రోజూ గంజి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

img

రోజూ గంజి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఇవి తెలుసుకుంటే పెద్దపనేమీ లేకుండా అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.. అవేంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి..

మీ ఇంట్లో రోజూ గంజిని వృథాగా పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం మీరు గంజిని అస్సలు వదిలిపెట్టరు. ఈ రోజుల్లో దాదాపు అందరూ కుక్కర్‌లోనే వంటలు చేస్తున్నారు. కానీ, పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రల్లో ఉడికించి గంజిని వడపోసేవారు. ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి గడగడా తాగేసేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలేవీ బయటకు పోకుండా శరీరానికి చక్కగా అందేవి. అయితే.. కాలక్రమేనా గంజిని పక్కన పెట్టేశారు. పాత్రలో గంజిని వచ్చినా వృథాగా పడేస్తున్నారు. గంజి వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే.. ఇక ఎప్పుడూ దాన్ని పారబోయరు. ఇక వివరాల్లోకి వెళ్తే..

- ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండాలంటే గంజిని తీసుకోండి.

- ఇది, శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

- శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

- ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. - కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని ఇది కూల్‌గా ఉంచుతుంది.

- ఇది తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది.

- చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.

- ఇది, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.

- నీటిలో కాసింత గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారట.

- దీనిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.

- కడుపులో మంటతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.

- ఇందులోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.

- నీరసంగా ఉన్నప్పుడు కాస్త ఇది తాగితే ఉత్సాహం వస్తుంది.

- జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

- మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

- వాంతులు, విరేచనాలతో బాధపడేవారు దీనిని ఆహారంగా తీసుకుంటే పోషకాలు అందుతాయి.

- ఇది డయేరియాను తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

- దీనిలో అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండలు పెంచేవారికి ఉపయోగపడతాయి.

- దీనితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

- దీనిని తలకు పట్టిస్తే.. జుట్టు పట్టులా మెరుస్తుంది.

- దీనిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

- దీనిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి.

- అందమైన జుట్టు రాలే సమస్యను కూడా గంజి అరికడుతుంది.

- దీనిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

ఇలా దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి.. మీరు ఇప్పటికే గంజి తాగుతున్నట్టయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి..   

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()