ఇంట్లోనే ఉంటూ పిచ్చెక్కిపోతున్నారా?

img

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’పై జరిగిన తాజా సర్వేలో  బయటపడ్డ షాకింగ్ విషయాలేమిటి? ఇంట్లోనే ఉంటూ భార్యాభర్తలు  సంతోషకర జీవితం గడపాలంటే ఏం చెయ్యాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మహమ్మారి ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రవేశపెట్టగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. వైరస్ మహమ్మారి పలానా రంగం మీద అని చెప్పలేనంతగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంటి వద్ద నుంచే పని చేయడం మొదలుపెట్టాక అది ఉద్యోగుల నిద్రపై ప్రభావం అధికంగా చూపుతోందని తాజాగా మరో సర్వే తేల్చింది.

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ వేక్‌ఫిట్ ఉద్యోగుల మూడు వారాల వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సర్వే చేసిన ఒక సంస్థ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పలు నగరాల్లో కలిపి మొత్తం 1500 మందిపై సర్వే చేసింది. ఉద్యోగులు నిద్రలేమి సమస్యతో సతమతవుతున్నారని, వారికి ఇంటి పనులు అదనపు భారంగా మారినట్లు గుర్తించారు. లాక్‌డౌన్ పూర్తయితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చునని 81 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్‌ విధించక ముందు రాత్రి 11 గంటలలోపు 46 శాతం ఉద్యోగులు నిద్రపోయేవారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు మొదలయ్యాక రాత్రి 11 లోపు కేవలం 39 శాతం మంది నిద్రపోతున్నారని తేలింది. కొన్ని నగరాలలో 67 శాతం మంది ఉద్యోగుల నిద్రవేళల్లో పూర్తిగా మార్పులు జరిగాయని గుర్తించారు.

గతంలో 25 శాతం మంది రాత్రి 12 గంటల తర్వాత నిద్రించేవారు కాగా, తాజాగా ఆ సంఖ్య 35 శాతానికి పెరిగింది. అంటే దాదాపు 40 శాతం ఉద్యోగులు నిద్రించే సమయం చాలా ఆలస్యమవుతోంది. నిద్రపై ఎందుకు ప్రభావం పడుతుందన్న ప్రశ్నకు: సమయానికి చేతికి డబ్బు వస్తుందా లేదా, జాబ్ తీసేస్తారేమో లాంటి కారణాలు 49 శాతం మంది ప్రస్తావించడం గమనార్హం.

కాగా, వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో ఇంట్లో పిల్లలకు సర్ది చెప్పడం, వారికి స్కూల్ లేకపోవడంతో వారి అల్లరిని తట్టుకుని పనిచేయడం, పనివాళ్లు రాకపోవడంతో ఇంటి పనులలో సాయం చేయడం, వర్క్ టార్గెట్ రీచ్ కావడం లాంటి ఆలోచనలతో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నట్లు ఆ కంపెనీ సర్వేలో తేలింది. పనిలోపనిగా గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు కథనాలు సైతం వెలుగుచూస్తున్నాయి.  

అయితే ఇన్ని సమస్యల నడుమ కుటుంబ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రేమానుభూతి కలకాలం నిలిచి ఉండటానికి, ఎప్పటికప్పుడు తాజా అనుభూతి కోసం మీరు మీ పార్టనర్ కలిసి కొన్ని కపుల్ గోల్స్ పెట్టుకోవడం అవసరం..

కొత్త తరంలో అన్ని అనుభవాలూ వేగంగా మారిపోతుంటాయి. అంటే ప్రేమ, కోపం, తాపం, ఆవేశం ఇలా అన్ని వేగంగా వచ్చి వెళ్లిపోతుంటాయి. ఇలాంటి రాపిడ్ మూమెంట్స్ లో  బంధాల్లో రాపిడి రాకుండా మోపెడు ప్రేమ మీ గుండెల్లో నిలిచి ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు బ్యాలెన్స్ కన్నా గుండెల్లో ప్రేమ బ్యాలెన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

పాపులర్ అవుతున్న కపుల్ గోల్స్ :

ఇవాళ సరదాగా మాట్లాడే మాటల నుంచి సోషల్ మీడియా లో షేర్ చేసే కొటేషన్స్ వరకు "కపుల్ గోల్స్" గురించి తరచూ వింటూ ఉంటున్నాం. చాలా మంది తమ పరిస్థితిని బట్టి కపుల్ గోల్స్ పెట్టుకుంటున్నారు. వీటి ఆధారంగా తమ జీవితం, తమ బంధాలను సెట్ చేసుకుంటున్నారు. గోల్ అంటే లక్ష్యం. కపుల్ గోల్స్ అంటే బంధం మరింత బలపడటానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటికి అనుగుణంగా జీవిస్తూ వాటిని సాధించడం. అనేక సందర్భాల్లో మాటల మధ్య, ర్యాప్ సాంగ్స్ , టీవీ షోస్, ఇంస్టాగ్రామ్ క్యాప్షన్ లో కపుల్ గోల్స్ అనే పదం వాడుతూ ఉంటారు.

ఇంతకీ కపుల్ గోల్స్ అంటే ఏమిటి ?

మిలీనియల్ జెనరేషన్ లో కపుల్ గోల్స్ అర్థం ఏంటంటే.. ఒక జంట తమ మధ్య అన్ని విషయాలను అర్థం చేసుకుని, తెలుసుకుని అన్ని విషయాలను సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవడం. జీవితంలో ఎదరయ్యే అన్ని కష్టాలను, సుఖాలను, బాధలు, సంతోషాలను సమంగా బాధ్యత వహిస్తూ జీవించడం. కపుల్ గోల్స్ అనే టెర్మ్ ను ఎక్కువగా వాడే వారు చెప్పేది ఏంటంటే.. పరిస్థితి ఎలా ఉన్నా కమ్యూనికేషన్ అంటే "మాట్లాడటం" అనేది ఆపకూడదు. ఫ్యామిలీ కౌన్సెలర్ల ప్రకారం కొత్త తరం జంటలు తమ తల్లిదండ్రుల్లా బతకాలి అని అనుకోవడం లేదు.  వాళ్ల పిల్లల పెంపకం వరకు మాత్రమే తమ జీవితాన్ని పరిమితం చేసుకోవాలి అనుకోవడం లేదని అంటున్నారు. పిల్లలే కాకుండా తమ వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం అని అనుకుంటున్నారట.

"లవ్ లైఫ్" ఆనందమయం అవ్వాలి అంటే ఆచరించాల్సిన కపుల్ గోల్స్ ఇవే:

  1. లవ్ లైఫ్ కు ఎక్కడా బ్రేక్ వేయకుండా ఉంచండి:

బెడ్ షేర్ చేసుకోవడం అనేది పార్ట్ నర్స్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. కపుల్ గోల్స్ ఫండాలో ఇది ముందు వరుసలో ఉంటుంది. బంధాల్లో బోర్ రాకుందా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ .. "కొత్త కొత్తగా ఉన్నదీ.. స్వర్గం ఇక్కడే ఉన్నది.." అనే ఫీలింగ్ వచ్చేలా కొత్తగా ట్రై చేయండి. కుదిరినంత మేరకు కొత్త కొత్త ప్రదేశాలను చుట్టిరండి. మీ పార్ట్ నర్ కు కొత్త, అందమైన ఐటంస్ కానుకగా ఇవ్వండి.

  1. ఎట్టిపరిస్థితుల్లోనూ మాటలు ఆపకండి:

ఎంత పెద్ద గొడవ అయినా, అలక అయినా, కమ్యూనికేషన్ మాత్రం అస్సలు తగ్గించకండి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జంటల మధ్య దూరం పెరుగుతుంది.  దీనికి ప్రధాన కారణం ఇగో లేదా అహం. ఇగో ను పక్కనపెట్టి మీ కమ్యూనికేషన్ పై ఫోకస్ పెట్టి సాధారణ పరిస్థితి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి

  1. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి:  

మీరు వేరే వేరు ప్రొఫెషనల్ లో ఉంటే ఒకరి ఫ్రొఫెషన్ ను ఒకరు గౌరవించుకోండి. పార్ట్ నర్ చేస్తున్న పనిని మెచ్చుకోండి.  తన ఇష్టా అయిష్టాలను గౌరవించండి. వీటి వల్ల కూడా బంధాలు బలంగా మారుతాయి.

  1. కలిసి ఎంజాయ్ చేయండి:  

మీ మిత్రులతో  మాత్రమే కాదు.. జీవిత భాగస్వామితో కూడా కలిసి ఎంజాయ్ చేయండి. ఔటింగ్ కి వెళ్లండి. దీని వల్ల అండర్ స్టాండింగ్ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఎన్నో జంటల "కపుల్ గోల్స్" లో ఎడ్వెంచర్ ట్రిప్ పై వెళ్లడం కూడా ఉంటుంది.

  1. కలిసి ఎదగడం:

దీని అర్థం ఏంటంటే ఒకరు కెరియర్ లేదా ఫిట్నెస్ లో ముందుంటే ఇంకొరికి తక్కువ చేయకూడదు. కొంచెం వెనక ఉన్న పార్ట్ నర్ ను వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. దీని వల్ల బంధం మరింత బలపడుతుంది.

వీటితో పాటూ సంతోషంగా ఉండడానికి మరిన్ని అద్భుతమైన చిట్కాలు కొన్ని ఇప్పుడు చూద్దాం..

జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం. అది డబ్బు వల్ల వస్తుంది అని డబ్బు వెనక పరుగెడతాం. వస్తువులు పోగు చేస్తాం. ఏం చేయాలో అవి చేస్తాం. అయినా సంతోషం మాత్రం ఆమడదూరంలో ఉంటుంది. అందుకే సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

పాజిటీవ్ గా ఉండటం చాలా ఈజీ.  ఎప్పుడూ నెగెటీవ్ ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకోండి.  

ఆరోగ్యకరమైన జీవితం ఉంటేనే సంతోషంగా ఉండగలం. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా వ్యాయామాలు చేయండి.

మంచి పోషకాహారం తీసుకోండి. నీరసం దరి చేరదు. నీరసం రానప్పుడు సంతోషం మీ సొంతం అవుతుంది.

నిత్యం నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి. ముఖంపై ఒక చిరునవ్వు  కలిగి ఉండండి.

ధ్యానం చేస్తే  జీవితంలో ఉన్న ఒత్తిడి అనవసర టెన్షన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది. మీ జీవితం ఆనందం వైపు సాగుతుంది.

సో అర్ధమయ్యిందిగా వర్క్ ఫ్రం హోం లో ఎలా ఉండాలో, కుటుంబం లో అందరూ ఎలా సంతోషకర జీవితం కొనసాగించాలో?  ఈ టిప్స్ మీరు పాటిస్తూ మీ స్నేహితులకు కూడా ఈ సందేశాన్ని అందిస్తారని న్యూస్6జి ఆశిస్తోంది..

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()