చాణక్య నీతి - పండితులు కూడా డబ్బున్న వాడిని కీర్తిస్తూ ఉంటారు.

img

చాణక్యుడి నీతి, తొమ్మిదో ఎపిసోడ్ లో భాగంగా కొన్ని ఆశక్తికర అంశాలు తెలుసుకుందాం..

డబ్బు గురించి చాణక్యుడు ఇలా అన్నాడు.. డబ్బు గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడుతుంది.. డబ్బున్న వాడి చుట్టూ అతడి స్నేహితులు చేరి పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.. మరోపక్క బీదవాడు బడుగు జీవుల మధ్య జీవిస్తాడు.. అదే సమయం లో డబ్బున్న వాడిలో ఉన్న లోపాలను చూసీ చూడనట్టు వదిలేస్తుంటాడు.. ఎందుకంటే భవిష్యత్తులో అతడితో ఏం పనిబడుతుందో అనే ఆలోచనతో అలా చేస్తాడు.. పండితులు కూడా డబ్బున్న వాడిని కీర్తిస్తూ ఉంటారు..

పేదరికం ఒక శాపం అని చాణక్యుడు అన్నాడు.. డబ్బు కోసం  విపరీతంగా కష్టపడాలి. 

ఒక వ్యక్తి దేవుడి యందు భక్తికలిగి మర్యాదగా మాట్లాడి, కోరి వచ్చిన వారికి  సంతోషంగా ఆతిధ్యం ఇస్తూ ఉంటే అతడి ఇంట దేవుడు వరాల జల్లు కురిపిస్తాడు.. అటువంటి వారు పుణ్యాత్ములు.. వారు భగవంతుడి స్వరూపం అని భావించాలి.. వారే పుణ్యపురుషులు..

ఎవరైనా తన కుటుంబ సభ్యులపైన, స్నేహితుల పైనా శత్రుత్వం చూపిస్తే అతడు నరకం లో పడతాడు.. 

ఒక సిమ్హం గుహలో ఏనుగు పుర్రె, నక్క స్థావరం లో దూడ యొక్క తోకని ఎలా ఐతే చూడవచ్చో ఒక ఇంట్లో చెల్లాచెదరుగా పడి ఉన్న వస్తువులను చూసి అతడి స్వభావము, జీవన శైలిని అంచనా వేయవచ్చు..

చెడు స్వభావం కలవారు, తక్కువ స్థాయి కుటుంబం లో పుట్టినవారు ఎల్లప్పుడూ డబ్బు వెంట పడతారు. వారికి ప్రపంచం లో అత్యంత విలువైనది డబ్బు మాత్రమే..

సాధారణ స్వభావం కలవారు డబ్బుని పోగేసుకోవాలని చూస్తారు. గౌరవం, గుర్తింపు కూడా పొందాలని చూస్తారు.. 

ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినవారు మర్యాద, పేరు ప్రతిష్టలు మాత్రమే కోరుకుంటూ ప్రాపంచిక సంపదకి తక్కువ విలువనిస్తారు..

డబ్బుని అర్హత ఉన్న వారికే ఇవ్వాలి. సముద్రం తన నీటిని మేఘాలకే అందిస్తుంది. ఆ మేఘాలు ఆ నీటిని అమ్రుతంగా మారుస్తాయి. ఆ మేఘాలు భూమ్మీద వానగా కురిసి జీవరాశికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే దానం చేసేముందు ఆలోచించుకోవాలి.. అపాత్ర దానం వ్యర్ధం.

కష్టపడకుండా గ్నానం సంపాదించలేము.. సోమరితనం వల్ల గ్నానం నశిస్తుంది.. నాయకుడు లేకపోతే సైనికులు బలహీనపడతారు.. భర్త చనిపోయాక భార్యకు జీవితం పైన ఆశక్తి నశిస్తుంది.. అలాగే సమ్రక్షణ లేకపోతే జీవితం వ్యర్ధంగా మారుతుంది..

ఒక వ్యక్తి జీవితం లో లెక్కలేనన్ని దురద్రుష్టకరమైన క్షణాలుంటాయి... కానీ వ్రుధ్యాప్యం లో భార్య మరణం, తరతరాల ఆస్థి తన సోదరులు లోబరుచుకోవడం, ఆహారం దొరుకుతుందో లేదో తెలియకపోవడం, పరాన్న జీవనం అత్యంత దురద్రుష్టకరమైన సంఘటణలు. 

వేదాద్యయనం సంపూర్ణంగా చేయకపోతే ఫలితం శూన్యం.. అంకిత భావం లేకుండా విలువైనదేదీ సాధించలేము. 

దయా గుణం తో ఏ గుణాన్నీ పోల్చలేము.. దురాశ అతి దారునమైన దుర్గుణం.. మనం మన దురాశను పారద్రోలాలి.. జీవితం లో ఏదైనా సాధించాలనుకుంటే స్థిరమైన మనస్తత్వాన్నీ, త్రుప్తి, దయాగుణాన్ని అలవరుచుకోవాలి..

కోపం మ్రుత్యువుతో సమానం, అది చివరకు నిన్ను మ్రుత్యువు ఒడిలోకి తీసుకెల్తుంది..

కోరిక అనేది వైతరినీ నది లాంటిది. ఎందుకంటే అది మానవ హ్రుదయం లో నిర్లక్ష్యంగా ప్రయాణించి మనిషిని నరకంలో ఉన్న అగ్ని కి ఆహుతి చేస్తుంది...  కోరికలకు బానిస అవ్వడం వల్ల మనిషి అన్ని రకాల భాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది..  

ఇలా అనేక నీతి సూత్రాలను చాణక్యుడు మానవాళికి అందించాడు.. మరొక ఎపిసోడ్ లో మరిన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం.

మరిన్ని

Comments

0 Comments

జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()