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు. మదర్ థెరీసా ఈ బహుమతిని అందుకున్నపుడు ఆమెను "ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం?" అని అడిగారు. "ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని ఆమె చెప్పారు. ఈ విషయం పై ఆమె తన నోబెల్ ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు: "పేద దేశాలలోనే కాక ప్రపంచం మొత్తంలో నేను పేదరికాన్ని చూసాను, నేను వీధులలో ఆకలిగొన్న వానిని కలిసినపుడు అతనికి కొంత అన్నము, ఒక రొట్టెముక్క ఇస్తే త్రుప్తి పడేవాడు.. కానీ ఒక వ్యక్తి సమాజం నుండి గెంటివేయబడినపుడు, పనికిరాని వ్యక్తిగా భావించబడినపుడు, ప్రేమింపబడనపుడు ఏర్పడే పేదరికం చాలా బాధాకరమైనది, నా దృష్టిలో అలాంటి పేదరికం తొలగించడం కష్టమైన పని." అని అన్నారు.. గర్భ స్రావాన్ని 'ప్రపంచ శాంతికి అతి పెద్ద విఘాతంగా' ఆమె పేర్కొన్నారు.
ఆమె అమెరికాలో "20 శతాబ్దపు అత్యధిక అభిమానం పొందిన వ్యక్తి" గా ఎన్నికయ్యారు.
తెరిసా ఒకానొక సందర్భం లో " దేవుడనేవాడు లేడని భావించారు".. ఆమె అంతరార్ధాన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని చెబుతారు..
పది సంవత్సరాల తరువాత, ఆమె తిరిగి దేవుడిని నమ్మడం ప్రారంభించారు. ఐతే, ఐదు వారాల తరువాత తిరిగి దేవుడిపై కొన్ని సందేహాలు వెలిబుచ్చారు..
"మదర్ థెరీసా మహిళా విశ్వవిద్యాలయము" తమిళనాడు లోని కొడైకెనాల్ లో 1984 లో స్థాపించబడినది.
భారతీయ రైల్వే "మదర్ ఎక్స్‌ప్రెస్", అనే పేరుతో 2010 ఆగష్టు 26 న ఆమె శతజయంతి సందర్భంలో ప్రారంభించింది.
2013 సెప్టెంబర్ 5 నాటి నుండి, థెరెసా వర్ధంతిని ఐక్యరాజ్య సమితి "అంతార్జతీయ దాతృత్వ దినం" గా పాటించబడుతుంది.
ఇలా ఆ పవిత్ర మాత్రు మూర్తి ప్రపంచ చరిత్రలో మరెవ్వరూ చేయని విధంగా ప్రజా జీవితానికి అంకితమైన 1997 సెప్టెంబర్ 5 న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.. ఆమెను చూసి నేటి యువతరం ప్రేమ, శాంతి, కరుణ, సేవ అనే పదాలకు అర్ధాన్ని తెలుసుకోవలని న్యూస్ 6జి ఆశిస్తోంది..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments