డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ నోటినుండి జాలువారిన అనేక నీతి సూక్తులు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం..
మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి.. అందుకే మీరు మీ దేవుడిపైనగానీ, మహానుభావులపైన గానీ ఆధారపడవద్దు..
మండిన కొవ్వొత్తి మనదికానట్లే గతించిన కాలము తిరిగిరాదు..
జీవించేందుకే మనిషి తినాలి.. సమాజ సంక్షేమానికై జీవించాలి..
నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు..
జనం కోసం జీవిస్తే జనం లో బ్రతుకుతావు..
ప్రతి స్త్రీని, ప్రతి పురుషుడిని శాస్త్ర దాస్యం నుండి విముక్తిగావించాలి..
కులం పునాదులమీద మేరేమీ సాధించలేరు..
ఒక జాతిని, నీతిని నిర్మించలేము..
నోర్లులేని మేకల్ని బలి ఇస్తారుగానీ సింహాల్ని బలి ఇవ్వరు..ఇది గుర్తుంచుకోండి..
దేశం అభివ్రుద్ది చెందడం అంటే అద్దాలమేడలు, రంగుల గోడలు కాదు.. దేశ పౌరుల నైతికాభివ్రుద్దే నిజమైన దేశాభివ్రుద్ది..
బ్రాహ్మణుడికి మతం వల్లే ఉపాధి లభిస్తుంది కాబట్టి మతం గురించే గొప్పగా మాట్లాడతాడు..
దళితులకి రాజ్యాంగం వల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి దళితులు రాజ్యాంగం గురించే గొప్పగా మాట్లాడాలి.. ఇక్కడ మతం గొప్ప కాదు..
మతాన్ని నమ్ముకుంటే మళ్ళీ అంటరానితనం, బానిసత్వం వైపు అడుగులు వేసినట్టే.. అదే రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చాప్రాసీ నుండి రాష్ట్రపతి పీఠం వైపు పరుగులెడుతున్నట్టే..
ఏకారణం లేకుండా నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు జీవితం లో ఎదుగుతున్నావన్నమాట.. అకారణంగా ఎదురయ్యే విమర్శలే విజయానికి నాంది..
ప్రపంచ తలరాతలు మార్చగలిగే నేను గ్నానం విషయం లో ఎవరికైనా తలదించాల్సి వస్తే అది ఒక్క అంబేడ్కర్ ముందు మాత్రమే.. - ఒబామా
పోరాడి రాజులవుతారో, అమ్ముకుని బానిసలు అవుతారో ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది..
ఒక జాతి ఔన్నత్యం ఎంత మేరకు అభివ్రుద్ది చెందిందో తెలియాలంటే ఆ జాతిలో నివసిస్తున్న స్త్రీ అభివ్రుద్దిని చూసి అంచనా వేయొచ్చు..
నేను కోరేది ధర్మం మీద ఆధారితమైన శాంతినే గానీ, శ్మశానవాటికలో తాండవించే శాంతిని కాదు.. ధర్మాన్ని మన్నించనంత కాలం ఈ లోకం లో శాంతి అనేదే ఉండదు..
ధర్మ పాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు సమాజం లో నిర్మితం కావాలి..
మనస్సుని నిరంతరం పరిశ్రమ గావించాలి.. అదే మానవుడి ముఖ్యమైన పని అయి ఉండాలి..
రాజ్యంగం తప్పుదారి పట్టిన రోజున ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టేవారిలో ముందు నేనే ఉంటాను..
జీవితం అనేది ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు.. గొప్పగా ఉంటే చాలు..
చరిత్రని మరిచిపోయిన వారెవ్వరూ చరిత్ర స్రుష్టించలేరు..
ఇలా సాగిపోయే బి ఆర్ అంబేడ్కర్ జీవిత సత్యాలు, దేశ భక్తి కి, సమాజ ఔన్నత్యానికి సంభందించిన వాక్యాలు అనగారిన భావి భారతావనిని మేల్కొలుపుతూనే ఉంటాయి.. మరికొన్ని అంబేడ్కర్ నీతి వాక్యాలు మరో వీడియోలో తెలుసుకుందాం..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments