లాక్ డౌన్ ని మళ్ళీ పొడిగించారు. ఈ నెల 31వ తేదీ వరకు మరలా లాక్ డౌన్ ఉంటుంది. ఈ లాక్ డౌన్ ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంబీఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదివారం రాత్రి నాలుగో విడత మార్గ దర్శకాలు జారీ చేశారు.
అయితే విమానాలు, మెట్రో రైలు రాకపోకలు పై ఉన్న నిషేధాన్ని అలానే ఉంచారు. ఇదిలా ఉంటే ప్రార్థన మందిరాలు విద్యాసంస్థలు తెరుచుకోవు అని స్పష్టం చేశారు. అయితే చిక్కుకుపోయిన వారిని తరలిస్తున్నట్లు చెప్పారు. దేశం లో చిక్కుకుపోయిన విదేశీయులు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన శ్రామికులు భారతీయులు వలస కూలీలు, విద్యార్థులు ఇతరులని తరలించడానికి అనుమతించారు.
రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధం. అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుందని కూడా తెలియజేశారు. 60 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళు అలానే ఇతర వ్యాధులు ఉన్నవారు గర్భిణులు పదేళ్ళ లోపు చిన్నారులు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి.
అలాగే అత్యవసర ఆరోగ్య పరమైన అంశాలకు సంబంధించి మినహాయింపు ఉంటుందని తెలియజేశారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రం లో ఏ విధంగా బలహీనపరచి రాదు.
అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పాటించాలి. జోన్ల వారీగా కూడా విభజించడం జరిగింది. ఇలా వీటికి సంబంధించిన సడలింపు కూడా జరిగినట్టు సమాచారం ఇచ్చారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments