కరోనా కారణంగా ప్రతిదీ మూసుకున్నాయి. ఆలయాలు సైతం తెరుచుకోవడం లేదు. ఇలాంటి దుస్థితిని మనం కొన్ని రోజుల కిందటి నుంచి కూడా చూస్తున్నాం. అయితే భక్తులు మాత్రం ఆలయాలు తెరవాలని కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం వారికి కొంత ఉపశమనం కలిగించింది.
రాష్ట్రం లోని పలు ఆలయాల్లో ఇకపై పూజలు, కైంకర్యాలు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి అని తెలిపారు. అయితే భక్తులు ప్రసాదాలు కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇలా చేస్తే భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపింది.
అయితే ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా మొదలవుతుందని కూడా తెలియజేశారు.లాక్ డౌన్ ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు చెప్పుకొచ్చారు. ఆలయాలు మూసివేయడంతో దేవుడిని దర్శనం లేక భక్తులు బాధపడుతున్నారు.
అయితే ఇలా బాధపడే వారికి కొంత వరకు ఉపశమనం కలిగింది అని చెప్పొచ్చు. అయితే ఈ సేవలు వినియోగించుకోవడం కోసం కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది.అయితే ఇప్పటికే భక్తులు లేక అనేక ఆలయాలు వెలవెలబోతున్నాయి.
అలాగే ఆలయాల్లో హుండీలో డబ్బులు లేక ప్రముఖ ఆలయాల్లోనూ ఆదాయానికి గండి పడినట్లు ఉంది. అయితే అక్కడ ఉన్న కుక్కే సుబ్రమణ్య ఆలయం, కొల్లూరు మూకంబిక ఆలయం, మైసూరు చాముండేశ్వరి ఆలయం, దుర్గా పరమేశ్వరి ఆలయంలో 100 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చినట్లు చెప్పింది ప్రభుత్వం. దీనితో ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ సేవల ద్వారా కొంతమేర దిద్దుబాటు చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments