ప్రపంచం అంతా ఈ మహమ్మారి పీడించుకు తింటోంది. దేశ దేశాలు తిరిగి ప్రజల్ని సతమతం చేస్తోంది. అందర్నీ హింసిస్తూ ఈ మహమ్మారి ప్రాణాలతో ఆడుకుంటంది. ఈ రోజు ఉదయం నాటికి మొత్తం ఇండియాలో 4421 కేసులకు చేరింది. అయితే ఇందులో 3981 మంది ఐసోలేషన్ వార్డులో ఉన్నారట. వాళ్లకి వైద్యుల చేత ట్రీటీమేంట్ లభిస్తోంది. అలానే 325 మంది వైరస్ నుండి రికవరీ లేదా డిశ్చార్జి అయ్యిపోయారట. అయితే 11 మంది మాత్రం కరోనా వైరస్ వల్ల మరణించారు.
అయితే మొదట విదేశీయుల నుండి భారతీయులకి ఈ కరోనా వచ్చింది. కానీ ఇప్పుడు ఇది మూడో దశకి చేరిందట. ఈ దశలో భారతీయుల నుండి భారతీయులకి కూడా వ్యాపిస్తోందిట. ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అనుమానం ని వ్యక్త పరిచారు. ఇందులో మొత్తంగా మూడు భాగాలు ఉంటే ఇప్పుడు మాత్రం కరోనా మూడో దశకి చేరింది అని చెప్పారు.
కేవలం ఒక్క సోమవారమే 704 కేసులు భారత్ లో నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లో మాత్రమే 500 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనలకి వెళ్లి వచ్చిన వారికి 1445 మందికి పాజిటివ్ తేలింది.
ఇలా భారత్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో, తమిళ్ నాడు లో పరిస్థితి చాలా ఘోరం. ఎంత ప్రయత్నిస్తున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం కనిపించని దుస్థితి. ఇది కనుక కంట్రోల్ అవ్వక పోతే పరిస్థితి మరి కాస్త కఠినంగా మారి పోతుంది.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments