భారత దేశం ఎటుపోతోంది? అంతా అవినీతి మయం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అనేక ఆశలతో మోడీ ప్రభుత్వాన్ని గద్దెపై కూర్చోబెట్టారు సగటు భారతీయులు.. అయితే మోడీ గవర్నమెంట్ విధానాలు చూసిన కొందరు ఆర్ధికవేత్తలు "ఇది మేమెక్కడా చూడలేదు" అంటూ కళవరపడుతున్నారు.. అందుకు తాజా ఉదాహరణే ఎల్ ఐ సీ వాటాలు విక్రయానికి దేశ ఆర్ధిక శాఖ చూపెడుతున్నసాకులు..
భారతదేశ ఆర్ధిక స్థితిగతిని ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వస్తున్న ప్రభుత్వరంగ సంస్థ ఏదైనా ఉందంటే అది LIC మాత్రమే.. ఇది రైల్వే సంస్థకు లక్ష్యా యాభైవేల కోట్ల రూపాయలు, భారత మాల హైవే ప్రాజెక్టుకు లక్ష్యా పాతికవేల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చింది.. 2017 నాటికి ఏకంగా LIC నుండి ప్రభుత్వం వివిధ అవసరాలకుగానూ తీసుకున్న అప్పు మొత్తం 20 లక్షల కోట్ల రూపాయలు.. తాజాగా కేవలం బడ్జెట్ లోటును పూడ్చడానికే LIC లో వాటాలు విక్రయించాలని నిర్ణయించారు..
ప్రస్తుతం 13 వ పంచవర్ష ప్రణాలిక లో భాగంగా ఇప్పటికే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చేసింది.. ఎప్పటికప్పుడు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందిస్తూ ఆపదలో కాపాడుతున్న ఈ కామధేనువును ఇంకా పిండేస్తాం అన్నట్టు LIC లో వాటాలు విక్రయిస్తూ అడ్డగోలుగా ఆ సంస్థను వాడేసుకుంటున్నారు..
ఈ వాటా విక్రయానికి కేంద్రం చూపుతున్న మూడు కారణాలు:
2019-20 నాటికి LIC దగ్గర 32 లక్షల కోట్లు ఆస్థులు, 31 లక్షల కోట్లు లైఫ్ ఫండ్ ఉన్నాయి..భారత దేశ ముఖ్యనగరాల్లో LIC కి అపారమైన ఆస్థులు పోగుపడి ఉన్నాయి.. ఈ ఆస్థుల విలువ మార్కెట్ లో ఎంత ఉందో లెక్కతేల్చాలని ఒక కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇంకా అందకుండానే 10 లక్షల కోట్ల మేర ఆస్థులను అడ్డగోలుగా విక్రయించేసి డబ్బు చేసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం..
LIC లో ఇప్పటివరకూ 40 కోట్లమంది పాలసీలు కలిగిఉన్నారు.. ఇప్పటివరకూ LIC తాము కూడబెట్టిన లాభాల్లో 95% పాలసీ దారులకు, 5% ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తోంది.. ఇప్పుడు ఉన్నఫలంగా మదుపరులకు లాభం ఆశ చూపి 40 కోట్ల పాలసీదారుల భవిష్యత్తుని నడిరోడ్డున పడేసే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు..
బంగారు బాతు రోజుకొక గుడ్డు పెడుతుందని, పొట్టకోసేస్తే మొత్తం అన్ని గుడ్లు ఒకేసారి పొందవచ్చనే వెర్రి వెంగలప్ప బాతు యజమాని చందంగా ఉంది మన ప్రభుత్వం తీరు.. అంటే అన్నాం అని సదరు అంధ భక్తులు నోరేసుకుని కామెంట్ బాక్స్ లలో పడిపోతారు గానీ దీనికి సరైన సమాధానం మాత్రం చెప్పరు..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments