ఆహారంలో ఏది బెస్ట్‌? చ‌లికాలంలో ఏమి తినాలి?

img

ఆహారంలో ఏది బెస్ట్‌?

చ‌లికాలంలో ఏమి తినాలి?

రోగనిరోధ‌క‌శ‌క్తి పెంచుకోవ‌డం ఎలా?

ఇది శాకాహార యుగం. నాన్‌వెజ్ మానేసి చాలాకాలమైందంటూ ఒకింత గర్వంగా చెప్పుకొనే రోజులివి. అయితే మాంసాహారం తినేవారు ఎక్కువ బలంగా ఉంటారని, శాకాహారులకు అన్నిరకాల ప్రోటీన్లు లభించవన్న వాదన మాత్రం వినిపిస్తూనే వుంది. నిజానికి ఏ ఆహారం తీసుకోవాలనేది ముఖ్యం కాదు. దాన్ని మనం ఏ పద్ధతిలో తీసుకుంటున్నామనేది ప్రధానం. నిజానికి మాంసాహారులైనా శాకాహారం తీసుకోకుంటే అనారోగ్యం పాలవుతారనే విషయం చాలామందికి తెలియదు. అందుకే ఇప్పుడు ఏ ఆహారం బెస్ట్ అనే సంగ‌తి తెలుసుకుందాం.

ప్రొటీన్లు మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా పుష్కలంగా లభిస్తాయి. కానీ శాకాహార పదార్థాల్లో కొన్నింటిలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు మాత్రమే లభిస్తాయి. శాకాహారంలో ప్రొటీన్ల నాణ్యత పెంచడం మన చేతుల్లోనే వుంది. మన శరీరం తయారుచేసుకోలేని అమైనో ఆమ్లాలన్నీ అందే విధంగా అన్ని రకాల పదార్థాలు కలిపి సమంగా తీసుకుంటే మాంసాహారం కంటే శాకాహారం తీసుకుంటూ నాణ్యతగల ప్రొటీన్లు పొందవచ్చు.

ఇడ్లీ, దోసె, పెసరట్టు లాంటి వాటి త‌యారీలో పప్పులను కూడా కలుపుతాం. కాబట్టి మామూలు అన్నం కంటే ఇవి మంచి ప్రొటీన్లు అందిస్తాయి. నూనె గింజలతో చేసిన పల్లీ చట్నీ, నువ్వుల కారం వంటి వాటితో కలిపి తింటే వీటిలోని ప్రొటీన్ల నాణ్యత మరింత పెరుగుతుంది. ఇలా సక్రమ పద్ధతిలో తీసుకుంటే శాకాహారం తీసుకునేవారు అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలను పొందగలుగుతారు. పప్పులో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ పప్పుల్లో లేని మిథియొనైన్ అనే అమైనో ఆమ్లం బియ్యంలో వుంటుంది. పప్పు ధాన్యాల్లో ఉండే లైసిన్ బియ్యంలో ఉండదు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల నాణ్యత పెంచడానికి తప్పనిసరిగా రోజూ పప్పన్నం తినాలి. సాధారణంగా వయసు పెరిగిన వారు పప్పు తింటే గ్యాస్ సమస్యతో బాధపడాల్సి వస్తుందని పప్పులకు దూరంగా ఉంటారు. కాని చాలా సమయం వరకూ ఏమీ తినకుండా ఉంటేనే కడుపులో బాగా ఆమ్లం తయారై గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. అంతేగాని దీనికి పప్పు తినడమే కారణమనుకోవడం సబబు కాదు. వృద్ధాప్యంలో పప్పులు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఎక్కువగా ఎములకు బలం చేకూరడానికి కాల్షియంతోపాటు ప్రొటీన్లు కూడా కావాలి. 

పప్పులు తీసుకోవడంవల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా గాయం అయినప్పుడు పప్పులు మానేయాలని, లేకపోతే చీము పడుతుందని చాలామంది భావిస్తారు. కాని పప్పు తినడంవల్లనే గాయం త్వరగా మానే అవకాశం వుంది. గాయం మానాలంటే ఆ భాగంలో కొత్త కణజాలం ఏర్పడాలి. ఇందుకోసం ప్రొటీన్లు కావాలి. కాబట్టి ప్రొటీన్లనిచ్చే పప్పు అధికంగా తీసుకోవడం గాయాన్ని మాన్పడంలో తోడ్పడుతుంది. అలాగే గింజలలో అధిక ప్రొటీన్లను పొందవచ్చు. ముఖ్యంగా తెల్ల నువ్వుల్లోయాంటి ఆక్సిడెంట్లు, మిథయునైన్ అనే అమైనో ఆమ్లం అధిక మోతాదులో ఉంటాయి. అందుకే ఆయిల్ టెక్నాలజీ నిపుణులు రోజూ ఒక చెంచాడు తెల్ల నువ్వులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. చిక్కుళ్ళు, శెనగ, బఠాని వంటి లెగ్యూమ్స్‌లలో అధిక మోతాదులో ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటి గింజలను మొలకెత్తించినపుడు ఎంజైములు చైతన్యవంతమౌతాయి. కాబట్టి వీటిని తీసుకుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే గోధుమ రంగు సోయా చిక్కుళ్లలో అత్యధిక శాతం ప్రొటీన్లు ఉంటాయి. వీటిని పది నిముషాలు వేయించిగాని, కొద్దిసేపు నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి గాని తింటే ఆరోగ్యకరం.

మసాలా దినుసులలో వాడే గసగసాల్లో 27 శాతం ప్రొటీన్లు ఉంటాయి. వీటి ద్వారా అన్నింటికన్నా ఎక్కువ కాల్షియం లభిస్తుంది. వీటిని మసాలాగానే కాక పాయసం రూపంలో కూడా తీసుకోవచ్చు. రాత్రి పూట పాలలో కలుపుకుని తాగితే వాటిలో ఉంటే ఓపియం ప్రభావం వల్ల నిద్ర బాగా పడుతుంది. శరీర పెరుగుదలకు, కండరాల దృఢత్వానికి ప్రొటీన్లు మాత్రమే కాదు, కేలరీలు కూడా కావాలి. అందుకే మాంసాహారం తీసుకోవడవల్లనే శరీరానికి బలం చేకూరుతుందనుకోవటం నిజం కాదు. కేలరీలను తగిన మోదులో అందించే శాకాహారం కూడా తీసుకుంటూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. మనం తీసుకున్న ప్రొటీన్లు జీర్ణం కావాలంటే శక్తి కావాలి. ఈ శక్తికోసం కార్బోహైడ్రేట్లమీద ఆధారపడక తప్పదు. అందుకే అన్నం, కూరగాయల వంటి శాకాహారం జోలికిపోకుండా కేవలం చికెన్లు, మటన్లు తీసుకుంటే ఏ మాత్రం లాభం ఉండదు. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు జీర్ణం కావడానికి కావలసిన కొన్నిరకాల ఎంజైమ్స్, కో ఎంజైమ్స్ తయారుకావడానికి ఈ ఖనిజాలు అవసరం. మాంసాహారంలో లభించని ఖనిజాలు శాకాహారంలో ఉంటాయి. మాంసాహారులు సైతం పండ్లు, కూరగాయలను తీసుకోక తప్పదు. మాంసాహారంలో పీచు పదార్థాలు అసలే వుండవు. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగడానికి, పేగుల కదలికలకు ఈ పీచు పదార్థాలు వున్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అందువల్ల ఫైబర్ కోసం శాకాహారంపై ఆధారపడక తప్పదు.

చలికాలం ముంచుకొస్తోంది ఇలాంటి వాతావరణంలో ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. తరచూ జలుబు చేస్తుంటుంది. చాలామంది కాస్త దగ్గు, జలుబు, రొంప, జ్వరం కనిపించగానే.. అలా మందుల దుకాణానికి వెళ్లడం.. ఏదో ఒక యాంటీబయాటిక్ కొని వేసుకోవడం సాధారణంగా చేస్తుంటారు. దీనితో రెండు రకాల నష్టాలు ఉన్నాయి. రోగనిరోధకశక్తి తగ్గిన కారణంగా మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే జబ్బులు తగ్గకపోవడం మొదటిదైతే.. ఆ మందలు సైడ్ ఎఫెక్ట్స్ రెండో ప్రమాదంగా చెప్పవచ్చు. ఇలా మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. దీనితో తరచూ వచ్చే జబ్బులే కాదు.. కొన్ని రకాల దీర్ఘరోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.

చిలగడదుంప:

దీనినే మోరంగడ్డ, దెనుసుగడ్డగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే.. ఇక ఇది మేనికి ఎంతో మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షణనిస్తుంది. ఇక ఇందులో ఉండే చక్కెరల వల్ల గుండె, రక్తప్రసరణ వ్యసవ్థ, నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవన నాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు. వర్షాలు పడుతున్న నేటి తరుణంలో ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా రుచికరమైన చిట్కాలు. వీటితో పాటు అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం, ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తింటుండటం కూడా బాగా ఉపకరిస్తుంది.

చికెన్ సూప్:

మాంసాహారం తినేవాళ్లైతే జలుబు, రొంప వంటి తరచూ సోకే ఇన్‌ఫెక్షన్లకు కమ్మటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. చికెన్ సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడి పులుసు పెట్టేటప్పుడు ఈ అమైన్ ఆసిడ్ విడుదల అవుతుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో మంచి వ్యాధి నిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు చికెన్ సూప్‌లో ఉండే జిలాటిన్ అనే అమైనో యాసిడ్ వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు.. చికెన్‌సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది.

వెల్లుల్లి:

ఇది ఉల్లి జాతికి చెందిన వంట దినుసు. ఇది ఘాటుగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో వ్యాధులపై కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక వ్యాధులను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసేన్ అనే పోషకం చాలా రకాల జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా.. మనం తినే ఆహారాల్లో ఫ్రీ-రాడికల్స్ అనే పదార్థాలు అనేక దుష్ప్రభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు ఎన్నో రకాల కేన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు.. శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

నిమ్మజాతి పండ్లు:

నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి, కమలాలు వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఇవి చాలా వ్యాధులకు మంచి రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. అంతేకాదు.. కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల వీటిని తినేవారు దీర్ఘకాలం యవ్వనంగా ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి బగా తోడ్పడతాయి. వీటిలో ఎక్కువ పీచు, తక్కువ కేలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. దాంతో చాలా జబ్బులు తగ్గుతాయి. 

ఇలా ఎంతమంది ఎన్ని విధాలుగా వివరించినా నాన్ వెజ్ తింటే గట్టిగా తయారవుతారు.. కూరగాయల్లో ఏముంది అంటూ మాంసాహారాన్ని అభిమానిస్తూ ఉంటారు.. అలాంటి వారు కొంచం లాజికల్ గా ఆలోచింది నిర్ణయం తీసుకోవాలని మేము భావిస్తున్నాం.. 

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()