యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. యోగా శరీరానికి దివ్యఔషధం. శరీరానికి యోగాసనాలు ఎంతో మేలు. అయితే, యోగా ఎలా పడితే అలా చేయకూడదు. వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆసనాలు వేసే ముందు తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి.
ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత యోగా చేయాలి. యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతాం.శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా సులభంగా ఉంటుంది. చక్కని విశ్రాంతి పొందుతారు.
యవ్వనంగా కనిపిస్తారు. శరీరం రిలాక్స్ అవ్వడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి.కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకున్నవారికి యోగా అధ్భుత ఔషధమని చెప్పొచ్చు.శరీరం అనుకున్న విధంగా ఫ్లెక్సీబుల్‌గా ఉంటుంది.తలనొప్పి, మైగ్రేన్ నొప్పి తగ్గి పోతుంది.
వీటితో పాటు మనసు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం , స్వీయ క్రమశిక్షణ అలవాటవుతాయి. ఇలా యోగా తో అందరూ ఆరోగ్య వంతులుగా మారవచ్చు.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments