భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాల గురించి తమ శాఖలకు తెలియజేశాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా భారత్‌లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఆర్థికంగా కాస్త వెలుసుబాటు కల్పించేందుకు కాలపరిమితితో కూడిన రుణ వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్‌బీఐ సూచించింది
మారటోరియం గురించి తమ శాఖలకు తెలియజేసిన బ్యాంకులు ఈఎంఐ చెల్లింపుల గురించి వినియోగదారులకు సందేశాలు పంపిస్తున్నాయి. ‘వాయిదాలు చెల్లించేందుకు వెసులుబాటు కోరుకుంటున్న వినియోగదారులు బ్యాంకు శాఖలకు మెయిల్ లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా తెలియజేస్తే చాలు’ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ తెలిపారు. చట్ట పరమైన ఇబ్బందుల కారణంగా వాయిదాలు వాయిదా వేయాలని బ్యాంకులే నేరుగా చెప్పలేవని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 ప్రభావం లేనివారు వాయిదాలు కట్టేందుకే మొగ్గుచూపాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు.
మారటోరియం అమలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ, యూకో, ఇండియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓబీసీ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించాయి.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments